చెన్నై కి ఒక నమస్కారం పెట్టేయాలనిపిస్తుంది.కానీ అలా వదిలించుకునే వీలు ఇప్పట్లో కనిపించటం లేదు. నేను పనిచేసే సునామీ ప్రాజెక్ట్ కి హెడ్ ఆఫీసు చెన్నై లోనే వుంది. మొన్న 4 రోజులుగా చెన్నై లో వున్నాను. ట్రైన్ దిగగానే ఎవరో ఫెడేల్ మని కొట్టినట్లు తగిలింది వేడి గాలి. సరేలే ఎంత సేపు ఆటో లో హొటెల్ కి చేరిపోతే హాయిగా ఎ.సి కదా అనుకున్నాను. నా మనసులో మాట పైన "అతధాస్తు" దేవతలకి వినపడినట్లుంది. నీ పని చెప్తాము ఆగు అనుకున్నారు. అంతే జనాలందరూ తోసేస్తూ నన్ను ఎలాగో మొత్తానికి ఆటో స్టాండ్ దగ్గరికి చేర్చారు. నాకొచ్చిన తమిళం లో అషోక్ పిల్లర్ కి పొళామా అని అడిగాను. వెంటనే ఆటో వానికి అర్ధం అయిపోయింది నాకు తమిళం చాలా బాగా తెలుసని. 200 అని చెప్పాడు. వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లో మా తమిళ్ కొలీగ్ ఆటో బేరం చేసిన సీన్ గుర్తు చేసుకున్నాను, "ఎన్నప్పా ఇంద మాదిరి, కొంజెం చూసి చొల్లుంగొ" అన్నాను. అంతే టప టప బడ బడ అని ఏదో ఒక 5 నిముషాలు గుక్కతిప్పుకోకుండా చెప్పాడు. అతను చెప్పింది నాకు ఎక్కడ అర్ధం కాలేదు అనుకుంటాడో ఖర్మ అని "చెరి అప్ప" 150 లేలో అన్నాను(లేలో హిందీ కాబోలు) ఏదో ఒకటి ఈ వేడిలో ఇంకాసేపు బేరం చెయ్యకుండా ఎంతో కొంత మా ఆఫీస్ డబ్బులు కదా నాదేం పోయింది అనుకుని ఆటో ఎక్కేసాను.ఆటో కొంచెం దూరం పోనిచి " అషోక్ పిల్లర్ ఇంగలుకు తెరియుమా" అని అడిగాడు. అసలే రాత్రి 10 అయింది నాకు దారి తెలియదు అంటే ఆటో వాళ్ళతో కష్టం అని కొంజెం తెరియుం అని చెప్పను. (కొంచెం తెలుసని). నన్ను ఊరికే టెస్ట్ చేస్తున్నాడు కాని చెన్నై లో ఆటో వాళ్ళకి అంత ముఖ్యమైన ప్రదేశం తెలియదా అనుకున్నాను.కాని ఆ పైనున్న దేవతల వరం వలన నాకు ఒక అద్భుతమైన ఆటో వాడు దొరికాడు. అతను కూడా శ్రికాకుళం నుండి 20 రోజుల క్రితమే చెన్నై కి వచ్చాడంట అతనికి కూడా సేం టు సేం నాలాగే కొంచెం తమిళం మాత్రమే వచ్చంట, సేం టు సేం నాలాగే ఎక్కడికి దారులు తెలీవంట. 5 నిముషాలకి ఒకసారి లెఫ్టా రైటా అని అడుగుతుంటే డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు. మరి ఇందాక అంత తమిళం మాట్లాడావు కదా అని అడిగితే అది తమిళం కాదమ్మ ఎదో కొంజెం కొంజెం తెరుయుం అన్నాడు. ఛా ఈ చెన్నై లో నన్ను ఒక తెలుగు వ్యక్తి తమిళంలో మోసం చెశాడా!!ఖర్మ. శుభ్రంగా తెలుగు మాట్లాడకుండా తమిళం మొదలు పెట్టి ఇద్దరం కష్టపడి తమిళం మాట్లాడామన్నమాట! సరే ఇప్పుడు ఎలా నాకు కూడా పూర్తిగా దారి తెలీదు అని చెప్పాను. అందుకే కదా మీకు తెలుసా అని అడిగాను అని దారి తెలియకపోవడం ఖచ్చితంగా నాదే తప్పన్నట్లు చెప్పాడు. పోనీ ఎవరినైనా అడుగు అంటే మీరు కూడా అడగండి నా తమిళం సరిగా వుండదు అని చెప్పాడు. అక్కడికి నాది తమిళ్ ఎం.ఎ.లిట్ అయినట్లు. సరేలే అని చెప్పాను. మొత్తానికి వాళ్ళనడిగి వీళ్ళనడిగి రాత్రి 12 గంటలకి నన్ను హొటెల్ కి చేర్చాడు. ఎవరు చెప్పింది మన దేశానికి స్వతంత్రం ఇంకా రాలేదని? నేనే ఉదాహరణ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా.....ఓహ్ ఆటో అబ్బాయి కూడా వున్నాడు కదా!! ఛా జస్ట్ మిస్ అయింది లేదంటే నేనే మనకి స్వాతంత్రం తెచ్చేసే దాన్ని.ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఎంత పెద్దైన ఆడవాళ్ళకి భయాలు వుంటాయి. ఎక్కడ మనసు భయం లేకుండా స్వేచగా వుండగలుగుతుందో ....