నాగార్జున సాగర్ చూశానోచ్. మన నెహ్రు గారి పుణ్యం, ఎందరో వ్యక్తుల శ్రమ, మన దేశానికే గర్వకారణం అయిన బహుళార్ద సార్ధక ప్రాజెక్టు చూశాను. ఈ మద్య రెండ్రోజులు మాకు అక్కడే మీటింగ్ అయింది. సరే అంత పెద్ద డ్యాం దగ్గర ఏమి చూశావు అని మాత్రం అడకండి ఎందుకంటే అందులో పెద్దగా నీళ్ళు లేవు. సో బహుళార్ధం సార్ధకం అంతా సగం సగం పని చేస్తుంది. కాకపోతే కృష్ణ అంటే నలుపు అని చెప్పినట్లు నల్లటి కృష్ణ లో కాసేపు జలకాలాడాము, నీటి ప్రవాహంలో నున్నగా మారిన రాళ్ళు ఏరుకొని ఇంటికి మోసుకొని వచ్చాను. ఇప్పుడవి ఏమి చెయ్యాలో తెలియక అలా వుంచాను. ఏదో ఒక రోజు మా ఇల్లు మ్యూజియం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కడెక్కడనుండో తెచిన గవ్వలు, ఆల్చిప్పలు, రాళ్ళు, రప్పలు వున్నాయి.
సరే ఇక అసలు విషయానికి వస్తాను, అసలేమి జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి....ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే...నేను బ్లాగ్ లోకాన్ని సందర్శించి చాలా నెలలైంది. టైము వుంది కాని, ఏంటో ఎందుకు రాయలేకపోతున్నానో అర్ధం కావటం లేదు. ఎందుకు రాయలేకపోతున్నాను అని చెప్తూ రాయడానికి కొన్ని సార్లు ప్రయత్నించాను. కుదరలేదు. మీరే చెప్పండి నేను ఎందుకు రాయలేకపోతున్నాను?
నా పరిస్థితి, ఇంతకు ముందు నా ప్రపంచం, ఇప్పుడు పరిస్థితి ఇవన్నీ చూసి చెప్పండి. నేను ఏమి చేస్తె రాయగలను? ఏ పరిస్థితులవల్ల రాయలేకపోతున్నాను అని.
లేదా ఏదైన టాపిక్ రాద్దాము అంటే ఏమి రాయాలి తెలియటం లేదు. పిచ్చి పిచ్చి పిచ్చిగా....పిచ్చెక్కినట్లుంది.
మీకు ఎప్పుడైన ఇలాంటి పరిస్థితి వచ్చిందా? వస్తే ఏమి చేశారు? అవును మరి నువ్వు రాయకపోతే లోకానికి కనీసం మాకేమైనా నష్టమా అని అడగకండి...నేను నాకోసమే రాస్తుంటాను. రాయటంలో మనసులో భావాలు బయటకి వచ్చి, భావాలు అక్షరాలుగా ఘల్లు ఘల్లు మని నాట్యం చేస్తున్నట్లు, మల్లెలుగా రాసులు పోగైనట్లు, ఒక చక్కని తృప్తి వస్తుంది. ఇప్పుడు ఆ తృప్తి లేదు. కీ బోర్డ్ మీద చెయ్యి అలా ఆగిపోతుంది. మనసు ఆలోచనలు, భావాలు రాక, రాయలేక బాధపడుతుంది. ఎందుకిలా అవుతుంది? నాకేమైంది? (నీకు పిచ్చి పట్టింది, నువ్వు ప్రేమలో పడ్డావు లాంటి ఆన్సర్స్ ఇవ్వొద్దు ప్లీస్)
మీకు నేను రాసిన పోస్ట్లు ఏవైనా నచ్చితే....నిజంగ చెప్పండి, నేను ఎందుకు రాయలేకపోతున్నాను, ఎటువంటి ఆలొచనలు చేస్తె రాయగలుగుతాను. హైదరాబాదు వచ్చి, కొత్త జాబ్ లో జాయిన్ అయిన నుండి రాయలేకపోతున్న. నేను ఏమి చెయ్యలి?(జాబ్ మానేయ్, హైదరబాద్ వదిలేయాలి అంతేనా? అది కాదు కాని ఇంకో మాట చెప్పండి) మనసులో సౌకుమార్యం, స్పందన లేనితనం నాకెందుకు వచ్చింది? నేను బండలా ఎందుకు మారిపోతున్నాను?అంటే రాయలేని వాళ్ళందరూ బండలా అని కాదు, ఎవరి భావ వ్యక్తీకరణ కొసం వాళ్ళు చేసే పని వాళ్ళు చెయ్యలేకపోవటం వాళ్ళలో ఆ సున్నితత్వం పోవటం వల్ల జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది అని నా ఫ్రశ్న?
