Friday, July 30, 2010

అది ఒప్పా( ఉప్పా)తప్పా ???

హాయ్ ... ఇప్పుడు టైము 9.25 రాత్రి. ఇంకా ఆఫీస్ లో వున్నాను. ఇప్పుడే కాస్త ఈరోజు పని అయింది కానీ వెల్దామంటే వర్షం పడుతుంది. ఇంటికెళ్ళాలని ఇక అనిపించటం లేదు. లక్కీ ఆల్రెడీ ఇంటికొచ్చి అమ్మా ఎప్పుడొస్తున్నావు అని 6 సార్లు ఫోన్ చేసీ చేసీ నిద్రపోయాడు. ఇప్పుడే చిన్నమ్మ( మా ఇంట్లో వుంటుంది మాకు తోడుగా) ఫోన్ చేసి చెప్పింది లక్కీ నిద్రపోయాడు అని. ఇంకా ఎన్ని రోజులు ఇలా బిజీ గా వుంటానో అర్ధం కావటం లేదు. సునామీ వచ్చిన తరువాత ప్రాజెక్ట్ మొదలు పెట్టిన మొదట్లో ఇలాగే వుండేది. ఆ తరువాత ప్రతీ తుఫాను సమయంలో వరదల సమయంలో, ఆడిట్ సమయం లో, ముఖ్యమైన మీటింగ్స్ కి బిజీ గా వున్నా మరీ ఇన్ని రోజులు కాదు.

సరే ప్రపంచం లో అందరూ బిజీ నే, నీ గొప్పేంటి అనుకుంటున్నారా! ఏమీ లేదు. నా బ్లాగు కాబట్టి నా సోదే కదా రాసేది.

ఇంతవరకు ఇన్స్యూరెన్సు కంపెనీ వాళ్ళతో మీటింగు అయ్యింది. మనసంతా చికాకైపోయింది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఉప్పు రైతుల కోసం ఒక ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ ఫెసిలిటేట్ చేసి పైలట్ చేసాము. అది ఒప్పా తప్పా అని అర్ధం కావటం లేదు. లైలా వచ్చి ఉప్పు రైతులు చాలా నష్టపోయారు. కానీ ఇన్స్యూరెన్స్ వాళ్ళు కనీసం ప్రీమియం కట్టిన దానికంటే కూడా తక్కువ క్లెయిం ఇస్తున్నారు. అదేమి అంటే మేము పలానా క్లాజు ప్రకారం  ఇలాగే అని చెప్తున్నారు. ఈ ఇన్స్యూరెన్సు, అందులో మైక్రో ఇన్స్యూరెన్సు ఏమీ  అర్ధం కాదు, కేవలం కంపెనీ వాళ్ళకే ఎప్పుడూ అనుకూలంగా వుంటాయి. ఇక రైతుల వైపు చూస్తే పోయిన సారి వేసవి కాలం ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ ఉత్పత్తి వచ్చేసి రేటు పడిపోయిందని పోయిన ఏడాది  సరుకు కూడా ఇంకా స్టాకు పెట్టారు. దాని వల్ల పెట్టుబడికి డబ్బులేక ఈసారి ఎక్కువ అప్పుచేసారు, తీరా లైలా కరెక్ట్ టైములో వచ్చి స్టాండింగ్ క్రాప్ తో పాటు రెండు సంవత్సరాల నిల్వ ఉప్పు కూడా తీసుకు పోయింది. ఉప్పు రైతు సరుకు లేక, పండించాలంటే ఎండలేక, అప్పులతో మిగిలిపోయాడు.

వ్యవసాయం చేసే వాళ్ళకి గవర్నమెంటు ఎన్నో సబ్సిడీలనీ, ఋణాలనీ చాలా చేస్తుంది. కానీ తెల్లారి లేస్తే ఎందులో ఉప్పులేక పోయినా బతకలేని మనకి అసలు ఆ ఉప్పు పండించే ఒక రైతు వుంటాడనీ కూడా గుర్తులేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు "ఉప్పు పండిస్తారా, టాటా వాళ్ళు ఫేక్టరీ లో కదా తయారు చేస్తారు" అని అడిగారంటే ఉప్పు రైతుల పరిస్తితి ఎంత దారుణమో ఊహించండి. ఉప్పు వ్యవసాయం కిందకి రాదు, పరిశ్రమల విభాగం కింద వస్తుంది అంటే మామూలు రైతుకి కరెంటు కి సబ్సిడీ రేటైతే ఉప్పు రైతుకి పరిశ్రమల రేటు, అదీకాక వుప్పు పండించే భూములన్నీ  సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో వున్నాయి వాళ్ళు ఎవరో పెద్ద కౌలుదారులకి ఆ భూమి వందల ఎకరాల్లో కౌలుకి ఇచ్చారు, ఇంకా ఆ లీజు వందల సంవత్సరాలుగా వాళ్ళకే వంశపారంపర్యంగా వస్తుంది. కానీ నిజానికి వాళ్ళెవరికి కనీసం ఉప్పు పంట ఎలా వుంటుందో కూడా తెలీదు. వాళ్ళు చిన్న చిన్న ఉప్పు రైతులకి తిరిగి ప్రతీ సంవత్సరం లీజుకి ఇస్తున్నారు. ఇలా తరాలుగా జరుగుతుంది కానీ ఏ ఉప్పు రైతు కూడా భూస్వామి కాలేకపోతున్నాడు.

కేవలం వేసవి కాలంలో ఉప్పు పండుతుంది, కళ్ళు మిరిమిట్లు గొలిపే మండుటెండలో ఉప్పు పండించాలి. కను చూపు మేరలో ఎక్కడా చిన్న నీడ కూడా వుండదు. చూట్టూ నీరున్న ఎక్కడా తాగడానికి మంచి నీరు దొరకదు.ఊరికి దూరంగా వుంటాయి ఉప్పు పొలాలు. ఆ ఉప్పు నీరు, అధిక వేడీ...కోసుకునే ఉప్పు, చర్మం, కళ్ళు దెబ్బతింటున్న కేవలం కొద్ది కాలమే పండే పంట కనుకా, ఆ తరువాత ఇక ఆ భూమి ఎందుకూ పనికి రాదు కనుక కుటుంబం అందరూ పిల్లా పెద్ద ఆడా మగా ఆ 4 నెలలు అదే పని చేస్తారు. ఇంత చేసినా కూడా ధర ఎలా వుంటుందో తెలీదు, వాన ఎప్పుడొచ్చి ముంచేస్తుందో తెలీదు, సూర్యుడు అలిగి మేఘాల మాటున దాగున్న కూడా సరైన సెలినిటీ రాక ఉప్పు పండదు, కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు భూమి లో నుండి నీరు మోటర్ల ద్వారా పైకి తీస్తారు, ఆ మోటరు ఎప్పుడు పాడైపోతుందో, గుజరాత్ లో ఎక్కువ పండేస్తే ఇక్కడ రేటు పడిపోతుందో....ఇలా ఎన్నో సమస్యలు అన్నీ చెప్పలంటే నాకు 5 సంవత్సరాలు సరిపోదు ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలుగా వింటున్నాను, చూస్తున్నాను ఎంత చేసినా తరగని పని వుంది కానీ అందుకు సరిపడా నిధులు, టెక్నాలజీ, అధికార సహకారం, పాలసీలు ఏవీ లేవు. వెళ్ళిపోయే ముందు వాళ్ళకి లైలా మిగిల్చిన విషాదం లో వదిలి వెళ్ళిపోతున్నము అని బాధగా వుంది.ఉప్పు కోసం ప్రత్యేకంగా ఎవరైనా పనిచేస్తే బాగుండు అనిపిస్తుంది.వర్షం పడుతుంటే చూసి ఆనందించాలో ఉప్పు రైతులు గుర్తొచ్చి బాధపడాలో తెలియదు.

ఇక నా పర్సనల్ విషయాలకి వస్తే ఒకే ఒక ఇంటర్యూకి వెళ్ళగలిగాను,టైము కుదరక. అది కూడా బాలసహయోగ ప్రాజెక్ట్, కేర్-ఇండియా ప్రాజెక్టే.హెచ్.ఐ.వి కుటుంబాలకు అందులో ముఖ్యంగా పిల్లలకు ఆదాయ మార్గాలు చూపించే ప్రోగ్రాము. ఇంటర్యూ బాగానే చేసాననిపించింది. ఒక వారంలో చెప్తాము అన్నారు. అది కూడా హైదరాబాదా, కడపా అనేది తెలీదు. 1975 మోడల్ మహీంద్రా జీపు ఇస్తారు కానీ డ్రైవర్ ఇవ్వరంట ఒక వేళ ఆ జాబ్ వస్తే ఇప్పుడు అర్జెంటుగా జీపు తోలడం(?) నేర్చుకోవాలి కాబోలు. ఎందుకైనా మంచిది పనిలో పని బస్సు, ట్రైను, విమానం ఇవన్నీ తోలడం కూడా నేర్చేసుకుంటే ఒక పనైపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైతే అది వాడేసుకోవచ్చు ఏమంటారు??? సరే ఏదో ఒకటి అనండి నేను మాత్రం ఇంటికెళ్ళాలి, వర్షం తగ్గింది ఇంకా ఆకలేస్తుంది. మళ్ళీ కలుస్తా త్వరలో ఏదో ఒక వార్త తో. బై బై.

Friday, July 23, 2010

బిజీ బిజీ బిజీ....