అక్కడే కదా స్వతంత్రం. మనసులో భయం పోయిన రోజు 90% స్వతంత్రం వచ్చేసినట్లే. ఈ తతంగం అంతా అయ్యే లోపల నా ఫేస్ జిడ్డు పట్టేసి జుట్టు రేగిపోయి బాగా చెమటలు పట్టేసి నామీద నాకే అసహ్యం వేసేలా వున్నాను.నిజంగా అయితే నన్ను ఆ హొటెల్ లోపలకి రానీయకూడదు, మా ఆఫీస్ తరుపున నేను రెగ్యులర్ గా వెళ్ళటం వల్ల రానిచ్చారు. హొటెల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన రిసెప్షనిస్ట్ మాత్రం నన్ను చూసి ఐస్వర్య రాయ్ ని చూసినంత ఫీలింగ్ తో అద్భుతంగా నవ్వుతూ చూసి విష్ చేశాడు. అక్కడ కూడ "తంగ్లిష్" మాటలే. వెల్ కం మేడం అని మొదలు పెట్టి నల్లా ఇరికింగ్లా మేడం అని ఇంకా ఏదేదొ చెప్పాడు. మొత్తానికి నాకు అర్ధం అయింది ఏంటి అంటే.....ఏమి అర్ధం కాలేదు
ఈ సమ్మర్ ఎందుకొస్తుందో?అసలు సమ్మర్ సీజన్ లో ఆఫీసులెందుకో? మా ఆఫీస్ ఊటీ లోనో కొడైకెనాల్ లోనో లేదెందుకో? ఫార్మల్ డ్రెస్సులు వేసుకొనే ఆఫీసుకి ఎందుకు వెళ్ళాలో? హాయిగా నైటీ వేసుకొని రావొచ్చు అని కనీసం చెన్నై లో పాలసీ పెడితే బాగుండు.అసలు ఎ.సి ఎవరికి వారు పెట్టుకునే బదులు కొంచెం కస్టమైన సూర్యుడి ని ఎ.సి లో పెట్టేస్తే బాగుండును!!!నేను కేంపులు ఎక్కువయ్యి మార్నింగ్ వాక్ చెయ్యకుండా 10 రోజులనుండి కస్టపడి పెంచుకున్న కొవ్వంతా చెన్నై ఎండలకి 4 రోజుల్లో కరిగిపోయింది. అసలు ఎవరిని పలకరించామంటే చాలు తిడుతున్నారనిపించే సౌండ్ వచ్చేలా మాట్లడేస్తుంటారు. చచ్చినా హిందీ మాట్లాడరు, తెలుగు వచ్చినా రానట్లుంటారు. కాకపోతే వాళ్ళ భాషా ప్రాంతీయాభిమానం చూసి ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తుంది.
సరే ఇంకెన్నాళ్ళు సునామీ ప్రాజెక్ట్ అయిపోతుంది లే ఆ తరువాత ఎక్కడో వేరే ప్రాంతం వేస్తారు అనుకున్నాను...సునామీ వచ్చిన విషయం వాళ్ళు మర్చిపోయిన మేము అంత త్వరగా మరిచిపోనీయం అందుకే ఇంకా డిసెంబర్ వరకు పని చెయ్యాలి అని చెప్పారు. ఇంకో సంవత్సరం నాకు తమిళ్ కష్టాలు, చెన్నై వేడి ట్రాఫిక్ తప్పదు.హుహ్ ఏమి చేస్తాము!!! ఎవరికి ఎంత ఎండ వ్రాసిపెట్టివుంటే అంత.
ఏంటి ఈ సోది మాకు అనుకుంటున్నరా...వడదెబ్బ తగిలింది దాని ఫలితమే ఈ పైత్యం.
Friday, May 14, 2010
Thursday, May 13, 2010
అభిమానులు క్షమించాలి( అంత లేదంటారా??)
నేను ఇప్పుడు తిరుపతి -బిలాస్ పూర్ ట్రైన్ లో వైజాగ్ వెళ్ళాలి. ట్రైన్ 1.40 కి నాకు టికెట్ కంఫర్మ్ కాలేదు. ఆన్ లైన్ లో చేశాను కాబట్టి అది కేన్సిల్ అయిపోతుంది. నెల్లూరు నుండి వైజాగ్ దాటి వెళ్ళలి అంటే మధ్యానం 2 నుండి రేపు ఉదయం 8 వరకు ప్రయాణం. ఎలాచెయ్యాలి? ఈ నెలంతా ప్రయాణాలు కొన్ని ఎ.సి దొరుకుతున్నాయి కొన్ని దొరకవు. కొన్ని వెయిటింగ్ లిస్ట్ లు కొన్ని ఆర్.ఎ.సి లు. నా ట్రైన్ కస్టాలే ఎక్కువగా వున్నాయి.
వీలైనంత త్వరగా పోస్ట్ రాయడానికి చూస్తాను. నా పోస్ట్ కోసం కూడా ఎదురుచూసే జీవులున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. వున్న ఒకరిద్దరు ఫేన్స్ ని ఐనా కాపాడుకోవాలి కదా!!
వీలైనంత త్వరగా పోస్ట్ రాయడానికి చూస్తాను. నా పోస్ట్ కోసం కూడా ఎదురుచూసే జీవులున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. వున్న ఒకరిద్దరు ఫేన్స్ ని ఐనా కాపాడుకోవాలి కదా!!
Monday, May 3, 2010
లేడీ బాస్
వెలుగు ప్రోగ్రాము మొదట 6 జిల్లాలో పైలట్ చేశారు. నా అదృష్టం కొద్దీ నేను అందులో పనిచెసే అవకాశం నాకు వచ్చింది. జీవితంలో అది మంచి మలుపు. అసలెవరకీ ఆ ప్రొగ్రాము గురించి తెలీదు అప్పటికి. పనిచేస్తున్న మాకు కూడా తెలీదు పూర్తి వివరాలు.సరే అంత మంచి అవకాశం నాకెలా వచ్చిందో చెప్తాను.