తిండి,నిద్ర, పని షాపింఘ్ అన్నీ చెయ్యగలుగుతున్నాను. కాని మనసు లో సంతోషం లేదు. ఏ పని కూడా మనసుని తాకటం లేదు. నేను చేస్తున్న జాబ్ లో ప్రయాణాలు ఎక్కువ. మెదక్, మెహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాలు తిరుగుతున్నాను. అక్కడ పనిలో ప్రకృతిలో కూడా సంతోషం లేదు. జీవం లేనట్లున్న మైళ్ళు కొలది రహదారిపొడుగునా వున్న ప్రదేశాలు,తెల్లగా దుమ్ము తో ఎండ వేడితో తేమ లేని గాలి మనసు లో తడి కూడా ఆరిపోయేలా చేస్తుందా? కలిసిన ప్రతి కుటుంబంలో వున్న కన్నీరు కాని, ఏమీ మార్చలేని వారి జీవితాలాలో బాధ కూడా కరిగించలేని ఈ ఖటినత్వం నాకెందుకొస్తుంది? మనిషి సంతోషంలోనే రాయగలడా? బాధ కూడా రాస్తాము కదా.......కాని మనసు కి బాధ కలిగినా రాయాలేకపోతున్న ఈ పరిస్థితి కి కారణం ఏమై వుంటుంది? మీకు ఏమైన అర్ధం అవుతుందా? ఐతె చెప్పరూ..........
12 comments:
ఇలా అందరికీ అవుతుంది. ఉద్యోగంలో ఇలా అనిపించినా మానలేము కాబట్టి తప్పదు.కాని బ్లాగు అలా కాదు. ఇష్టముంటే రాయొచ్చు లేకుంటే లేదు. మనని ఎవరూ తన్నరు. కొద్దిరోజులు ఇలాగే ఉంటుంది లెండి. కాని ఇలా ఎందుకవుతోంది అని ప్రశ్నించుకోవడం చాలా మంచిది.. ఏం పర్లేదు. రాయకున్నా కూడా బ్లాగులు, వెబ్ పత్రికలు చదవండి. టీవీ సీరియళ్లు చూడండి. కనీసం తిట్టడానికైనా బ్లాగు ఓపన్ చేస్తారు. ఓం ప్రధమంగా ఎల్లుండి సుమన్ సినిమా చూడండి. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా మీ వైరాగ్యమంతా మాయమవుతుంది..:) ఆల్ ది బెస్ట్...
శిరీష గారు......ఈ మధ్య మీ బ్లాగు లో పొస్ట్ లు లేక పోయేసరికి ఈ సారి ఖక్షితంగా మంచి పొస్ట్ తో వస్తారని ఎదురు చూస్తున్నాను..... ఊ...కొడతార ఉలిక్కి పడతార అని చెప్పి ఇప్పుడు మీరు డల్ అయిపోతే ఎలా.....ఈ వీక్ ఎండ్ ని బాగా ఎంజాయ్ చేసి ఆ కబుర్లు పంచుకొండి...విని అనందపడుతాం....
Enjoy this period and come with a good post........
urs,
regular follower
అప్పుడప్పుడు ఇలా అనిపించడం చాలా మంది బ్లాగర్లకి సంభవించే విషయమే అనుకుంటాను - నాతో కలిపి. బ్లాగోవడం గురించి మరీ అంతగా బాధపడకుండా ముందు మీరు బాగవ్వండి. అప్పుడప్పుడు ఇలా విశ్రాంతిని ఇవ్వడం వల్ల ఆత్మ శోధనకి అవకాశం ఏర్పడి మరింత ఉత్సాహంగా, పరిణతిగా వ్రాయగలుతాము. జ్యోతి గారు చెప్పినట్లుగా చెయ్యండి. సుమన్ సినిమా చూడండి :) మాకు అంత అదృష్టం లేనందుకు దుఖిస్తున్నాం. మా కష్టంతో పోల్చుకుంటే మీ కష్టం ఎంతా?