బిజీ బిజీ బిజీ, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఊడిపోయే ఉద్యోగానికి పనెక్కువయ్యింది. మా సునామీ ప్రాజెక్టు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సెప్టెంబర్ తో ప్రాజెక్ట్ క్లోజ్ చెయ్యాలి. అందుకని ఫార్మాలిటీస్ ఇవాల్యుఏషన్లు అని రకరకాల పనులతో బిజీగా తిరుగుతున్న, పోస్ట్ రాసే మూడ్ కూడా లేదు.5 ఏళ్ళ క్రితం వచ్చాను ఈ నెల్లూరికి. ఇంకో 3 నెలల్లో వెళ్ళిపోతాను. తరువాతి మజిలీ ఎక్కడికో తెలీదు.

రాత్రి 9, అయి వుంటుంది. చెన్నై లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి నేను, షాహిద్, సుద్దర్శన్ ఇంక సుధర్శన్ ఫామిలీ కలిసి బొలెరో లో వచ్చాము.రావటమే డి.ఆర్.ఉత్తమ హొటెల్ కి వెళ్ళాము. ఇక్కడ వున్న స్టార్ హొటెల్. నేను మొదటిసారి హొటెల్ లో ఒక్కదాన్నే వుండాల్సిన పరిస్థితి. ఎప్పుడైన మా ఫ్యామిలీ తో వెల్తే వైజాగ్ లో అందరం కలిసి ఒకే రూం లో వుండేవాళ్ళం. నాకు భయం అనిపించింది అందుకని సుదర్శన్ గారికి(నేను రిపోర్ట్ చేసేది అతనికే) నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వుంటానండి అని చెప్పి వెళ్ళి నా వెలుగు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వుంటే వెళ్ళాను. ఎన్నో గ్రామాలలో కనీస సదుపాయాలు కూడా లేని ఇంట్లో వుండగలిగాను కానీ ఈ నెల్లూరు వేడికి వాళ్ళ ఇంట్లో పడుకోవటం నా వల్ల కాలేదు. హాయిగా ఎ.సి రూం ఇస్తుంటే నేను ఇక్కడ నిద్రలేని రాత్రులు గడపలా?అని ఆలోచించి మరుసటిరోజు బుద్ధ్హిగా హొటెల్ కి షిఫ్ట్ అయిపొయా. నెల్లూరు వేడి ఆ మజాకా? అప్పటినుండి ఇప్పటి వరకు నెల్లూరు శిరీష అయిపోయాను. ఎందుకంటే వెలుగు శిరీష ని కాదు కదా.అంతే కాదు లక్కీ పుట్టడం నేను ఇక్కడికి రావటం. వాడిని ఎవరైన మీది ఏ వూరు అంటే నెల్లూరు అని చెప్తాడు. అలాంటి నెల్లూరు వదిలి వెళ్ళిపోవాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద మెట్రొ సిటీ రేంజి లో వున్నా, ఇంటి అద్దెలు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా వున్నా, సంవత్సరం పొడుగునా వేసవికాలం, వేడి, చెమటలు తో విసుగొచ్చినా...నెల్లూరు అలవాటైపోయింది. అందుకే వదిలి వెళ్ళాలంటే కాస్తా దిగులొస్తుంది.

కేర్ ఇండియా లో కూడా కొన్ని పొజిషన్స్ తీస్తున్నారు. ఊటీ లో టీ ప్లేంటేషన్ వర్కర్స్ కోసం పనిచేసే ప్రాజెక్టు, ఒరిస్సా లో హెల్త్ ప్రాజెక్టు, బీహార్ లో కూడా హెల్త్ ప్రాజెక్టు ఇలా ఎక్కడెక్కడో వున్నాయి. నాకు మాత్రం హెచ్.ఐ.వి. ఐడ్స్ తో బాధపడుతున్నవారికోసం పనిచెయ్యాలని వుంది. అంత ఈజీ కాదు కదా లక్కీ ని తీసుకొని తెలియని బాష ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వుండటం. లక్కీ వాళ్ళ డాడీ వచ్చినా ఇక అంత దూరం అంటే చుట్టం లా వచ్చి వెళ్ళాల్సిందే.నా వుద్యోగం ఏమైన స్కూల్ టీచరా హాయిగా 10-4 చేసి ఇంటికి వచ్చేయడానికి. కేంపులు వుంటాయి అక్కడ లక్కీ ని చూసుకోవడానికి తెలుగు తెలిసిన మనిషి దొరికినా కూడా ప్రాక్టికల్ గా ఎన్నో సమస్యలుంటాయి. పిల్లలే అన్ని పరిస్థితులకు త్వరగా సర్దుకుపోతారు అంటున్నారు. కానీ నా భయాలు నాకుంటాయి కదా. ఈ భయాలతో నన్ను నేను చూసుకుంటుంటే అసలు నేను ముందు శిరీష నా కాదా అని అనుమానం వస్తుంది. నా భయాలన్నీ అపోహలేనేమో!అన్ని పరిస్థితుల్లో చక్కగా సర్దుకుపోగలమేమో? ఈ అనుమానాలతో, విపరీతంగా తిరగటం వల్ల నాకు నిద్ర ఎక్కువగా పట్టేస్తుంది. ఏంటి ఆశ్చర్యంగా వుందా! నాకు అంతే ఎప్పుడైన టెన్షన్, దిగులు, బాధ ఇలాంటివి ఏమైన వుంటే విపరీతంగా నిద్రపోతుంటాను. అసలు జీవితంలో 24 గంటల్లో 20 గంటలు నిద్రపోతుంటే ఎంత హాయిగా వుంటుందో కదా. ఇక మిగిలిన 4 గంటలు స్నానం చేసి, ఇల్లు క్లీన్ చేసుకొని, ఊరికే బాగా ఎండా గాలి పీల్చుకుంటే సరిపోయేలా ఎందుకు పెట్టలేదో దేవుడు. అసలు ఆకలి అనేదే లేకపోతే, పొట్ట భాగం లేకపోతే,అన్నం, పప్పు, కూర, సాంబార్ అని ఇన్ని రకాలు తినాల్సిన పని లేకపోతే ఎలా వుండేవాళ్ళం. ఎవరికీ ఉద్యోగాలు అక్ఖర్లేదు, పని కూడా అవసరం లేదు. ఏడ్చినట్లుంది అలా వుంటే లోకం అసలు బాగుండదు. నీ బోడి వుద్యోగం కోసం ఇంత అందమైన లోకం తీరు మార్చేస్తావా అని తిడుతున్నరా? నిజమే ఆకలి వుండాలి, పని వుండాలి, పరుగులుండాలి, తపన వుండాలి, అసంతృప్తి వుండాలి, దానికోసం మనిషి ఎప్పుడూ ఏదో అన్వేషిస్తూ వుండాలి, అప్పుడే జీవం వున్నట్లుంటుంది.

సో, నాలో జీవం వున్నవరకు నేనూ పరిగెడతా, నేనూ ఏదో ఒక పని చేస్తా, జీవన ప్రవాహం లో అడ్డంకులు, ఆటు పోట్లు తప్పవు అవి వుంటేనే అందం కద. అంత పెద్ద డైలాగులు అవసరం లేదు కానీ ఈ హడావిడిలో, అలోచనలలో బ్లాగులు రాసే మూడ్ రావటం లేదు. మళ్ళీ ఎప్పుడు రాయగలనో తెలీదు. అంతవరకు నా పెద్ద పెద్ద పోస్ట్లు అప్పుడప్పుడు చదవి నన్ను గుర్తు పెట్టుకోండి సరేనా?

Monday, July 12, 2010

రావణ్ (విలన్) - ఇది సినిమా కాదు(2 వ భాగం)

(నేను చేసిన పని చాలా మందికి నా మీద మంచి అభిప్రాయం కలిగించకపోవచ్చు, కానీ నేను పెద్ద ఆశయాలు లేని ఎన్నో భయాలు,స్వార్ధాలు వున్న మామూలు మనిషిని అని అర్ధం చేసుకొని చదవగలరు)

..............................................................

అతను నన్ను చూస్తున్నారు రెప్ప వేయకుండా, అతని వయసు ఇంత అని చెప్పడానికి కష్టం, శరీరం చాలా బక్కగా వుంది.కాళ్ళు చేతులూ మరీ మొద్దుబారినట్లున్నాయి,ఇక నేనే ఏదో మాట్లాడాలని "యాదమ్మా..అని మొదలుపెట్టాను.అతను "ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అని అడిగారు నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది, కానీ అతను మళ్ళీ అదే ప్రశ్న వేశారు. నేను ఏదో చేసుకుపోతున్నాను కాని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని ఎవరైనా సడన్ గా అడిగితే ఏమి చెప్పాలి. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అన్నాను. ఇతనేదో చాలా సీరియస్ ప్రశ్నలు వెయ్యాలనే డిసైడ్ అయ్యాడని అర్ధం అయింది. మమ్మల్ని ఎందరో మా ఉద్యోగం గురించి, మా గురించి ప్రశ్నలు వేస్తారు. కొత్త గ్రామం వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా అడుగుతారు. అందులోను ఒక అబ్బాయి అమ్మాయి గనుక వెళ్ళామంటే అతను నీకేమవుతాడు?, ఈమె నీకేమవుతుంది అని కూడా అడుగుతారు, ఈ జాబ్ కి ఎంత లంచం ఇచ్చారు? గవర్నమెంట్ జాబేనా?ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు. అలాగే ఇది కూడా అనుకున్నాను. ఇప్పటికీ అతను మాట్లాడిన ప్రతీ మాటా గుర్తుంది అతని గొంతులో తీక్షణత్వం, మాటల్లో తెలివి,సమాచారం ఇలాంటివి అంతకు ముందెప్పుడూ నాకు ఎదురుకాని ఒక ప్రత్యేకత ఏదో!!(కానీ నిజంగా కొన్ని మాటలు అర్ధం కాలేదు,అందుకే అర్ధం అయిన మాటలు రాస్తున్నాను)