నేను జాబ్ వెతుకుతున్న టైములో నా బ్యాచ్ లో వాల్లంత అదే పనిలో వున్నారు. నేనే ఎదో చిన్న జాబ్ అయిన చేస్తున్నాను అప్పటికి. మిగిలిన వాళ్ళంత బేవార్స్ బ్యాచ్ అప్పటికి. నా ఫ్రెండ్స్ విజయనగరం లో వెలుగు ఇంటర్యూస్ కి వెళ్ళారు. కాని ఆరోజు నాకు అరుకు ఆఫీసులో విజిట్ వుండి, ఇంటర్యూ కి వెళ్ళటం కుదరలేదు. నేను పనిచేస్తున్న సంస్థకి ఆ విజిట్ చాలా ముఖ్యం అందుకని లీవ్ అడగలేకపోయాను.సో నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తరువాత వారంలో శ్రికాకుళం జిల్లా ఇంటర్యూలకు వెళ్ళొచ్చని అనుకున్నాను.కాని నా ఫ్రెండ్స్ కొందరు మన జిల్లా అనీ చెప్పి అక్కడ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని ఒప్పించి నన్ను మళ్ళీ ఇంటర్యూ కి పిలిపించారు.నాకు ముందుగా కాస్త ఉద్యోగ అనుభవం వుండటం వల్ల జెండర్ కో-ఆర్డినేటర్ పోస్టుకి పిలిచారు నన్ను. మిగిలిన నా స్నేహితులందరు కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ గా సెలెక్ట్ అయ్యారు. అసలు ఆ పోస్టలకు, పదాలకు అర్ధం కూడా మాకు నిజంగా తెలీదు. అందరు ఫ్రెష్ ఫ్రం కాలేజి. అలా అయితే బాగా మౌల్డ్ చెయ్యొచ్చని వెలుగు ప్రాజెచ్ట్ వారి అభిప్రాయం. అది కొంతవరకు నిజమే.
విజయనగరం ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్. తరువాత కాలం లో ఐ.ఎ.ఎస్ కంఫర్మ్ అయ్యింది ఆమెకి. ఆమెకి నేను ఎందుకో మొదట నచ్చనే లెదో లేక ఇంటర్యూ రోజు రాలేదనో ఆమెని చూడగానే నాకు అర్ధం అయిపోయింది ఆమెకి నేను నచ్చలేదు అని.(నాకు నచ్చారా లేదా అన్నది అనవసరం) సరే నా పని ప్ర్యత్నం చెయ్యటమే కదా!! క్వాలిఫికేషన్స్, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ అనుభవం అన్ని అడిగారు. జెండర్ అంటే ఏమి తెలుసు అన్నారు. నిజంగా డిక్షనరీ అర్ధం తప్ప నాకు అప్పటికి జెండర్ ఈక్విటీ గురించి పనిచెస్తే ఏమి చెయ్యాలి అనేది, అదొక పని వుందని కూడా తెలీదు. అయినా నాకు తెలిసిందే చెప్పాను. తెలుగులో స్త్రీత్వం, పురుషత్వం అనే అర్ధం అని. ఆమె నీకు అంతే తెలుసా? మరి నీ పోస్ట్ డెస్క్ ఆఫీసర్ జెండర్ అని వుంది నీ బయోడేటా లో అన్నారు. నిజమే కొథ్త్తగా నాకు అప్పగించిన ఇంకో పని మా ఆఫీస్ లో. కానీ దానిగురించి ఇంకా నాకేమి చెప్పలేదండి అని చెప్పాను.కేవలం కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చాము కొందరు దాయీలకి అని చెప్పాను. సరే మేమెలాగూ ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. హమ్మయ్య అనుకుని, థాంక్స్ చెప్పాను. అంతా బాగ అయ్యింది అనుకునే సరికి మలుపు తిప్పిన ప్రశ్న అడిగారు. "నీకు రేపు పెళ్ళి అయ్యాక(అంటే ఫ్యూచర్ లో) కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా? ఉద్యోగానికా? అని అడిగారు. నాకు తెలుసు ఎవరికైన కుటుంబమే ముఖ్యం, పెళ్ళి అయినా అవ్వక పోయినా కూడా. కానీ అలా చెప్తే ఉద్యోగం ఇస్తారా? అందుకె ఆలొచించడానికి టైము దొరుకుతుందని " అంతే యె విషయంలో మేడం అని అడిగాను" ఆమె మళ్ళీ సోదాహరణగా అడిగారు. ఫ్యూచర్లో నీకు పెళ్ళి అయ్యాక జాబ్ లో ప్రెజర్, ఇంట్లొ ప్రెజర్ ఎక్కువగా వున్నప్పుడు దేనికి ప్రాదాన్యత ఇస్తావు, ఏది వదులుకుంటావు అన్నారు. అంత వరకు చిన్న ఆశ వుండేది జాబ్ ప్రెజర్స్ మీద పనిచేస్తాను అని చెప్పడానికి. కానీ ఆమె ఏది వదులుకుంటావు అనే వుద్ధెశ్యంతో అడిగారు.ఇక అబద్దం చెప్పే ఉద్దెశ్యం నాకు లెదు. " నాకు కుటుంబమే ముఖ్యం దానికే ప్రాధాన్యత ఇస్తాను. వీలైనంత వరకు జాబ్ లో ప్రెఊర్ ని తట్టుకొని పనిచెయ్యడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎదో ఒకటి వదులుకోవాల్సి వస్తే తప్పదుకదా వుద్యోగమే వదులుకుంటాను. బహుశా అది ఆ జాబ్ కి న్యాయం చెయ్యటమే కదండి అన్నాను." కాని ఆమెకి ఈ జవాబు నచ్చలేదు(బహుశా నేను నచ్చలేదు) "ఈ ఉద్యోగం ఎంతో ముఖ్యమైనది మన కుటుంబంకంటే కూడా ఉద్యోగమే ముఖ్యం అనుకునే వాళ్ళే చెయ్యగలరు. నువ్వు ఈ ఉద్యొగానికి సరికాదు అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ పొజిషన్లో వున్న ఆమె చెప్తున్నారంటే అది నిజమేనేమో. ఆ ఉద్యోగం చెయ్యాలంటే అదే జీవితం గా భావించేవాళ్ళు కావాలేమో అనిపించింది. అలా అని నన్ను నేను ఊరడించుకుంటున్నాను మనసులో ఇంతలో ఆమె ఇంకొక మాట అనేశారు. ఇలా కుటుంబమే ప్రధానం అనుకునే నువ్వు ఎక్కడా పనిచెయ్యలేవు అని. నాకు చాలా కోపం వచ్చేసింది. చేతకానివాళ్ళకీ, నిస్సహాయస్థితిలో వున్నప్పుడూ కోపం వస్తే అది కన్నీళ్ళుగా మారిపోతుంది. ఆమె ముందు ఏడ్చేస్తానేమో అని చాలా కస్టపడి కంట్రోల్ చేశుకిని సరే మాడం చూస్తాను. నాకు తగిన జాబే వెతుక్కుని చేస్తాను తొందరేమీ లేదు అని చెప్పి వచ్చేశాను. బయట ఆశగా ఎదురుచూస్తున్న నా ఫ్రెండ్స్ కి ఎలా చెప్పాలి ఇలా మాట్లాడారు మీ మేడం అని. ఒకప్పుడు ఒకరికోసం ఒకరు ఆవెశంగా నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కదా! అప్పటికే పి.జి. చేసి ఒక సంవత్సరం ఖాళీగా వుండి బాధలు పడుతున్నారు. అప్పుడేదో చెప్పాను నాకు గుర్తులేదు కూడా.
