Monday, June 21, 2010

దేవుడా.....ఎక్కడున్నావు?

"అమ్మా,దేవుడు అంటే ఎవరు? పెద్దవాల్లందరూ దేవుళ్ళతో సమానం అన్నవుకదా,ఐతే, దొంగలు కూడా దేవుళ్ళేనా? దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశంలో వుంటాడా? అంటే పెద్దవాళ్ళు దేవుళ్ళైతే ఆకాశంలో ఎందుకు లేరు? మనలోనే వుంటాడా దేవుడు? అంటే లోపలికి ఎలా వెళ్ళాడు? బయటకి ఎప్పుడొస్తాడు? అతనికి ఊపిరి ఎలా ఆడుతుంది? దేవుడు ఎప్పుడూ మంచిపనులే చెయ్యమంటాడు అన్నావు కదా, మరి ఎందుకు మంచి పనులెప్పుడూ బోర్ కొడుతుంటాయి?దేవుడు ఎందుకు స్కూల్ కి వెళ్ళొద్దు ఆడుకో అని చెప్పడు?దేవుడు ఆకాశం లోనో, మనలోనో వుంటే మరి రిషి ఏంటి గుడిలో వున్నాడని చెప్తాడు? అసలెక్కడున్నాడు నీకు కరెక్ట్ గా తెలుసా లేదా? దేవుడు మనుషులని ఎలా తయారు చేశాడు? దేవుడు స్కూల్ కి వెళ్ళాడా? దేవుడు జాబ్ చేస్తున్నాడా? మరి దేవుడు కి కూడా అమ్మ నాన్నా, పిల్లలు అందరూ వున్నారా? "

దేవుడా......ఏంటి ఈ దేవుడి గోల అనుకుంటున్నారా! నా కొడుకు, లక్కీ నన్ను రోజూ ఇలాంటి ప్రశ్నలతో ఆయిల్ లేకుండా వేపుకొని తినేస్తున్నాడు. అసలే నాకు దేవుడుగురించి చాలా తక్కువ తెలుసు(అసలు అతనెవరో/ఆవిడెవరో నాకు నిజంగా తెలీదు) నాకు తెలియని విషయాలు, నాకు అర్ధం కాని విషయాలు ముఖ్యంగా ఈ దేవుడు, పూజలు, మతం అనే విషయాలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు.నేను నాస్తికురాలినో,ఆస్థికురాలినో కూడా నేను ఆలోచించలేదు. నాకు నిజ జీవితంలో అంతగా అవసరం పడని టాపిక్  దేవుడు మరియు మతం. మా మమ్మీ డాడీ కూడా పెద్దగా పూజలు చేసి గుళ్ళకి గోపురాలకి తిరిగిన వాళ్ళు కాదు.పండగంటే కొత్త బట్టలు, పిండివంటలు, టపాకాయలు, ఒక ఇంట్రెస్టింగ్ కధ, కొన్నిరోజుల సెలవు, ఆటలు. ఇదే తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే కొంత పెద్దయ్యాక పండగలంటే మా మమ్మీ మీద తోటి ఆడవాళ్ళందరి మీద జాలి కలుగుతుంది. మిగిలిన రోజులకంటే పండగంటే ఇంకాస్త పని ఎక్కువ. ఎక్కువ వంటలు, పూజలు, వాటికి ప్రసాదాలు వగైరా వగైరా. 