అతను: నచ్చిందా, ఏంటి నచ్చింది?రాత్రి పూట ఒంటరిగా చీకటిలో వెళ్ళి రావటం నచ్చిందా?
నేను: మీకు నేను తెలుసా?నేను రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నానని ఎలా తెలుసు?
అతను: నీకేమి నచ్చింది?కష్టంగా లేదా?ఇది అంత మంచి ఏరియా కాదు
నేను:భయపెడుతున్నారా? నాకు ఇంతవరకు ఇక్కడ భయపడాల్సిన ఎటువంటి సమస్యా రాలేదు. ఏమో వస్తే అప్పుడు మానేస్తానేమో
అతను: గవర్నమెంట్ జాబే కదా రిపోర్ట్ రాస్తే సరిపోదా మీటింగ్ కి వెళ్ళాను అని ఎందుకని నిజంగా వెళ్ళటం?
నేను: నాకు అలా నచ్చదు, రిపోర్ట్ రాయగలను కానీ నా మనసే ఒప్పుకోదు. అయినా గవర్నమెంట్ లో ఎవరూ పని చెయ్యరని చెప్పలేము కదా.
అతను: ఏమి చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ కి చిత్త శుద్ధి లేదు. ఎవరికీ ఏమీ చెయ్యలేదు.మీ ప్రాజెక్ట్ అయినా అంతే.
నేను:(నాకు చాలా కోపం వచ్చేసింది) అందరూ ఎందుకు గవర్నమెంట్, గవర్నమెంట్ అని ఎవరినో తిట్టడం, ముందు మనకోసం మనం ఏమి చేసుకుంటున్నాము? వెలుగు ప్రాజెక్ట్ తాలూక ముఖ్యమైన వుద్ధేశ్యం కూడా ప్రజలు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ వుండకుండా అందరు కలిసి వారి కోసం వారు ఏమి చెయ్యగలరో ముందు చేసుకునేలా చెయ్యటమే. ఇంత మంచి ప్రాజెక్టు, ఆలోచన గవర్నమెంటుదే కదా! ఎన్.జి.ఓ లు, లేదా వేరే ఎవరైనా సరే గవర్నమెంట్ చెయ్యగలిగేంత మందికి, అన్ని రకాల పనులు చెయ్యగలరా, ఏమీ చెయ్యకుండానే మనందరం ఇలా వున్నామా?
అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో వున్న నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు.
నేను:సముద్రం ఏంటి,చెంబేంటి? అర్ధం అయినట్లు చెప్పండి
అతను: మరి గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే ఎందుకు కొందరే బాగుపడుతున్నారు? ఎందుకు కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం ఎప్పుడూ ఆ అన్యాయం పేదలికి, కొన్ని జాతులకే జరుగుతుంది?
నేను: చూడండీ, మీ ప్రశ్నలన్నీ కరక్టే కానీ ఒక ఇద్దరు మనుషులున్న ఒక కుటుంబంలో కలిసి ఉన్నప్పుడే ఎన్నో సమస్యలొస్తాయి, ఒక తల్లి పిల్లలే అమ్మ నాకంటే ఇంకొకరిని బాగా చూస్తుంది అని బాధపడతూ ఉంటారు, అలాంటిది ఇన్ని వైవిధ్యాలు, ఇంత జనాబా ఉన్న మన దేశమే కాదు ఎక్కడైనా ఎవరికీ అన్నీ సవ్యంగా 100% జరగాలని ఆశించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మనమెంతో సాధించాము,ఇప్పటికే మీరు చెప్పిన వెనుకబడిన జాతుల్లో ఎంతో మార్పు అభివృద్ధి వచ్చింది. ఇక ముందు ఇంకా వస్తుంది. వారి వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, తోటి వారిగా సమాజాంలో వున్న మన అందరికీ బాధ్యత వుంది కదా?ఒక్క గవర్న్మెంట్ నే తప్పు పడుతూ పోతే ఎలా? మనకి బాధ్యత లేదా?

అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో నీళ్ళగురించి మాట్లాడుతున్నవు అని చెప్పాను కదా. బాధ్యత తీసుకోవాలని చెప్పటం కాదు నిజంగా తీసుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ వున్న వెనుకబడ్డ వారికి బాద్యత తీసుకొని ఎందరో నిలబడ్డారు, కుటుంబాలు వదిలేసి, ఎంతో డబ్బు, పేరు తెచ్చిపెట్టే చదువు, జాబులు వదిలేసి కొండల్లో, అడవుల్లో తిండిలేక,వారికి వీరికీ ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, అది బాద్యత కాదా?నువ్వు చెప్పేది ఇంతకంటే గొప్ప బాధ్యత నా?నేను చెప్పేది ఎవరి గురించో అర్ధం అయిందా?

నేను: అర్ధం అయింది, అన్నల గురించి.నాకు వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటల్లో చూసినా, వాళ్ళకి అడవుల్లో తిరగటం, ప్రాణాలు కాపాడుకోవటం తోనే టైము అయిపోతుంది.ఇక వాళ్ళకి సమాజ జీవితంలో వున్న కష్టాలేమి తెలుస్తాయి? వేరే వారికోసం ఆలోచించడానికి వీలెక్కడ వుంటుంది. అదరినుండి దూరంగా పారిపోయి బతుకుతున్నారు.కనీసం వాళ్ళ కుటుంబానికైన ఉపయోగపడలేరు.ఇక సమాజానికి తుపాకీ పట్టుకొని వాళ్ళేమి మంచి చెయ్యగలరు.(ఇవి నిజంగా సినిమా డైలాగ్స్ లా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ నేను వాగాను అతనితో)

అతను: (చాలా సేపు మౌనంగా వుండిపోయారు)నేనెవరో తెలుసా? లాయర్ ప్రాక్టీస్ చేసుకొని బాగా సంపాదించుకోగలను, కానీ పొలీసులు చేసిన కూంబింగ్లో వెన్నెముకకి దెబ్బతగిలి ఏపనీ చేసుకోలేను ఇప్పుడు? అయినా నా బాధ్యత నా ప్రాణాలున్నవరకు నెరవేరుస్తాను.ఇప్పుడు నేను మేజర్ పనికి కొంత దూరంగా వున్నా, నిర్ణయాలలో, ప్లానింగ్ లో ఇంకా పనిచేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సముద్రంలో బతుకుతూ కూడా చెంబులో ఉన్న నీళ్ళ గురించే మాట్లాడతారు. నువ్వు భయపడకుండా, బాధ్యతగా పనిచేసేది చూసి నీకు సమాజం మీద నిజమైన బాధ్యత వుందనుకున్నాను. మీకందరికీ జీవితం సుఖంగా వుండాలి,నీకు నిజంగా బాద్యత ఉంటే మాలో చేరు అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో,ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు,లాయర్లు ఎన్నో గొప్ప చదువులు చదివిన వాళ్ళు, నిజంగా సమాజానికి కావలసింది ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు.నువ్వుకూడా తెలుసుకో,సరిగా ఆలోచించు.

(నిజంగా షాక్ అయ్యాను,నేను మాట్లాడేది ఎవరితో అని తెలిశాక, అతను అడుగుతున్నది ఏంటో తెలిశాక...ఎక్కువ టైం పట్టలేదు జవాబు చెప్పడానికి, ఎందుకంటే నాకు తెలుసు నేనేది నమ్ముతానో)

నేను: నాకు ఎలా చెప్పాలో తెలియటంలేదు. కానీ నేను మీలా వుండలేను.నాకు మా మమ్మీ కావాలి,డాడీ కావాలి,నా చెల్లి తమ్ముడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు నా ఫ్రెండ్స్ కావాలి, నా జీవితం నాకు ఎలా దొరికిందో అలా కావాలి.అలా వున్న జీవితం లో నేను నా వాళ్ళకీ, నాకు చేతనైనంత లో నా సమాజానికి చెయ్యగలిగితే చాలు.అంతే కానీ నా జీవితాన్ని, నా వాళ్ళని వదిలేసుకొని ఏదో వస్తుంది అని ఆశ తో బతకలేను.ఒకవేళ అలా బతికినా మీరు చెప్పే పూర్తి సమానత్వం, ఫుల్ గ్రీన్ సమాజం వస్తుందో రాదో నాకు తెలీదు కానీ నా జీవితం అంతకు ముందే అయిపోతుంది. ఈ జీవితం అలా అందరికీ దూరంగా ...నా వల్ల కాదు. నేను గొప్ప భావాలున్న మనిషిని కాదు. చాలా ఆశలు, కోరికలు,భయాలు వున్న మామూలు మనిషిని.(నేను అలాంటి మనిషిని అని నాకు కూడా అప్పుడే తెలిసింది)

ఇలా ఆవేశంగా ఏదో చెప్పేశాను.ఇంకా చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా మీ జీవితం వృధా చేసుకోకండి అని, ఇంకా అడగాలనిపించింది మీకు మీ జీవితం నష్టపోయాను అని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. కానీ ఎన్నో ఆలోచనలు నా మైండ్ నిండా. ఇటువంటి మాటలు చెప్తే అతనికి ఎలా అనిపిస్తుంది..కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయిన మనిషికి తను నష్టపోయాననే బాధ కలుగుతుందా, నాలాంటి స్వార్ధం కోసం ఆలోచించేవాళ్ళున్న ఈ సమాజం కోసమా మేమంతా కష్టపడేది అనిపిస్తుందా...ఇలా నా ఆలోచనలో నేను మౌనంగా ఉండిపోయాను.అతను ఏమీ మాట్లాడలేదు.అతను కూడా ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నేను ఒక ట్రాన్స్ లో వచ్చినట్లు బయటకి వచ్చేసాను.ఎలా ఇంటికెళ్ళానో నాకే తెలీదు.