అన్ని మన మంచికే జరుగుతాయి అనేది నిజమేనేమో! తరువాత నేను శ్రికాకుళం వెలుగు ప్రాజెక్టు లో సెలెక్ట్ అయ్యాను. ఆ ఇంటర్యూ ఒక సరదా కధ(నాకు). ఇంటర్యూ చెసినవాళ్ళకి కంఫ్యూజన్ పాపం. అది వచ్చేవారం రాస్తాను. కానీ నేను అసలు ఏ వుద్యోగానికీ పనికి రాను అన్న ఆమె కరెక్టుగా 4 నెలల తరువాత ఒక మీటింగ్ లో మా పి.డి గారితో పాటు ప్రెజెంటేషన్ చెయ్యడానికి వెళ్ళిన నన్ను, మీటింగ్ లో నేను మాట్లాడిన విధానం చూసి, మా పి.డి గారితో మీకు మంచి కేండిడేట్లు దొరికారండీ మా వాళ్ళు ఇంకా అంతగా లేరు అన్నారు. నాగురించి అడిగారు. ఆమె నన్ను గుర్తుపట్టలేదో ఏమో! కానీ మా పి.డి. గారు గుర్తుచేశారు, ఈమె పేరు శిరీష మీ జిల్లానే అని. ఆమె నన్ను చూసి "ఏమ్మాయ్ మన జిల్లా వదిలి పక్క జిల్లా కి ఎందుకు వెళ్ళావు?" అని అడిగారు. కాసేపు నా కోపం తీరేలా ఆమె నన్ను అన్న మాటలు తిరిగి గుర్తుచేద్దామా అనిపించింది. కానీ ఏదో మర్యాద అడ్డం వచ్చింది. బట్ మా పి.డి గారికి తెలుసు నేను ముందు అక్కడికి ఇంటర్యూ కి వెళ్ళిన విషయం ఆయన ఆనందంగా చెప్పారు. అసలే పి.డి.ల మద్య ఎప్పుదూ గిల్లికజ్జాలే."మీరు గుర్తుపట్టలేదేమో మీదగ్గరకే మొదట ఇంటర్యూకి వచ్చింది" అని చెప్పారు. నేను అవును అన్నట్లు తల ఊపాను.ఆమెకి గుర్థొచిచిందో లేదో నాకు తెలీదు కానీ ప్రతీ సారి ఏ మీటింగ్లో కలిసినా నన్ను గుర్తుపట్టలేదన్నట్లే వుంటారు. ఇప్పటికి ఆమే నేను ఎన్నో స్థాయిలలో ఎన్నోచోట్ల కలిశాము. సునామీ టైములో ఆమె జిల్ల కలెక్టర్ గా వున జిల్లలో నేను పనిచేయటం వల్ల చాలా మీటింగ్ లలో కలిశాము. ప్రతీ సారీ ఇదే జరుగుతుంది. నా ముఖం మరీ అంత గుర్తుపెట్టుకోనవసరంలేనంతగా వుందా అని డౌట్ వస్తుంది.ఆమె తప్ప నన్ను ఇంతవరకూ ఎవరూ మర్చిపోలేదు, ఆఖరికి ఒక్కసారి చూసినవాళ్ళు కూడా! నా హింస భరించిన వాళ్ళు మరిచిపోయే చాన్సే లేదు.
నెక్స్ట్ పోస్ట్ వ్రాసేవరకు మీరు గుర్తుపెట్టుకుంటారా? మరిచిపోతారా?

Monday, April 26, 2010
నా ఇంటర్యూల పర్వం
మా ఇంట్లో వాళ్ళు, స్నేహితులు నన్ను ట్రైబల్ గా చూడటం మొదలయ్యాక కూడా నాకు నేను చేస్తున్న ఉద్యోగం నచ్చిందే కాని కష్టం అనిపించలేదు. ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి అదేదో నలుగురికి ఉపయోగపడే పనిలోనె మన జీవితం కూడా గడిస్తే మంచిది అనిపించి ఇదే సెక్టర్ లో ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను పని చేస్తున్న సంస్థ పరిస్థితి రాను రాను మరీ దారుణం గా అయిపోయింది. ఫండ్స్ లేక ప్రాజెక్ట్ లు లేక పని లేక వుండేవాళ్ళం. దేనికి డబ్బులు లేక పోయినా, జీతాలు ఇవ్వకపోయినా రోజుకు రెండుసార్లు బిస్కెట్లు, టీ మాత్రం వుండేది. కొన్ని రోజులకి నేను టీ బిస్కెట్ల కోసమే ఆఫీసుకి వెళ్తున్నట్లు అకస్మాత్తుగా ఙ్ఞానోదయం అయ్యింది. ఇక మనం డాడీతో చేసిన శపదం మళ్ళీ గుర్తొచ్చింది. వెంటనే మళ్ళీ ఉద్యోగవేట మొదలు పెట్టాను.