బ్లాగులు ఇష్టపడి వ్రాస్తేనే బావుంటుంది - కష్టపడి కాదు.
ఎవరికోసమో ఎందుకు మీకోసం మీరు రాయండి, నచ్చితే రాయండి, లేదా ఎవడోకడ్ని రాయిచ్చుకుకొట్టండి, మాంఛి టైం పాస్
వెల్కం బ్యాక్ శిరీష గారూ... బాగున్నారా? ;)
మీకు సలహా ఇచ్చేంతవాడిని కానుగానీ.. మీరు ప్రస్తుతం ఉన్న మూడ్ నుండి బయటపడీ అంతకు ముందులాగా పవర్ఫుల్ పోస్ట్ లు రాయాలని కోరుకుంటున్నా మీ అభిమాని గా.
ఊకొట్టడానికీ, ఉలిక్కి పడటానికీ మేము రెడీ మీరు కధ చెప్పండి ఇక ;)
nenu enduku bolg start cheyyalekapothunnanu cheppandi.. ;-) miku answer chepta.
ఏదో ఆరోగ్యం బాగోలేకో, మనసు చెదిరో అలా అనిపిస్తుంది లేండి. రాయండి, కసితీరా రాయండి. మీరు రాసేది కొనెం వాస్తవంగా వుంటుంది. జ్యోతిగారి అభిమాన నటుడు ETvసుమన్ చిత్రమో, బాలయ్య సినిమానో, అలు అరవింద్ నత్తి డైలాగులో వినండి, వుత్సాహం వస్తుంది. రాసేముందు ఓ గ్లాసుడు బూస్ట్ తాగండి.Boost is secret of my energy
ఏదో ఆరోగ్యం బాగోలేకో, మనసు చెదిరో అలా అనిపిస్తుంది లేండి. రాయండి, కసితీరా రాయండి. మీరు రాసేది కొనెం వాస్తవంగా వుంటుంది. జ్యోతిగారి అభిమాన నటుడు ETvసుమన్ చిత్రమో, బాలయ్య సినిమానో, అలు అరవింద్ నత్తి డైలాగులో వినండి, వుత్సాహం వస్తుంది. రాసేముందు ఓ గ్లాసుడు బూస్ట్ తాగండి.Boost is secret of my energy
చాలా రోజులు బ్లాగుకి దూరంగా వుంటే నాకూ అలానే రాయాలని అనిపించదు. కొంత గేప్ తీసుకు వచ్చిన తరవాత వెంటనే రాయకపోయీనా మిగతా బ్లాగులు చదువుతూ కామెంట్స్ రాస్తూ వుంటే క్రమంగా మనకీ రాయాలని అనిపిస్తుంది అందాకా ఎంచక్కా ఇతరులు చెప్పే కబుర్లు చదువుతూ గడపొచ్చు . నేను రెండు నెలలు గేప్ తరువాత ఇప్పుడే రాయటం మొదలు పెట్టాను.
శరత్ గారు చెప్పినట్టు బ్లాగులు ఇష్టపడి రాస్తేనే బావుంటుంది .
దీనినే బ్లాగ్ వైరాగ్యం అంటారు...ఇది ఎప్పుడో ఒకప్పుడు ప్రతీ బ్లాగరుకీ కలిగేదే...మరే పర్లేదు...తొందరలోనే ఇది పోయి మీరు కొత్త కొత్త టపాలు ఆనందంగా రాస్తూ మాకూ సంతోషాన్ని పంచిపెడతారు..చూస్తూ ఉండండి. :))
All of us go through this.
Since, in general you have been writing about serious issues and topics, you are perhaps putting pressure on yourself to write in the same vein. No need. Write freely - whatever comes to mind - for a few posts. This will ease your "writing muscles" :) Main thing is - keep writing.
@ sowmya, kothapali, jabili,Sharat,Lalitha, venuram and Jyothi,
With all your encouragement though your comments i feel welcomed again. thanks alot. will try to read and write as before.
Post a Comment