అదే ట్రాన్స్ లో వున్నాను ఆరోజంతా. మధ్యానం మా టీం లో వాళ్ళకి జరిగింది చెప్పాను. అంతా విని ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. ధర్మా-"హ్మ్ ఎందుకైనా మంచిది నువ్వొక్కదానివే రాత్రిళ్ళు తిరగకు కొన్ని రోజులు, ఆ ఊరు ఇప్పట్లో మనమెవ్వరూ వెళ్ళొద్దు" అనేసి వెళ్ళిపోయాడు. చిత్ర తెలుగు మాట్లాడటం రాకపోయినా, అర్ధం అయ్యేది - "ఎదుకు వెలొదు? షి షుడ్ గో అండ్ వర్క్ ఏజ్ యుజుయల్, ఐ విల్ గో విత్ హెర్,షి ఈజ్ బ్రేవ్,డోంట్ ఫ్రైటెన్ హెర్,శిరీష, యు హేవ్ డన్ గుడ్,డోంట్ వర్రీ, వి ఆర్ విత్ యు". రెడ్డీ- "హబ్బా, ఏంటి నక్సలైటా,నిన్ను జాయిన్ అవ్వమన్నారా?ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా?" లేకపోతే నీ వర్క్ చూసి , నీ ప్రతాపం చూసి వాళ్ళు మురిసిపోయారా?,అన్నీ తిక్క మాటలు, పద రేపు నేనొస్తా నాకు చూపియ్ వాడేవన్నాడో నీకేమర్ధమయ్యిందో తేల్చేస్తాను". అన్నాడు. నాకు కూడా ఇదంతా నిజం కాకపోతే బాగుణ్ణు అనిపించింది.బహుశా నేను అతని మాటల్ని అతిగా ఊహించుకున్నానా? కలగన్నానా?

మనిషి కి షాక్ అనిపించిన సంఘటనలు అసలు జరగలేదని, బహుశా తప్పుగా ఊహించామని అనుకంటాడనుంటా. నేనూ అలా అనుకోవడమే బాగుంది అని అనుకున్నాను.ఇంకా అనుకుంటున్నాను.

శ్రీను(అప్పుడేమీ అనలేదు,కానీ ఆరోజు రాత్రి నేను ఒక్కదాన్నే డాబా మీదకి వెళ్ళినప్పుడు వచ్చి ఇలా చెప్పాడు-" శిరి, వాళ్ళ కళ్ళళ్ళో నువ్వు పడడం నీ అదృష్టం రా, నీకున్న గొప్ప గుణాలు నీకు తెలియలేదు, వాళ్ళకి కనిపించాయి,నీ జీవితం నీ ఇష్టం అనుకో, నేను ఈ సాహిత్యం అంతా ఈ మధ్య చదివాను రా, నాకు వాళ్ళని కలవాలనీ, వాళ్ళతో కలవాలనీ వుందిరా, నన్ను ఒకసారి వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళరా" అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఉదయం తగిలిన షాక్ కంటే పెద్ద షాక్ ఇది. శ్రీను ఎంతో సరదా మనిషి.కానీ తన జీవితం ఎంతో విషాదం. అందువల్ల తను మానసికంగా చాలా బలహీనం అని నాకు పి.జి లో తనతో కొన్ని రోజుల స్నేహంలోనే అర్ధం అయింది. అప్పటికి చూసిన సినిమా, కలిసిన మనిషి, చదివిన పుస్తకం, తెలుసుకున్న విషయం ఏదైన తనమీద కొంత కాలం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజుల పాటు అదే పని గా ఆ ఒక్క ఆలోచన చేసి అంతకంటే వెరేదీ లేదు అన్నట్లు, అదే తన జీవితం అన్నట్లు లీనం అయిపోతాడు. జీవితంలో తనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించేది నాకు. వీలైనంతవరకు తనకి దగ్గరగా వుండగలిగే జాబ్ దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఒకసారి పాటలు సంగీతం మీద పడి నెలలు గడిపేశాడు, ఇంకోసారి ఆద్యాత్మికం చదివి ఏదో ఆశ్రమం లో చేరాలని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు, ఇప్పుడు ఇలా.నాకు అప్పుడు వేసింది భయం. తిరుగుబాటుదారులు, నక్సల్స్, రావణులు తయారవ్వటానికి ఆ రోజు అతను చెప్పిన కారణాలు, నేను అనుకున్న కారణాలు, సినిమాల్లో చూపించే కారణాలు మాత్రమే కాదు శ్రీను లాగా ఏ కారణం లేకుండా ప్రభావితం అవ్వటం కూడా ఒక కారణం కావొచ్చు అనిపించింది. కారణాలేవైనా, నక్సలిజం మంచిదైనా, కాకపోయినా నా దారి మాత్రం కాదు. నా స్నేహితులని కూడా వెళ్ళేలా ప్రోత్సహించను. ఎందుకంటే నేను సాధారణ మనిషిని, నా వాళ్ళందరు నాతో పాటు వుండాలనీ, వారి వారి జీవితాలు సంతోషంగా గడపాలనీ,నా సుఖ ధుఖాలలో వాళ్ళు, వారి సుఖ ధుఖాలలో నేను తోడుగా వుండగలిగే సామాన్య పరిస్థితుల్లో మేమంతా వుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. సమ సమాజ స్థాపన వంటి పెద్దకలలు కనేంత గొప్ప దానిని కాదు మరి. అందుకే నా ఆలోచనలను పక్కన పెట్టేసి శ్రీను మూడ్ డైవర్ట్ చేసే పనిలో పడ్డాము నేనూ చిత్రా.

Sunday, July 11, 2010

రావణ్(విలన్)- ఇది సినిమా కాదు[పార్ట్-2]

(నేను చేసిన పని చాలా మందికి నా మీద మంచి అభిప్రాయం కలిగించకపోవచ్చు, కానీ నేను పెద్ద ఆశయాలు లేని ఎన్నో భయాలు,స్వార్ధాలు వున్న మామూలు మనిషిని అని అర్ధం చేసుకొని చదవగలరు)

..............................................................

అతను నన్ను చూస్తున్నారు రెప్ప వేయకుండా, అతని వయసు ఇంత అని చెప్పడానికి కష్టం, శరీరం చాలా బక్కగా వుంది.కాళ్ళు చేతులూ మరీ మొద్దుబారినట్లున్నాయి,ఇక నేనే ఏదో మాట్లాడాలని "యాదమ్మా..అని మొదలుపెట్టాను.అతను "ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అని అడిగారు నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది, కానీ అతను మళ్ళీ అదే ప్రశ్న వేశారు. నేను ఏదో చేసుకుపోతున్నాను కాని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని ఎవరైనా సడన్ గా అడిగితే ఏమి చెప్పాలి. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అన్నాను. ఇతనేదో చాలా సీరియస్ ప్రశ్నలు వెయ్యాలనే డిసైడ్ అయ్యాడని అర్ధం అయింది. మమ్మల్ని ఎందరో మా ఉద్యోగం గురించి, మా గురించి ప్రశ్నలు వేస్తారు. కొత్త గ్రామం వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా అడుగుతారు. అందులోను ఒక అబ్బాయి అమ్మాయి గనుక వెళ్ళామంటే అతను నీకేమవుతాడు?, ఈమె నీకేమవుతుంది అని కూడా అడుగుతారు, ఈ జాబ్ కి ఎంత లంచం ఇచ్చారు? గవర్నమెంట్ జాబేనా?ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు. అలాగే ఇది కూడా అనుకున్నాను. ఇప్పటికీ అతను మాట్లాడిన  ప్రతీ మాటా గుర్తుంది అతని గొంతులో తీక్షణత్వం, మాటల్లో తెలివి,సమాచారం ఇలాంటివి అంతకు ముందెప్పుడూ నాకు ఎదురుకాని ఒక ప్రత్యేకత ఏదో!!(కానీ నిజంగా కొన్ని మాటలు అర్ధం కాలేదు,అందుకే అర్ధం అయిన మాటలు రాస్తున్నాను)