నాకు ముసలి వాళ్ళంటే కొంచెం ఇష్టం. హెల్ప్ ఏజ్ ఇండియాలో ఉద్యోగాలు ప్రకటన పడింది. కానీ ఇంటర్వ్యూ ముందురోజు విపరీతమైన మలేరియా జ్వరంతో ఆసుపత్రి లో చేరాను. వాళ్ళు నా శరీరంలో అన్ని పార్టులకు గొట్టాలు పెట్టేశారు నీరసంగా వున్నానని. కళ్ళు తెరవకుండా వున్నాను 2 రోజులు కానీ ఇంటర్వ్యూ కి మాత్రం హాస్పటల్ అంతా గొడవ చేసి మరీ వెళ్ళాను. హెల్ప్ ఏజ్ ఇండియా వాళ్ళు నా టేలెంట్ చూసి కాదు కాని నా చేతులకు, ముక్కుకు వున్న గొట్టాలు చూసి, నాకున్న తపనకి ఇంప్రెస్స్ అయిపోయి వెంటనే నాకు జాబ్ గ్యారంటీ మీరు వెళ్ళి మళ్ళీ హాస్పటల్ బెడ్ మీద పడుకోండి పోయి అని చెప్పారు.నేను కూడ ఇక నాకు ఉద్యోగం వచ్చేసినట్లే అనుకున్నాను. కానీ విధి విపరీతం అంటే అదే. అప్పటివరకు నేను మా తమ్ముడు వున్న ఇళ్ళు ఖాళీ చేసి నేను మళ్ళీ బుద్ధిగా హాస్టల్లో జాయిన్ అయిపోయాను(దానికి వెనుక వేరే కుట్ర వుంది, మా తమ్ముడే కాదు, మా చెల్లికూడా ఏదో పరీక్షలని తనతో పాటు ఇంకో ఫ్రెండ్, వైజాగులో పని వున్నా లేకపోయినా మా బంధువులు ఇలా అందరు నా ఇంటి మీదా, నా మీద ధండయాత్ర మొదలుపెట్టారు. పని ఎక్కువయ్యింది అందులో మాకు జీతాలు లేవు ఈ బాధలన్నీ వద్దని హాస్టల్ శరణం గచ్చామీ అన్నాను) మా తమ్ముడు వాళ్ళ నలుగురు స్నేహితులతో కలిసి ఇల్లు తీసుకొని వంట మొదలు పెట్టేశాడు (పనమ్మాయిని పెట్టుకున్నారు). అందువలన నాకు జాబ్ ఆఫర్ పంపిస్తే పాత ఇంటి వాళ్ళు పట్టించుకోలేదు. సో ఆవిధంగా నా హెల్ప్ ఏజ్ ఇండియా వుద్యోగం కూడా అందినట్లే అంది చేజారిపోయింది. చాలా రొజులు బాధపడ్డాను. కాని వాళ్ళని కాంటచ్ట్ చెయ్యలేదు.
ఈ లోగా మా వూర్లోనే గిరిజన కార్పోరేషన్ (ఐ.టి.డి.ఎ) లో ఏవో ఉద్యోగాలునాయంటే అప్లయి చేసి వెళ్ళాను. అప్పుడు దమయంతి గారు పార్వతిపురం ఐ.టి.డి.ఎ కి ప్రాజెక్ట్ ఆఫీసర్. మా వూర్లోనే హాయిగా వుద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంటర్యూ కూడా బాగా జరిగింది. కానీ శని నాకు బిళ్ళబంట్రోతు రూపంలో వచ్చాడు. దమయంతి గారికి మంచి నీళ్ళు తెచ్చిన అటెండర్ నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. అంతే కధ అడ్డం తిరిగింది. మా ఊర్లో నాకు ఎవరూ తెలీదు కానీ నేను అందరికి తెలుసు, మా డాడీ వల్ల. కాబట్టి ఎవరు నవ్వినా బహుశా మాకు తెలిసిన వాళ్ళేమో అని తిరిగి నవ్వటం అలవాటయ్యింది. ఐనా కూడా ఇంటర్యూలో వున్నాను కాబట్టి నవ్వకుండా సీరియస్ గా ముఖం పెట్టి మరీ నవ్వాను. అయినా ఆవిడ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కదా కనిపెట్టేశారు. నేనెవరని ఆరా తీశారు. అప్పటివరకు ఆవిడ చూడని నా సర్టిఫికేట్లు చూశారు. డాటర్ ఆఫ్ ఫలానా ఫలానా...ఇంకేముంది కట్ చేస్తే, దమయంతి గారు, మా డాడీ, నేను ఆవిడ రూంలో కూల్ డ్రింక్ తాగుతున్నాము.
ఆమె: ఏంటండి మీ అమ్మాయి ఇలాంటి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముంది?చాలా కష్టం ఆ కొండల్లో ఎండ వాన అని చూడకుండా తిరగాలి.
అతడు(మా డాడీ): నా వైపు కొర కొరా...
ఆమె:ఏమ్మా చక్కగా ఐ.ఎ.ఎస్ రాయి లేదా కంపూటర్స్ చేసుకో నీలాంటి వాళ్ళు చెయ్యలేరు ఈ వుద్యోగం. ఇప్పుడు చూడు మళ్ళీ మంచి క్యాండిడేట్లని చూసుకోవాలి.