నేను పుట్టింది హిందువుల ఇంట్లో, చదివింది ఎక్కువగా క్రిస్టియన్ విద్యా సంస్థలలో, స్నేహితులు వున్నది అన్ని మతాలనుండి. ఒక్కో స్నేహితుడు/స్నేహితురాలు ఒక్కో మతానికి సంబందించిన మంచి/చెడు గుణాలతో నాకు ఆ మతం మీద కొంత అవగాహన కల్గించారు.కాని నేను మతం దేవుడు గురించి ఆలోచించింది ఒకే ఒక సంధర్భం (నాకు తెలిసి). చిన్నప్పుడు స్కూల్ లో " ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవమూ..ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతమూ..." అనే పాటకు స్కూల్ ఫంక్షన్లో నేను డాన్స్ చేశాను. అప్పుడు ఆ పాట ని కొన్ని వందల సార్లు పాడటం, వినటం జరిగింది.ఆ పాట నాకెంతో నచ్చింది. అప్పుడే ఆలోచించాను. మతం ఏమి చెప్తుంది? ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అని చెబుతుంది. అది ఏదో ఒక మతం కాదు అన్ని మాతాలు అలాగే చెప్తాయి. అదే పని మతం కంటే ముందు మన హృదయం చెప్తుంది.అందుకే హృదయం కంటే మించిన మతం లేదు. అప్పుడే నాకు నా మతం గురించి ఆలోచనలు ఆగిపోయాయి. నా స్నేహితులలో,కాళిదాసులో పట్టుదల, నిస్ట; మేరీ లో ప్రేమ గుణం,స్వరూపలో క్షమించే సహనం, షాహిద్ లో కుటుంబానికి పెద్దలకి ఇచ్చే గౌరవం ఇవన్నీ వివిధ మతాలలో చెప్పిన మంచి గుణాలు. మంచి ఏది చెడు ఏది అని తెలియజేయటమే మతం వుద్దేశ్యం. 

మళ్ళీ ఇందులో నాకు కొన్ని అనుమానాలు కూడా వున్నాయి. మంచి చెడులు కాలానికి అణుగుణంగా మారుతుంటాయి కదా(అన్నీ కాక పోయినా కొన్ని అయినా). ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన పెద్దలు వ్రాసిన నీతులు, నియమాలు ఈనాటి కాలానికి, సామాజిక పరిస్థితులకు సరిపోతాయ?(సరిపడకనే అందరు నీతి తప్పుతున్నారా?) నీతి నియమాలంటే ఎప్పుడూ మారనివా?లేక కాలానికి తగిన విధంగా మారాల?అసలు మత గ్రంధాలలో చెప్పిన వాటిని నీతి నియమాలంటారా లేక వేరే ఏమైనా అంటారో "అవి"ఎప్పటికీ అలాగే వుండాలా?మారాలా? మత గ్రంధాలే మనిషి జీవితానికి ముఖ్యమైన మార్గదర్శకాలు అయినప్పుడు, వాటిని ఎందుకు ఎవరూ రివైస్ చెయ్యరు? చట్టం లో ఎలా మార్పులు చేసుకుంటున్నమో మత నియమాలు, జీవన మార్గదర్సకాలైన ఈ నియమాలు ప్రజలని,సమాజాన్ని మంచి మార్గంలో నడిపే విధంగా ఎందుకు ఎవరూ తిరిగి వ్రాయటంలేదు.(ఇదే ప్రశ్న ఒక సారి ఎవరినో అడిగితే నువ్వే వ్రాయొచ్చుకదా అన్నారు, నాకెందుకొచ్చిన గొడవ అని నోరుమూసుకున్నా అప్పటినుండి). కానీ దేవుడు, మతం ఇవన్నీ చాలా అంతులేని కంఫ్యూజన్. నాకు తెలిసిన బెస్ట్ మతం హృదయం/మనసు(నా హృదయం నాదగ్గరలేదు ఎవరికో ఇచ్చేసాను అని చెప్పకండి ప్లీజ్, నేను చాలా సీరియస్ విషయం చెప్తున్నాను).   

అసలు పిల్లలికి ఇన్ని అనుమానాలు ఎలా వస్తాయో? అందులోనూ వీడికి ఈ దేవుడి డౌట్లే ఎందుకొస్తాయో? పిల్లలికి దేవుడూ, భక్తి ఇవన్నీ నేర్పాలి అంటారు ఇంట్లో అత్తయ్య వాళ్ళు. నాకే అన్ని అనుమానాలున్నప్పుడు నేను ఏమని నేర్పను? నాకేమనిపిస్తుందంటే కొంత వయసు వచ్చాక ఎలాగు పిల్లలికి అన్ని మతాల గురించి తెలుస్తుంది, లేదంటే అని మతాల గురించి తెలియ జేసి, వారు ఏ మత మార్గం పాటించాలనుకుంటున్నరో ఎన్నుకొనీయాలి.లేదా మతమే లేకుండా బతికే అవకాశం ఇవ్వాలి.ఇలా ఆలోచనలు రేపుతున్న పిల్లలే మనల్ని ఎదిగేలా చేస్తుంటారు,కానీ మనమేమో మనమే పిల్లల్ని పెంచుతున్నాము అనుకుంటాము.అంతా మన పిచ్చి. 