అతను: నచ్చిందా, ఏంటి నచ్చింది?రాత్రి పూట ఒంటరిగా చీకటిలో వెళ్ళి రావటం నచ్చిందా?
నేను: మీకు నేను తెలుసా?నేను రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నానని ఎలా తెలుసు?
అతను: నీకేమి నచ్చింది?కష్టంగా లేదా?ఇది అంత మంచి ఏరియా కాదు
నేను:భయపెడుతున్నారా? నాకు ఇంతవరకు ఇక్కడ భయపడాల్సిన ఎటువంటి సమస్యా రాలేదు. ఏమో వస్తే అప్పుడు మానేస్తానేమో
అతను: గవర్నమెంట్ జాబే కదా రిపోర్ట్ రాస్తే సరిపోదా మీటింగ్ కి వెళ్ళాను అని ఎందుకని నిజంగా వెళ్ళటం?
నేను: నాకు అలా నచ్చదు, రిపోర్ట్ రాయగలను కానీ నా మనసే ఒప్పుకోదు. అయినా గవర్నమెంట్ లో ఎవరూ పని చెయ్యరని చెప్పలేము కదా.
అతను: ఏమి చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ కి చిత్త శుద్ధి లేదు. ఎవరికీ ఏమీ చెయ్యలేదు.మీ ప్రాజెక్ట్ అయినా అంతే.
నేను:(నాకు చాలా కోపం వచ్చేసింది) అందరూ ఎందుకు గవర్నమెంట్, గవర్నమెంట్ అని ఎవరినో తిట్టడం, ముందు మనకోసం మనం ఏమి చేసుకుంటున్నాము? వెలుగు ప్రాజెక్ట్ తాలూక ముఖ్యమైన వుద్ధేశ్యం కూడా ప్రజలు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ వుండకుండా అందరు కలిసి వారి కోసం వారు ఏమి చెయ్యగలరో ముందు చేసుకునేలా చెయ్యటమే. ఇంత మంచి ప్రాజెక్టు, ఆలోచన గవర్నమెంటుదే కదా! ఎన్.జి.ఓ లు, లేదా వేరే ఎవరైనా సరే గవర్నమెంట్ చెయ్యగలిగేంత మందికి, అన్ని రకాల పనులు చెయ్యగలరా, ఏమీ చెయ్యకుండానే మనందరం ఇలా వున్నామా?
అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో వున్న నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు.
నేను:సముద్రం ఏంటి,చెంబేంటి? అర్ధం అయినట్లు చెప్పండి
అతను: మరి గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే ఎందుకు కొందరే బాగుపడుతున్నారు? ఎందుకు కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం ఎప్పుడూ ఆ అన్యాయం పేదలికి, కొన్ని జాతులకే జరుగుతుంది?
నేను: చూడండీ, మీ ప్రశ్నలన్నీ కరక్టే కానీ ఒక ఇద్దరు మనుషులున్న ఒక కుటుంబంలో కలిసి ఉన్నప్పుడే ఎన్నో సమస్యలొస్తాయి, ఒక తల్లి పిల్లలే అమ్మ నాకంటే ఇంకొకరిని బాగా చూస్తుంది అని బాధపడతూ ఉంటారు, అలాంటిది ఇన్ని వైవిధ్యాలు, ఇంత జనాబా ఉన్న మన దేశమే కాదు ఎక్కడైనా ఎవరికీ అన్నీ సవ్యంగా 100% జరగాలని ఆశించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మనమెంతో సాధించాము,ఇప్పటికే మీరు చెప్పిన వెనుకబడిన జాతుల్లో ఎంతో మార్పు అభివృద్ధి వచ్చింది. ఇక ముందు ఇంకా వస్తుంది. వారి వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, తోటి వారిగా సమాజాంలో వున్న మన అందరికీ బాధ్యత వుంది కదా?ఒక్క గవర్న్మెంట్ నే తప్పు పడుతూ పోతే ఎలా? మనకి బాధ్యత లేదా?

అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో నీళ్ళగురించి మాట్లాడుతున్నవు అని చెప్పాను కదా. బాధ్యత తీసుకోవాలని చెప్పటం కాదు నిజంగా తీసుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ వున్న వెనుకబడ్డ వారికి బాద్యత తీసుకొని ఎందరో నిలబడ్డారు, కుటుంబాలు వదిలేసి, ఎంతో డబ్బు, పేరు తెచ్చిపెట్టే చదువు, జాబులు వదిలేసి కొండల్లో, అడవుల్లో తిండిలేక,వారికి వీరికీ ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, అది బాద్యత కాదా?నువ్వు చెప్పేది ఇంతకంటే గొప్ప బాధ్యత నా?నేను చెప్పేది ఎవరి గురించో అర్ధం అయిందా?

నేను: అర్ధం అయింది, అన్నల గురించి.నాకు వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటల్లో చూసినా, వాళ్ళకి అడవుల్లో తిరగటం, ప్రాణాలు కాపాడుకోవటం తోనే టైము అయిపోతుంది.ఇక వాళ్ళకి సమాజ జీవితంలో వున్న కష్టాలేమి తెలుస్తాయి? వేరే వారికోసం ఆలోచించడానికి వీలెక్కడ వుంటుంది. అదరినుండి దూరంగా పారిపోయి బతుకుతున్నారు.కనీసం వాళ్ళ కుటుంబానికైన ఉపయోగపడలేరు.ఇక సమాజానికి తుపాకీ పట్టుకొని వాళ్ళేమి మంచి చెయ్యగలరు.(ఇవి నిజంగా సినిమా డైలాగ్స్ లా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ నేను వాగాను అతనితో)

అతను: (చాలా సేపు మౌనంగా వుండిపోయారు)నేనెవరో తెలుసా? లాయర్ ప్రాక్టీస్ చేసుకొని బాగా సంపాదించుకోగలను, కానీ పొలీసులు చేసిన కూంబింగ్లో వెన్నెముకకి దెబ్బతగిలి ఏపనీ చేసుకోలేను ఇప్పుడు? అయినా నా బాధ్యత నా ప్రాణాలున్నవరకు నెరవేరుస్తాను.ఇప్పుడు నేను మేజర్ పనికి కొంత దూరంగా వున్నా, నిర్ణయాలలో, ప్లానింగ్ లో ఇంకా పనిచేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సముద్రంలో బతుకుతూ కూడా చెంబులో ఉన్న నీళ్ళ గురించే మాట్లాడతారు. నువ్వు భయపడకుండా, బాధ్యతగా పనిచేసేది చూసి నీకు సమాజం మీద నిజమైన బాధ్యత వుందనుకున్నాను. మీకందరికీ జీవితం సుఖంగా వుండాలి,నీకు నిజంగా బాద్యత ఉంటే మాలో చేరు అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో,ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు,లాయర్లు ఎన్నో గొప్ప చదువులు చదివిన వాళ్ళు, నిజంగా సమాజానికి కావలసింది ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు.నువ్వుకూడా తెలుసుకో,సరిగా ఆలోచించు.

(నిజంగా షాక్ అయ్యాను,నేను మాట్లాడేది ఎవరితో అని తెలిశాక, అతను అడుగుతున్నది ఏంటో తెలిశాక...ఎక్కువ టైం పట్టలేదు జవాబు చెప్పడానికి, ఎందుకంటే నాకు తెలుసు  నేనేది నమ్ముతానో)

నేను: నాకు ఎలా చెప్పాలో తెలియటంలేదు. కానీ నేను మీలా వుండలేను.నాకు మా మమ్మీ కావాలి,డాడీ కావాలి,నా చెల్లి తమ్ముడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు నా ఫ్రెండ్స్ కావాలి, నా జీవితం నాకు ఎలా దొరికిందో అలా కావాలి.అలా వున్న జీవితం లో నేను నా వాళ్ళకీ, నాకు చేతనైనంత లో నా సమాజానికి చెయ్యగలిగితే చాలు.అంతే కానీ నా జీవితాన్ని, నా వాళ్ళని వదిలేసుకొని ఏదో వస్తుంది అని ఆశ తో బతకలేను.ఒకవేళ అలా బతికినా మీరు చెప్పే పూర్తి సమానత్వం, ఫుల్ గ్రీన్ సమాజం వస్తుందో రాదో నాకు తెలీదు కానీ నా జీవితం అంతకు ముందే అయిపోతుంది. ఈ జీవితం అలా అందరికీ దూరంగా ...నా వల్ల కాదు. నేను గొప్ప భావాలున్న మనిషిని కాదు. చాలా ఆశలు, కోరికలు,భయాలు వున్న మామూలు మనిషిని.(నేను అలాంటి మనిషిని అని నాకు కూడా అప్పుడే తెలిసింది)

ఇలా ఆవేశంగా ఏదో చెప్పేశాను.ఇంకా చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా మీ జీవితం వృధా చేసుకోకండి అని, ఇంకా అడగాలనిపించింది మీకు మీ జీవితం నష్టపోయాను అని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. కానీ ఎన్నో ఆలోచనలు నా మైండ్ నిండా. ఇటువంటి మాటలు చెప్తే అతనికి ఎలా అనిపిస్తుంది..కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయిన మనిషికి తను నష్టపోయాననే బాధ కలుగుతుందా, నాలాంటి స్వార్ధం కోసం ఆలోచించేవాళ్ళున్న ఈ సమాజం కోసమా మేమంతా కష్టపడేది అనిపిస్తుందా...ఇలా నా ఆలోచనలో నేను మౌనంగా ఉండిపోయాను.అతను ఏమీ మాట్లాడలేదు.అతను కూడా ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నేను ఒక ట్రాన్స్ లో వచ్చినట్లు బయటకి వచ్చేసాను.ఎలా ఇంటికెళ్ళానో నాకే తెలీదు.

అదే ట్రాన్స్ లో వున్నాను ఆరోజంతా. మధ్యానం మా టీం లో వాళ్ళకి జరిగింది చెప్పాను. అంతా విని ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారు.
 ధర్మా-"హ్మ్ ఎందుకైనా మంచిది నువ్వొక్కదానివే రాత్రిళ్ళు తిరగకు కొన్ని రోజులు, ఆ ఊరు ఇప్పట్లో మనమెవ్వరూ వెళ్ళొద్దు" అనేసి వెళ్ళిపోయాడు.
చిత్ర తెలుగు మాట్లాడటం రాకపోయినా, అర్ధం అయ్యేది - "ఎదుకు వెలొదు? షి షుడ్ గో అండ్  వర్క్ ఏజ్ యుజుయల్, ఐ విల్ గో విత్ హెర్,షి ఈజ్ బ్రేవ్,డోంట్ ఫ్రైటెన్ హెర్,శిరీష, యు హేవ్ డన్ గుడ్,డోంట్ వర్రీ, వి ఆర్ విత్ యు".
రెడ్డీ- "హబ్బా, ఏంటి నక్సలైటా,నిన్ను జాయిన్ అవ్వమన్నారా?ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా?" లేకపోతే నీ వర్క్ చూసి , నీ ప్రతాపం చూసి వాళ్ళు మురిసిపోయారా?,అన్నీ తిక్క మాటలు, పద రేపు నేనొస్తా నాకు చూపియ్ వాడేవన్నాడో నీకేమర్ధమయ్యిందో తేల్చేస్తాను". అన్నాడు.
నాకు కూడా ఇదంతా నిజం కాకపోతే బాగుణ్ణు అనిపించింది.బహుశా నేను అతని మాటల్ని అతిగా ఊహించుకున్నానా? కలగన్నానా?