నేను: నేను చెయ్యగలనండీ....
మా డాడీ: మళ్ళీ కొర కొరా...
ఛా.. ఇది ఒక ఇంటర్యూనా? నా ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే ఎలా?భందుమిత్ర సపరివారంగా ఆహ్వానించడానికి ఇదేమైన పెళ్ళా? నా క్వాలిఫికేషన్, పద్ధతి చూడాలి కానీ నేను పెరిగిన విధానం ఆధారంగా నన్ను పనికిరావు అనేస్తే చాలా అవమానంగా అనిపించింది. చస్తే మా ఊర్లో వుద్యోగ ప్రయత్నాలు చెయ్యకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను.వీలైతే ఏ ఆఫ్రికాకో అండమానో వెళ్ళిపోయి అయినా సరే ఇదే సెక్టర్లో పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఒక వేళ సెలెక్ట్ అయినా మాకు దగ్గర్లో ఐతే రోజు ఏదో ఒక సమస్య వస్తుంది అనిపించింది. ఇక బయట వేరె ఉద్యోగాలు చూడాల్సిందే.
ఇది నా 4వ ఇంటర్యూ. మొదటి ఇంటర్యూ మరీ దారుణం. ఇంటర్యూ కి వెళ్ళి టి.వి లో పాటలు (బయట టి.వి అరేంజ్ చేశారు పనికిమాలిన కనస్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు) చూస్తూ నా పేరు ఎప్పుడు పిలిచారో కూడా వినిపించుకోలేదు.వాళ్ళు లంచ్ టైము అయ్యి ఆఫీసు మూసేస్తుంటే ఈ లోకంలోకి వచ్చాను. కానీ అది మంచిదే (?) అయ్యింది. ఈ ఎన్.జి.ఒ సెక్టర్లోకి రాగలిగాను.
ఇక ఆతరువాత నా జీవితంలో ఎక్కువగా నేర్చుకున్న, ఎదిగే అవకాశం కల్పించిన, పెద్ద వాళ్ళతో పరిచయం చేసిన గవర్నమెంట్ ప్రోగ్రాము వెలుగు ఇంటర్యూలు నిజంగా కష్టమైనవి.కానీ నాకు ఇష్టమైనవి. అవి తరువాత పోస్టులో రాస్తాను.
సరదాగా మీరు మీ ఫ్లాష్ బ్యాకులో మీ ఇంటర్యూలను ఊహించేసుకోండి ఇక.
Tuesday, April 20, 2010
అందరికీ థాంక్స్ (వీల్లందరూ మానసిక రొగులే)
అందరికీ చాలా థాంక్స్.
వీళ్ళందరు మానసిక రోగులే అనే పోస్టుకి స్పందిస్తూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. కొన్ని కామెంట్స్ పబ్లిష్ చెయ్యాలంటే కూడా అలోచించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అందరూ ఉత్తమోత్తములు మగవాళ్ళంతా నీచాతి నీచులు అని నేను ఎప్పటికీ చెప్పను. మనుషుల్లో రెండురకాలు మంచి చెడ్డలు తెలుసుకోగలిగే పరిణితి వున్న వాళ్ళు, ఆ పరిణితి లేని వాళ్ళు. అందరికీ అన్ని విషయలలో పరిణితి వుంటుంది అని కూడా చెప్పలేము. ఆ పరిణితి లేని విషయాలు నలుగురి కి ఇబ్బంది కలిగించేవి గా వుంటాయి. అందుకని వాటిని చర్చించటం వీలైతే ఆ ఇబ్బందులు తప్పించుకునేలా సలహ ఇవ్వటం కోసమే చర్చ అంతే కాని ఆడా మగా ఎవరు ఎంత చెండాలులు అని కాదు.నా వృత్తిలో స్త్రీలు కూడా దారుణంగా
ప్రవర్తించే వాళ్ళని చూశాను. అవికూడ సమయం వచ్చినప్పుడు రాస్తాను.
కామెంట్స్ కి సమాధానం కూడా ఒక పోస్టు లా ఎందుకు రాస్తున్ననంటే చాలమంది ఎనానిమస్ కామెంట్స్ వచ్చాయి మళ్ళీ వాళ్ళెవరూ నా సమాధానం చూడక పోవచ్చు, కొన్ని కామెంట్స్ ఎలా వున్నాయంటే అలా ట్రైన్లలో అలా ప్రవర్తించటం అసలు తప్పే కాదు అన్నట్లు మరీ బయంకరంగా రాసారు. కొన్ని పబ్లిష్ చెయ్యాలనిపించలేదు. అందుకని ఈ పోస్టు.

Monday, April 19, 2010
వీళ్ళందరూ మానసిక రోగులే
పోయిన వారాం బ్లాగ్ రాయలేక పోయాను, కాస్త బిజీ గా వుండి. ఈ వారం రాయాలనుకున్నాను కాని మూడ్ అంతా చికాకుగా అయిపోయింది. ఈ వారం ఎక్కువగా కేంప్ లు వున్నాయి. మొన్న నేను ట్రైన్లో వస్తుంటే ఇంకొక భయంకరమైన అనుభవం. ఎందుకిలా? చదువుకున్నవాళ్ళు కూడ అంతేనా!!, జనరల్ కంపర్టమెంట్ లో అంతే, ఎ.సి లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా అంతే.