లక్కీ ఇలా దేవుడి గురించి ఏదో అడిగేసి నాతో తిట్లు తినేసి ఎంచక్కా వెళ్లిపోయి ఆడుకుంటాడు లేదా కార్టూన్ చూసుకుంటాడు. నేనేమో పిచ్చిదానిలా పైన చెప్పినవన్నీ అలోచించీ,చించీ నా బుర్ర పాడు చేసుకుంటాను. అప్పుడొస్తుంది వాడి మీద కోపం, వెంటనే లక్కీ ని పిలిచి "ఒరేయ్ ఇంకెప్పుడైనా దేవుడి ప్రశ్నలు వేశావంటే తంతాను జాగ్రత్త" అని బెదిరిస్తాను. వాడు అదేమీ పట్టించుకోకుండా వెంటనే "అమ్మా దేవుడు ఏ రంగులో వుంటాడమ్మా?, కృష్ణ కార్టూన్ లో మరి కృష్ణుడు బ్లూ కలర్ లో వున్నాడేంటమ్మా? అలా రంగు పూసుకున్నాడా? అంటే దేవుళ్ళు మనలాంటి కలర్లో వుండరా? వాళ్ళదగ్గర బోల్డంత బంగారం వుందా?" ..........

"దేవుడా!!....ఏదో ఒక దేవుడా!!....నన్ను ఈ పిల్ల పిశాచిగాడి ప్రశ్నల నుండి కాపాడు ప్లీజ్.. నీకు పూజలు చెయ్యలేదని ఇలా కక్ష తీర్చుకుంటున్నవా, కొంపదీసి???"  


18 comments:

Anonymous said...

{అసలు పిల్లలికి ఇన్ని అనుమానాలు ఎలా వస్తాయో? అందులోనూ వీడికి ఈ దేవుడి డౌట్లే ఎందుకొస్తాయో? }

అతితెలివి పెద్దలు చెప్పిస్తే వస్తాయి అని ఆ పిల్లవాని ప్రశ్నలను బట్టి తెలుస్తోంది. :P

శిరీష said...

@ anonymous: nene nerpanantara ? ayi vuntundi. nenu kooda ilage prasnalu vesedannemo! ma mommy ni adagaali.

Anonymous said...

అందుకే పిల్లలకి తెలుగు సిన్మాలు , టివీ సీరియళ్ళు పిల్లలకు చూపకూడదండి. ఇంకా ముదురు మాటలు మాట్లాడేయగలరు, బేబి షామిలీ లాగా.

సవ్వడి said...

మీకు ఓ విషయం చెప్పాలి. మనది మతం కాదు. జీవన విధానం. హిందూ మతం అంటూ లేదు. హిందూ జీవన విధానం మాత్రమే ఉంది. అందుకే మనకి ప్రవక్తలు లేరు. మిగతా మతాలకు ప్రవక్తలు, భోధకులు, ప్రచారకులు ఉన్నారు. మనకి ఎవరూ లేరు.
మనం రెండు ధర్మాలను పాటించాలి. 1. నిత్య సత్యాలైన వేదాలను పూజించటం. 2. గో మాతను రక్షించి పూజించటం. ఇవి బేసిక్స్.

bloggerbharathi said...

yadhaa raajaa, tadhaa prajaa

భావన said...

ఈ పిల్లలకు సందేహాలు మన సమాధానాలు తప్పవు కదా. వాళ్ళకు తెలియనివి అందునా ఎదురుగా కంటికి కనపడని దేవుడీ గురించి ఆలోచనలు సహజం. వివేకానందుడి పుస్తకాలు చదవండి మీ ఆలోచనలన్నిటికి సమాధానాలు దొరికి పిల్లలకు చెప్పగలరని అనుకుంటున్నా.

sumanth said...

paina prashnalaku...contact me ;)...hehehe

శిరీష said...