మనిషి కి షాక్ అనిపించిన సంఘటనలు అసలు జరగలేదని, బహుశా తప్పుగా ఊహించామని అనుకంటాడనుంటా. నేనూ అలా అనుకోవడమే బాగుంది అని అనుకున్నాను.ఇంకా అనుకుంటున్నాను.

శ్రీను(అప్పుడేమీ అనలేదు,కానీ ఆరోజు రాత్రి నేను ఒక్కదాన్నే డాబా మీదకి వెళ్ళినప్పుడు వచ్చి ఇలా చెప్పాడు-" శిరి, వాళ్ళ కళ్ళళ్ళో నువ్వు పడడం నీ అదృష్టం రా, నీకున్న గొప్ప గుణాలు నీకు తెలియలేదు, వాళ్ళకి కనిపించాయి,నీ జీవితం నీ ఇష్టం అనుకో, నేను ఈ సాహిత్యం అంతా ఈ మధ్య చదివాను రా, నాకు వాళ్ళని కలవాలనీ, వాళ్ళతో కలవాలనీ వుందిరా, నన్ను ఒకసారి వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళరా" అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఉదయం తగిలిన షాక్ కంటే పెద్ద షాక్ ఇది. శ్రీను ఎంతో సరదా మనిషి.కానీ తన జీవితం ఎంతో విషాదం. అందువల్ల తను మానసికంగా చాలా బలహీనం అని నాకు పి.జి లో తనతో కొన్ని రోజుల స్నేహంలోనే అర్ధం అయింది. అప్పటికి చూసిన సినిమా, కలిసిన మనిషి, చదివిన పుస్తకం, తెలుసుకున్న విషయం ఏదైన తనమీద కొంత కాలం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజుల పాటు అదే పని గా ఆ ఒక్క ఆలోచన చేసి అంతకంటే వెరేదీ లేదు అన్నట్లు, అదే తన జీవితం అన్నట్లు లీనం అయిపోతాడు. జీవితంలో తనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించేది నాకు. వీలైనంతవరకు తనకి దగ్గరగా వుండగలిగే జాబ్ దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఒకసారి పాటలు సంగీతం మీద పడి నెలలు గడిపేశాడు, ఇంకోసారి ఆద్యాత్మికం చదివి ఏదో ఆశ్రమం లో చేరాలని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు, ఇప్పుడు ఇలా.నాకు అప్పుడు వేసింది భయం. తిరుగుబాటుదారులు, నక్సల్స్, రావణులు తయారవ్వటానికి ఆ రోజు అతను చెప్పిన కారణాలు, నేను అనుకున్న కారణాలు, సినిమాల్లో చూపించే కారణాలు మాత్రమే కాదు శ్రీను లాగా ఏ కారణం లేకుండా ప్రభావితం అవ్వటం కూడా ఒక కారణం కావొచ్చు అనిపించింది. కారణాలేవైనా, నక్సలిజం మంచిదైనా, కాకపోయినా నా దారి మాత్రం కాదు. నా స్నేహితులని కూడా వెళ్ళేలా ప్రోత్సహించను. ఎందుకంటే నేను సాధారణ మనిషిని, నా వాళ్ళందరు నాతో పాటు వుండాలనీ, వారి వారి జీవితాలు సంతోషంగా గడపాలనీ,నా సుఖ ధుఖాలలో వాళ్ళు, వారి సుఖ ధుఖాలలో నేను తోడుగా వుండగలిగే సామాన్య పరిస్థితుల్లో మేమంతా వుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. సమ సమాజ స్థాపన వంటి పెద్దకలలు కనేంత గొప్ప దానిని కాదు మరి. అందుకే నా ఆలోచనలను పక్కన పెట్టేసి శ్రీను మూడ్ డైవర్ట్ చేసే పనిలో పడ్డాము నేనూ చిత్రా.

Monday, July 5, 2010

రావణ్ (విలన్)-ఇది సినిమా కాదు

మొన్న శనివారం రావణ్ (విలన్) సినిమా చూశాను. నాకు మామూలుగా అయితే అభిషేక్ ఇష్టం, కాని విక్రం బాగా చేస్తాడని కూడా ఒప్పుకుంటాను. హిందీ వెర్షన్ చూస్తే కానీ తెలీదు ఎవరు బాగా చేశారని.ఐశ్వర్య ని చూస్తే బాగాలేదనిపించింది(ఐశ్వర్య అభిమానులు వింటే నన్ను ఉరి తీశేస్తారేమో)ఇక అసలు విషయం ఏంటి అంటే ఇంతకీ సినిమాలో ఏమి చెప్పాలనుకున్నారు? మళ్ళీ రామాయణం చూసినట్లే అయింది.రావణుడు ఎందుకు అలా అయ్యాడని చెప్పాలనుకున్నరేమో!నిజం చెప్తున్నాను నాకు చాలా విషయాలు అర్ధం కావు. కానీ నోరు మూసుకొని వుండను ఏదో ఒకటి వాగుతుంటాను.అలాగే రావణ్ కూడా నాకు నిజంగా అర్ధం కాలేదు కానీ ఏదో వాగుతున్నా, నాకు అర్ధం అయిన వరకు. రావణ్ విలన్ గా ఎందుకయ్యాడు అని చెప్పాలని చూశారనిపించింది.

నిజంగా మన సమాజంలో నక్సలైట్లు ఎందుకు తయారవుతున్నారు అని చెప్పిన రీజన్స్  అన్నీ ఇంచుమించు ఇలాగే వుంటాయా? నిజానికి నక్సలైట్లు,విప్లవకారులు తయారయ్యేది కేవలం వారికేదో అన్యాయం జరిగిందనేనా? కాదేమో! నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకునేదాన్ని నాకు నిజంగా నక్సలైట్లు తో మాట్లాడిన సంధర్భం ఎదురైన వరకు. అసలిప్పటికీ అది నిజంగా జరిగిందా అని నమ్మలేకపోతున్నాను.ఒకరకంగా నాకున్న ఈ అలవాటు( అర్ధం అయి కాకపోయినట్లుండడం, కొన్ని విషయాలు నిజంగా జరిగినా జరగనట్లు అనిపించడం) నన్ను ప్రశాంతంగా వుండనిచ్చాయనుకుంటా.(నేను చెప్పే కధలన్నీ పెద్దగా వుంటాయి మరి, ఓపిక వుందా?)