నా లాగ ఎంతో మంది ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు అనేక సమయాలలో. నేను ఉద్యోగ రీత్యా చాల ఎక్కువగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాను. ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది కాని ఇప్పటికీ భయమే.సరిగా ప్రయాణం చెయ్యటం తెలీక కాదూ, వివిద ప్రదేశాలలో ఫార్మాలిటీస్ గురించి కూడా కాదు. మనుషుల వల్ల భయం. చిన్న వుద్యోగం లో వుంటే వున్న సౌకర్యాలు తక్కువగా వుండేవి అంటే బస్ ఖర్చులు, బొజనం ఖర్చులు వరకు వస్తాయి. సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ కి మాత్రమే ఎలిజిబిలిటీ వున్నప్పుడు వచ్చే సమస్యలు చూసి అబ్బ కాస్త ఉద్యోగంలో ఎదిగితే ఇన్ని తిప్పలు వుండవు కదా అనుకునే దాన్ని, కానీ ఇప్పుడు కూడా అంతే. ఎ.సి. లో వెళ్ళినా మన చుట్టు వున్న మనుషులు బి.సి కాలం బుద్ధులతోనే వుంటే మన సమస్యలు అలాగే వుంటాయి.
ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రిసర్వేషన్ అయితే చాలు,లోయర్ బెర్త్ వస్తే చాలు అనుకోవడానికి లేదు. ఒకవేళ చివరిలో సైడు లోయర్ అయ్యిందనుకోండి వచ్చేపోయే వాళ్ళకి ఈజీగ దొరికిపోతాము. బాత్రూంలు దగ్గర నిలబడి భయంకరమైన చేష్టలు చూపిస్తారు. చాల భయం,అసయం వేసింది. సరే ఎవరో కుర్రకుంక, ట్రైన్లో తిరుగుతూ వుండేవాళ్ళు ఇలాగే వుంటారు అనుకున్నాను. కానీ మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళుంటారు. ఇదేమి పోయేకాలమో నాకు అర్ధం కాలేదు. సినిమాలలో ఆడవాళ్ళు అంగప్రదర్శన చేస్తున్నారు అంటారు. మరీ ఇంత దారుణంగా ఆడవాళ్ళు ఒంటరిగా వుంటే చూసి బహిరంగంగా అంగప్రదర్శన చేసే వాళ్ళని ఏమంటారు? బహుశా మానసిక రోగమేమో. ఈ మానసిక రోగం తో వున్నవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళే కావఖ్ఖర్లేదు, ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ,నాన్నలతో ప్రయాణం చేస్తున్నడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడని వాళ్ళ మాటల బట్టి అర్ధం అయింది.మరి తోటి ప్రయాణికులని ఏమి చూసి అంచనా వెయ్యాలో నాకు అర్ధం కావటం లేదు.
బస్ లో ఐతే హింస కొనసాగుతూనే వుంటుంది తెల్లార్లూ. ఈ లక్సరీ, వోల్వో బస్ లు వచ్చాక మనం ఒంటరిగా ప్రయాణం చేసినా, తోడుగా ఎవరైనా వున్నాకూడా ఈ హింస రాయుళ్ళకి ఫర్వాలేదు. వాళ్ళకి బస్ సీటింగ్ చాల సౌకర్యంగా వుంటుంది.నిద్రనటిస్తూనే చేతులు వెయ్యటం, గిచ్చటం చేస్తుంటారు. లేచి గట్టిగా అడిగితే కూడా నిద్ర నటిస్తూనే వుంటారు.
టీనేజి అబ్బాయిలు, ఒక వయసులో వున్నవాళ్ళు, ముసలి వాళ్ళు, పల్లెటూరివాళ్ళు, సిటీ వాళ్ళు, బాగ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఎంతో గొప్పగా కనిపించేవాళ్ళు, రౌడీలా కనిపించే వాళ్ళు....అందర్లో ఇలాంటి వాళ్ళుంటారు.ట్రైన్లో ఏ.సి లో ప్రయాణం చేస్తే ఇంకా దారుణం అక్కడ ఒకరికి ఒకరు కనిపించకుండా కర్టెన్లు వేసేసుకుని మన గోడు పట్టించుకోరు. కొన్ని రూట్లలో ట్రైన్ మొత్తానికి ఇద్దరు లేక ముగ్గురు వుంటారు ఏ.సి కంపార్ట్మెంట్లో.ఇక నిద్రపోతే ఒట్టు. అలా కాకపోయినా సరే ఎదురవుతున్న అనుభవాలకి ప్రయాణంలో నిద్రపోతే భయం, నిద్రపోకపోతే కూడా భయం. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల ఆడవాల్లు వుద్యోగాలలో పురుషులతో సమానంగా పని చెయ్యాలంటే ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ కూడా పురుషులతో సమానంగా ఎదిగి చూపిస్తున్న ఎందరో స్త్రీలకు హేట్స్ ఆఫ్ చేస్తున్నా. మీరు ఈ సమస్యలకు భయపడి ఓడిపోయామని వెనకడుగు వేస్తే తరువాతి తరాలలో ఏ ఆడవాళ్ళు కూడా ఇక బయటకే రాలేరు.