@Anonymous, he wont watch movies only cartoons.(nenu kooda :):))

@Jaya bharathi garu, nenu maree oke topic meeda prasnalu veyyanandi

@Bhavana garu, thanks tappakunda chaduvutanu.

@Dreamer garu, mee address cheppandi lucky ni pampistanu.

శిరీష said...

@Savvadi, hmmm manadi jeevana vidhaname, kaani vedhalu chadavatam, gomaatanu poojinchatam naa valla kaadandi sorry.

కృష్ణప్రియ said...

పిల్లలు అనుమానాల పుట్టలు.. ఈ కాలం పిల్లలయితే.. మరీ ఎక్కువ.
పెద్దలు.. 'నీకెందుకు? వెళ్ళి ఆడుకోపో.. ' లాంటి సమాధానాలివ్వకపోతే..

దేవుడి గురించి చాలా అడుగుతారు (నా ఇద్దరి పిల్లల తల్లిగా , మా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో పిల్లల కోసం పత్రిక నడిపే ఎడిటర్ గా చెప్తున్న మాట)

కంటికి కనపడడు, మన పూజలు, నైవేద్యాలు, చూస్తారు. స్కూళ్ళల్లో (క్రిస్టియన్ మిషనరీ వైతే) ఇంకోటి వింటారు.. తప్పు చేస్తే దేవుడు దండిస్తాడని వింటారు.. ఒక్కోసారి తప్పులు చేసి అబద్ధాలు చెప్పేవాళ్ళు తప్పించుకోవటం చూస్తారు.. వాళ్ళు ఏదో ఒక కంక్లూషన్ కి (విసుగుతో వదిలేయటమో, లేక వాళ్ళే ఏదో ఒక నిర్ధారణ కి రావటం వల్లో, లేక ఇతర డీవియేషన్లో..) వచ్చాక వదిలేస్తారు.

ఈ లంకె లో ఒక పాప కూడా దేవుడి మీద ఏదో చెప్పింది. :-)
http://rani-ratnaprabha.blogspot.com/

నేను said...

vedhalu chadavatam, gomaatanu poojinchatam naa valla kaadandi sorry//

savvadi gaaru vedaalani poojinchamani chepparu chadavamani ani kaadu :P

Meeru beef tinakundaa, kanipinchina aavunanthaa kaaranam lekundaa kottakundaa vunte mee anthalo meeru rakshinchi poojinchinatle :)

శిరీష said...

@ Badri,hahahaha... naakemaina pichi vunda kanipinchina aavunanta kottadaaniki? sare vedalanu poojinchatam ante kooda ....doutee

శిరీష said...

@krishnapriya garu, thanks for commenting and sharing ur experience

హరే కృష్ణ said...

ప్రవీణ్ శర్మ సైన్సు బ్లాగు చూపించండి
దెబ్బకి మారు మాట్లాడాడు మీ అబ్బాయి
అదే మీ పాలిట స్కానో రక్షిత రక్షితః
nice post

హను said...

naa menaLLuDu kuDa amte, vaaDu oka question book laa tayaraYYaDu.

ఆ.సౌమ్య said...

అవునండీ రేపిస్ట్ కవిత్వం చివరి భాగం చెప్తానని ఇలా దేవుడా ఎక్కడున్నవంటారేమిటీ, ఆరోజు ఆతరువాతేమయిందోనని మేమంతా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటే?

రాజ్ కుమార్ said...

good post..
ఆయిల్ లేకుండా వేపుకొని తినేస్తున్నాడు (bhalluna navvesaanu ikkada. ha ha..)
avunandi.. twaraga రేపిస్ట్ కవిత్వం ki 2nd part raayandi.. suspense lo pettesaaru mammalni.

Kathi Mahesh Kumar said...

" ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవమూ..ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతమూ..."...ఇలాంటి పాటొకటి ఉందా! బబ్బాబూ అదేదో పూర్తిగారాసి ట్యూన్ చెప్పండి...