నేను వజ్రపుకొత్తూరు మండలం లో పని చెయ్యటం మొదలయ్యాక ఇక అక్కడే మా స్థావరం ఏర్పాటు చేసుకున్నాము.మొదట్లో నేను, శ్రీను, రెడ్డీ మాత్రమే వున్నా తరువాత టీం లో చిత్ర, ధర్మా చేరారు.మేము వజ్రపుకొత్తూరు మండలం రాజ్యాన్ని మొత్తం పంచేసుకున్నాము.నా సామ్రాజ్యం పలాస నుండి బెండిగేటు మద్య ప్రాంతం. మెయిన్ లైను గ్రామాలతో పాటు లోపల ఇంటీరియర్ గ్రామాలు అన్నీ నావే. మొదట్లో నడిచి, బస్సుల్లో తిరిగే వాళ్ళం,కొన్నిరోజులకు అమ్మాయిలకి కైనటిక్ హోండాలు, అబ్బాయిలకు సుజికి సమురాయ్ లు ఇచ్చారు. దాని తో పని కాస్త సులభం అయింది.అలాగే గ్రామాలలో రాత్రిపూట వుండిపోవటం తగ్గిపోయింది. పని ముగించుకొని వీలైనంతవరకు తిరిగి వచ్చేసే వాళ్ళం.కానీ మా పని దొంగల్లాగా సాయంత్రం మొదలవుతుంది. పగలు గ్రామస్థులు అందరు పనులకు వెళ్ళిపోతారు సో, మనం వెళ్ళి పొదుపు చెయ్యండి, గ్రూపులు కట్టండి, మీ గ్రామంలో సమస్యలేంటి, ఊరి చెరువు ఎండిపోయింది అందరం కలిసి శ్రమదానం చేసి పూడిక తీద్దాము,పిల్లల్ని బడి కి పంపండి పనులకు వద్దు అని క్లాస్ పీకితే ఆ సమయంలో వినరు సరికదా మనల్ని నాలుగు పీకుతారు. అందుకని చక్కగా పక్షులన్నీ గూటికి తిరిగొచ్చే వేళ, పశువులన్నీ లేగ దూడలకి పాలు ఇవ్వాలని పరిగెడుతూ ఇంటికొచ్చే వేళ, పగలంత మండుటెండలో చెమటలు కక్కుతూ కూలి పని చేసినా ఇంటికెళ్తూ ఒకరిపై ఒకరు హాస్యాలాడుకుంటూ హుషారుగా వెళ్తున్న ఆడవాళ్ళను చూస్తూ మేము మా బండి స్టార్ట్ చేసుకొని ఊరిమీద పడతాము. మేము వస్తాము అని చెప్పిన గ్రామానికి వాళ్ళు ఇచ్చిన టైముకి మాత్రం వెళ్ళే వాళ్ళం ఎందుకంటే వాళ్ళకున్న పనులు,అలసట వల్ల జనాలకి తీరికే వుండదు(ముఖ్యంగా ఇంట్రస్ట్ వుండదు) అందుకని ఇచ్చిన అవకాశం మేమెలా వదులుతాము. అలా వెళ్ళి ఎక్కువగా మహిళలతో గ్రూపులు కట్టించటం, పొదుపులు చేయించటం చేసే ముందు గ్రామంలో సమస్యలని ఏదో ఒకటి పరిష్కరిస్తూ ఆ గ్రామంలో ఎంటర్ అయ్యేవాళ్ళం. కొత్తగా గ్రూపు చెయ్యాలన్నా, గ్రూప్ మీటింగులు అయినా, గ్రామస్తులతో మీటింగ్ అయినా అన్నీ అయ్యే సరికి ఎలా కాదన్నా 8-9 అయ్యేది. అప్పుడు ఒక్కోసారి వాళ్ళు బోజనం కూడా అంటే ఇంకా ఎక్కువ టైమయ్యేది. ఆ టైములో తిరిగి వెళ్ళే వాళ్ళం. మొదట్లో ధర్మా, శ్రీను, రెడ్డీ ఎవరు ఫీల్డ్ కి వెళ్తుంటే వాళ్ళతో నేను, చిత్ర ఎవరో ఒకరి బైక్ పై వెళ్ళే వాళ్ళం. మా ఏరియా లు డివిజన్ ప్రకారం నా గ్రామాలు, రెడ్డీవి కలిసేవి, చిత్ర గ్రామాలు, ధర్మా వి కలిశాయి.ఒకే బండి లో వెళ్ళి రెండు గ్రామాలు చూసి వచ్చే వాళ్ళం. కాని ఒకసారి రెడ్డీ నన్ను "నేనేమైనా నీ డ్రైవర్ అనుకున్నావా, ఎన్నాళ్ళు నా మీద డిపెండ్ అవుతావు" అన్నాడు. నాకు చాలా అవమానం అనిపించింది, నేను జీవితంలో సైకిల్ కూడా సరిగా నేర్చుకోలేదు, అలాంటిది ఒక్కదాన్నే ఖైనటిక్ తీసుకొని ఫీల్డ్ కి వెళ్ళిపోయా (ఆ తరువాత ధర్మా నన్ను వెతుక్కొని వచ్చాడనుకోండి).కాని ఆ ఉక్రోషంలో నాకు డ్రైవింగ్ వచ్చేసింది. అందుకు ఎందరో సహకరించారు.నేను బండి తీసుకొని బయటకెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళే ప్రతీ వాళ్ళు కాసేపు వాళ్ళపని ఆపేసి పక్కకి జరిగి ఆగిపోయేవారు.బస్సు డ్రైవర్ బస్సుని వీలైనంత పక్కకి తీసి ఆపేసే వాళ్ళు. ఆఖరికి చిన్నపిల్లలు, వీధి కుక్కలు కూడా  దారి ఇచ్చేసే వాళ్ళు.(అందరికీ నేనంటే అంత మర్యాద). ఒక్క కోడి జాతి మాత్రం నాకు నిజమైన సవాళ్ళుగా నిలిచాయి. ఎక్కడో దూరంగా ఇంటి వెనుక  మేస్తుండేవి నా బండి వస్తుందనగానే ఎగురుకుంటా వచ్చి నా బండి కింద పడేవి.పల్లెలో "తమ్ముడు తమ్ముడే,పేకాట పేకాటే " ఎంత మేడం అయినా కోడి ని గుద్దిస్తే 200/- ఇవ్వాల్సిందే.(బహుశా నా బండి కిందే అన్నీ కాస్ట్లీ కోళ్ళే పడేవేమో!ధర్మా కి ఎప్పుడూ 20/-మాత్రమే ఖర్చు అయ్యేది,మాకు కోడి కూర కూడా వచ్చేది).

ఇలా మొత్తానికి డ్రైవింగ్ వచ్చేసాక ఒక్కదాన్నేఅ ఆ నిర్మానుష్యమైన రోడ్లమీద ఝూమ్మని వెళ్తుంటే వావ్ ఎంత బాగుండేదో!!అప్పట్లో ఆ పల్లెల్లో బైక్ మీద తిరిగే అమ్మాయిగా పేరు గాంచాను. చిత్ర కి ముందే డ్రైవింగ్ వచ్చు కానీ చిత్రకి తెలుగు రాదు, తెలుగు మాట్లాడాలని చూసి బూతులు మాట్లాడేసేది.అందుకని ఎలాగూ తను ఎవరో ఒకరితో వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువగా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఎడారిలో బతుకుతున్న వాళ్ళకి పెద్ద వాటర్ ఫాల్ దొరికినట్లైంది నా జీవితంలో చిత్ర రావటం.ఒక సంవత్సరంగా ఇద్దరబ్బాయిలతో తిరిగటం, మాట్లాడటం, 24 గంటలు నా ఎదురుగా అబ్బాయిలే. ఎంతైనా అమ్మాయిలకి అమ్మాయిల స్నేహం గొప్ప, అలాగే అబ్బాయిలకి కూడా. చిత్ర నన్నెంత ప్రభావితం చేసిందనే విషయం గురించి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.ఇక నేను నా పని ఎవరిమీదా ఆధారపడకుండా చాలా పనులు చెయ్యగలగటం వీలయ్యింది డ్రైవింగ్ వచ్చాక. ఆ స్వతంత్రం ఎంత ఆనందమో అనుభవిస్తేనే తెలుస్తుంది. బైక్ మీద వెనక కూర్చొని వెళ్ళడానికి, బైక్ మనమే డ్రైవ్ చెయ్యడానికి పెద్ద తేడా ఏముంది అనుకుంటాము.కానీ బహుశా అమ్మాయిలకి అర్ధం అవుతుందేమో! నాన్నో, అన్నయ్యో, ఆయనో , తమ్ముడో తీసుకెళ్తే కానీ చాలా పనులు చేసుకోలేకపోవటం, వెళ్తున్న దారిలో అందమైన గడ్డిపూలు కనిపిస్తే, చిన్న కుక్కపిల్ల కనిపిస్తే, చల్లని జీడితోటలో కాసేపు కూర్చోవాలనిపిస్తే ఆగలేకపోవటం,  తలమీద చేపల బుట్ట బరువుతో ఎండలో ఒంటరిగా వెళ్తున్న ముసలామెని బైక్ ఎక్కించుకోవటం, పలాసకి కాలేజి కెళ్ళి గుంపులుగా వస్తున్న అమ్మాయిలని పలకరిస్తు పిచ్చాపాటి చెప్పటం ఇవన్నీ కుదురుతాయా మనకి. ఇలాంటివెన్నో వందల వేల అనుభవాలు, ఆ ప్రయాణాలలో.బహుశా ఇలాంటి పిచ్చి కోరికలన్నీ అమ్మాయిలకే వుంటాయేమో, చిత్ర కూడా నాలాంటిదే. కానీ రాత్రి మీటింగ్ అయ్యాక తిరిగి రావటం మాత్రం.....కాస్త భయంగా వుండేది. అది అసలే జీడితోటలు, చీకటి.

చాలా సార్లు ఆ తోటల్లో వస్తుంటే కొందరు నా బండి ఆపి నేనెవరు ఏంటని అడిగే వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు అక్కడేమి చేస్తున్నారని అడగాలనిపించినా అడగలేదు, వాళ్ళ తోటలు వాళ్ళిష్టం.ఒకసారి మా ఇంట్లో వాళ్ళు నాకోసం ఏదో పంపిస్తే ఇవ్వడానికని మా తమ్ముడి ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు.మా ఇంట్లో మా అందరి స్నేహితులు మాతో పాటు మా ఇంటిమనుషులైపోతారు.నాతో పాటు ఒకరోజు ఫీల్డ్ కి వచ్చాడు.మీటింగ్ త్వరగానే ముగించి బైక్ మీద వస్తున్నాము. జీడితోటల్లో అలా చీకటిలో వస్తుంటే సుధాకర్ పైప్రాణాలు పైనే పోయినట్లున్నాయి.తను కాస్త భయస్థుడు, దారిపొడుగునా చీకట్లో ఎటువంటి భయాలు పడొచ్చో అన్నీ చెప్తున్నాడు, దూరంగా ఏవో మంటలు కనిపించాయి"బాబీ అవి ఏంటి ఆ మంటలు అని అడిగాడు, అసలే చీకటిలో డబల్స్ డ్రైవింగ్లో బిజీగా వుండి పరధ్యానంగా ఏదో శవం అయివుంటుందిలే సుధా అని చెప్పేశాను" ఇక సుధాకర్ నా ప్రాణాలు తీసేశాడు.బాబీ త్వరగా పోనీ, జాగ్రత్తగా పోనీ అంటూ, దెయ్యాలలో రకాలు, ఏ దెయ్యం కి ఏమి ఇష్టం అని చెప్తూ  భయపడుతూ నన్ను భయపెట్టసాగాడు. కానీ ఇంతలో మా బైక్ ని ఎవరో ఆపారు.

30-40 వయసులో వుంటారు, ఆ చీకటిలో నుండి ఎలా వచ్చారో తెలీదు. అందులో ఒకతను ఇంతకు ముందుకూడా ఒకసారి నా బండి ఆపాడు.అతను కోపంగా"నీకెన్నిసార్లు చెప్పాలమ్మా రాత్రిపూట ఇలా బండేసుకుని తిరగొద్దని, పోలీసులనుకోవచ్చు, ఏదైన జరగొచ్చు, అయినా అమ్మాయివి కదా రాత్రిపూట మీటింగులేంటి పగలు పెట్టుకో..."అని అరుస్తున్నాడు.నేను కూడా నా జాబ్ ఇది మీకేంటి అని చెప్పాలని చూశాను కానీ ఇంతలో రెండో అతను ఈయన్ని ఆపి, ఏమ్మా రాత్రి పూట ఇలా తిరగకమ్మ, ఇది మంచి ఏరియా కాదు, అన్నలుంటారు, పోలీసులు కూంబింగ్ చేస్తుంటారు,జాగ్రత్త. అని సుధాకర్ వైపు చూసి నువ్వెవరు అని అడిగారు.సుధాకర్ అప్పటికే గడ గడా వణుకుతున్నాడు.మా తమ్ముడు అని చెప్పాను నేను.వాళ్లు అనుమానంగా చూసి సరే మేడం మీరు పలానా గ్రామలో ఎస్.సి. వాళ్ళకి గ్రూపులు చెయ్యరా అని అడిగారు.ఎందుకు చెయ్యను ఆ గ్రామంలో వాళ్ళు అసలు నా మాట వినడంలేదు అని చెప్పాను. రేపు ఉదయాన్నే 8గంటలకి ఆ గ్రామంకి రండి, అక్కడ యాదమ్మ అని వుంటుంది ఆవిడని కలవండి, ఆమె మీకు సహాయం చేస్తుంది అని చెప్పాడు. సరే అని ఇక వెళ్తాను అని బయలుదేరాను.సుధాకర్ ఇంటికెళ్ళేవరకు ఇంకొక్క మాట మాట్లాడలేదు. ఉదయాన్నే బస్సెక్కిస్తే వెళ్ళిపోయాడు.వెళ్ళేముందు "బాబీ నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలా డేంజర్ గా వుంది, నీకు చెప్పేంతవాడిని కాదు,నువ్వు నీకు నచ్చినపనే చేస్తావు అని తెలుసు,కానీ జాగ్రత్తగా వుండు బాబీ."అని సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి వెళ్ళాడు.ఇక అప్పుడు బయలుదేరి ముందురోజు రాత్రి అతను చెప్పిన గ్రామానికి వెళ్ళాను.అప్పటికీ నాకు తెలీదు నేను ఒక సీక్రెట్ మీటింగ్ లో పాల్గొనబోతున్నానని, ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నానని.

ఆ ఊరు అప్పటికి 4 సార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా నన్నేదో చిన్నపిల్లని కదా చూసినట్లు చూసి పెద్దగా పట్టించుకోరు. నేను చెప్పేది మాత్రం పూర్తిగా వినేవాళ్ళు ఆహా ఎంత బాగా వింటున్నారు అనుకునే లోపే సరే మేడం వుంటాము, అని ఇన్ డైరెక్ట్ గా నన్ను వెళ్ళిపొమ్మనేవాళ్ళు.బాగా పొడుగ్గా వున్నాడుకదా రెడ్డే మాట వింటారేమొ అనుకుని తను కూడా ట్రై చేశాడు. అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టాము, ఆ ఊర్లో ఏ  పప్పూ ఉడకలేదు. సరే ఇప్పుడెవరో వాళ్ళే పిలిచి సహాయం చేస్తాము అని చెప్పారు కదా, ఇక ఎటువంటి ప్రాబ్లెం లేదు అనుకున్నాను. ఆ యాదమ్మ ఎవరో కాని వెతకాలి అనుకుంటుండగా ఒకామే నా దగ్గరకి వచ్చింది.ఇంతకు ముందు మీటింగులకి వచ్చిన ఆమె కాబట్టి పలకరించాను. ఆమెని అడిగాను యాదమ్మ ఎవరు అని. ఆమే యాదమ్మ ఇంటికి తీసుకుపోతా రా మేడం అని తీసుకెళ్ళింది. ఆ ఊర్లో సందులన్నీ తిప్పింది. బయటనుండి చూస్తే చిన్న ఊరిలా వుంది కాని పెద్దదే, ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెనక్కి వెళ్ళలాంటే ఊర్లో ఎక్కడికొచ్చానో అర్ధం కాకుండా చుట్టు చుట్టు తిప్పింది ఆవిడ. చివరిగా ఒక తాళం వేసి వున్న ఇంటికి తీసుకెళ్ళింది. అయ్యో ఇంత దూరం వచ్చాక ఆవిడ లేదే అని అనుకున్నాను. కానీ నాతో వచ్చిన ఆవిడ విచిత్రంగా ఆ ఇంటి బయట గ్రిల్స్ తలుపుకి వున్న తాళం తీసింది. అదేంటి ఇది మీ ఇల్లా? అని అడిగాను. కాదు యాదమ్మ ది అని చెప్పింది, అంటే మీరే యాదమ్మ నా? అని అడిగాను, కాదు తాళం నాకు ఇచ్చింది అని చెప్పింది. ఇదేంటో యాదమ్మకి నేనొస్తున్నానని తెలుసా?లెక ఎప్పుడూ తాళం మీకే ఇస్తుందా అని అడిగాను. ఆవిడ ఒక చూపు చూసి( నీ ప్రశ్నలతో చంపకే బాబూ అన్నట్లు) ఇక్కడే కూర్చో మేడం ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ధుమ్ముపట్టిన ఒక చెక్క కుర్చీ, కొన్ని ధాన్యం బస్తాలు వున్నాయి. ఇంకేమీ లేవు. ఇల్లంటా ధుమ్ము పట్టి వుంది. ఆ ఇంట్లో ఎవరూ కాపురం వుంటున్న సూచనలు లేవు. బయట వరండా ఇలా ధుమ్ము పేరుకొని వున్న ఇళ్ళు, అదీ పల్లెల్లో అసాధ్యం.అంతే కాదు ఈఒక్క గది కాదు తరువాత తలుపుకూడా తాళం వేసి వుంది. పల్లెల్లో ఎవరైన కాపురం వున్న ఇంటికి ఇన్ని తాళాళు పెట్టి పనికి వెళ్ళరు. సో ఈ ఇంట్లో ఎవరూ వుండటంలేదు అని నా మైండ్లో అంతా ఆలోచిస్తూ వున్నాను. అరగంటయింది ఎవరూ రాలేదు. యాదమ్మా రాలేదు, నన్ను అక్కడికి తెచ్చినమ్మా రాలేదు.అసలా వీధిలో ఎవరితో అయినా మాట్లాడదామంటే అక్కడ ఇళ్ళు ఎక్కువగా లేవు, వున్న ఇళ్ళల్లో ఎవరూ లేరు.అందరు పనికి వెళ్ళే టైము కదా నాకు ఇంకా అక్కడే ఎదురు చూడాలా వద్దా అర్ధం కాలేదు. ఈలోగా తాళం వేసి వున్న ఆ లోపల గదిలో ఎవో కొన్ని శబ్దాలు వినిపించాయి. నాకెందుకో ఆ లోపల ఎవరో వున్నారనిపించింది. ఆ శబ్దాలలో ఇందాక నాతో వచ్చిన ఆవిడ వున్నట్లనిపించింది.బహుశా వెనక తలుపు నుండి వచ్చారేమో అని ఇంకాసేపు ఎదురు చూశాను.ఎవరూ బయటికి రాలేదు. ఇంతలో ఒక 8-9 సంవత్సరాల అబ్బాయి అక్కడికి వచ్చి ఎదురింటి దగ్గర కూర్చున్నాడు. మనుషులెవరైనా కనిపిస్తే చాలని ఎదురుచూస్తున్నానేమో వెంటనే బయటకెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళాను, ఆ పిల్లాడు నేను పిలుస్తుంటే సిగ్గు పడుతూ వెనక్కి పరిగెత్తటం మొదలు పెట్టాడు. నేను కూడా వాడి వెనక కాసేపు వెళ్ళాను. ఇక వాడు నాకు దొరకడని నాకు అర్ధం అయి మళ్ళీ వెనక్కొచ్చాను. కానీ ఈసారి ఆ ఇంట్లో ఒక మనిషి కూర్చొని వున్నాడు, ఆ తాళం వేసి వున్న తలుపు తాళం తీసి వుంది, అతను చాలా సన్నగా ఎదో తేడా గా వున్నాడు. ఇందాక లేని ఇంకో కుర్చీ ఎక్కడనుండి వచ్చిందో, ఇతనెక్కడినుండి వచ్చాడో నాకు అర్ధం కాలేదు. నేను లోపలికి వెళ్ళాలో లేక వెళ్ళిపోవాలో కూడా అర్ధం కాలేదు. వెళ్ళిపోతే చెప్పకుండా వెళ్ళినట్లుంటుందని లోపలికి వెళ్ళి అతనితో "ఏవండీ యాదమ్మ ని కలవాలని వచ్చాను...నా పేరు..." అని చెప్పబోయేంతలో అతను "తెలుసు, రా లోపలికి వచ్చి కూర్చో" అన్నాడు. నా పేరు తెలుశా లేక నేను వచ్చిన కారణం తెలుసా అని ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను.

(కాస్త టెన్షన్ పడండి ఒక వారం...అప్పటివరకు విరామం!!)