భయపడటం కాదు కాని ప్రతీ సమస్యని ఎదుర్కోవటానికి కొన్ని మార్గాలుంటాయి. మీరు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే, లేదా మీ ఇంట్లోని ఆడవారు ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముందు అసలు దేనికీ కూడా భయపడకుండా మనసునిండా ధైర్యంతో వుండాలి. బ్యాగులో కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పక వుండాలి.సెల్ ఫోనులో ముఖ్యమైన నంబర్లకు కీ పాడ్ లో షార్ట్ కట్ ఇవ్వండి( అంటే ఒకటి నొక్కితే - నాన్న నంబర్ అలా). అసలు అన్నిటికంటే ముందు ఎవరైన ఇలా ఇబ్బంది పెడుతుంటే భయపడకుండా అందరికి తెలిసేలా గట్టిగా చెప్పాలి. మనం భయపడటంలేదు అని తెలిస్తే 90% ఇలాంటి వాళ్ళు భయపడతారు.అంతే కాదు ఇక ముందు ఎవరితో ఐనా అలా ప్రవర్తించాలంటే కూడా కాస్తా భయపడతారు.వీలైనంత వరకు ఆడవాళ్ళుండే చోటుచూసుకోవటం మంచిది కానీ మనకి అంత అదృస్టం అన్నిసార్లు దొరకదు. నా స్నేహితురాలు ఒకామే తన సెల్ ఫోన్ కి బయంకరమైన కీ పాడ్ టోన్ పెట్టుకుంది అదికూడా చాలపెద్ద సౌండ్ వచ్చేలా. ఇలా తను ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసేప్పుడు ఎవరో తన బెర్త్ దగ్గరకు రాబోతే వెంటనే మొబైల్ కీ ప్రెస్ చేసి అందరిని అలెర్ట్ చేసిందంట.ఇలా ఒకొక్కరు ఒక్కో పద్ధతి పాటిస్తునారు. ఆత్మ రక్షణ అంటే భయం లేని ఆత్మధైర్యమే అని అర్ధం చేసుకోవాలి. భయపడితే బుర్రపనిచెయ్యదు. సో ఫ్రెండ్స్ ధైర్యంగా వుండండి.
Friday, April 2, 2010
నా వెన్నెల రాత్రులు
ఇప్పుడే వెన్నెల చూసి వచ్చి కూర్చున్నాను. లక్కీ నిద్రపొతున్నాడు. బయట ఒక చందమామ, నాపక్కన ఒక చందమామ....లక్కీ, నా కొడుకు (తిట్టుకాదు నాకున్న ఒకేఒక బాబు) సరే వెన్నెల రాత్రులు అని మొదలుపెట్టి కొడుకు గురించి చెప్తుందేమిటీ టైము వేస్ట్ సోది కాకపోతే అనుకుంటున్నారా?వస్తున్నా వస్తున్నా అసలు విషయానికే వస్తున్నా.
గిరిజనుల గురించి నా అనుభవాలతో ఈ వీక్ ఎండ్ కి పోస్ట్ రాయాలని మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు ఆ మూడ్ రావటంలేదు.నాకు ఎప్పుడు ఏది రాయలనిపిస్తుందో అది మాత్రమే రాయగలను, రాస్తాను. ఒకసారి లెక్కల పరీక్ష రోజు, పరీక్ష హాల్లో కవిత్వం తన్నుకుంటా వచ్చేసింది. అది రాస్తే కాని నా మనసు ఇక దేని మీదకి పోదు అందుకే మొదట కవిత్వం రాసేసా, ఆ తరువాత తీరికగా లెఖ్ఖలు చేసాను.అప్పుడు నా పేపర్ దిద్దిన వాళ్ళు బలయ్యారు,ఇప్పుడు ఈ బ్లాగ్ చదివే వాళ్ళు.(కవిత్వం రాయనులెండి, భయపడొద్దు)
ఇప్పుడు నా వెన్నెల రాత్రుల అనుభవాల గురించి రాయాలని వుంది. టైటిల్ చూసి మీరెదో ఊహించేసుకుంటున్నరు కదా! నేను స్వాతి వీక్లీ లో సరసమైన కధ లాంటిది రాస్తాననుకొనేరు, ఇది అది కాదు. కానీ ఇది అంతకంటే కూడా చాలా ఇదైనది.(ఆ ఇది ఏంటో తెలియాలంటే పూర్తిగా చదవండి)
నేను చాలా అందమైన వెన్నెల రాత్రులు చూశాను. బహుశా మీకనిపించవచ్చు వెన్నెల ఎక్కడైనా వెన్నెలే కదా ఏంటి పేద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. కాని ఆ తేడా నాకే తెలుసు. టౌన్ లో ఇళ్ళమద్య వెన్నెలకీ, నేను చూసిన వెన్నెలకీ చాల తేడా వుంది.అలాంటి వెన్నెల రాత్రి అనుభాలలో ఇది ఒకటి.ఈరోజు గుర్తొచ్చింది ఎందుకో!
ఎప్పుడూ మా ఇంటి డాభా మీద నుండి మాత్రమే వెన్నెల చూశాను. ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో వున్నప్పుడు సముద్రం దగ్గర వెన్నెల చూసాను. ఎలా చూసినా వెన్నెల నన్ను కాళ్ళు చేతులు కట్టేసి కనీసం ఒక గంట అయిన నన్ను మంత్రముగ్ధను చెసేసేది. అలాంటిది ఒకసారి ఏమయిందో తెలుశా. ఒక గిరిజన గ్రామం..అరకు దగ్గర, నైట్ స్టే గూడెంలోనే. అక్కడ దోమలకి, కొత్తపరిసరాలకి ఇంకా అలవాటు పడలేదు కాబట్టి కాస్త రాత్రి అంటే భయంతో వున్నాను. వెన్నెల,గిన్నెల చూసే మూడ్ లేదు. కాని నేను వున్న ఇంటి గిరిజన స్త్రీ నన్ను బయటకి రా అని ఎక్కడకో వెల్దామని చెప్తుంది. నాకు వాళ్ళకి ఎప్పుడూ మూగ బాషే. బహుశా అతిది మర్యాదలో భాగంగా నన్ను టాయిలెట్ కి తీసుకెల్లాలని ఆశపడుతుందేమో, నాకు అవసరం లేదు అని చెప్పాను. సాధారణంగా పల్లెల్లో కూడా స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకునేది రాత్రిపూట లేదా చీకటి వేకువన. ఆమె నా మాట వినలేదు రమ్మంటుంది. సరే అని వెళ్ళాను. సాధారణంగా రాత్రి అంతా తాగి వుంటారు అని వెళ్ళను. కాని బయట చూస్తే పండగలా వుంది. "పున్నమి వెన్నెల" గూడెం అందరు పిల్ల పెద్ద అందరూ బయటే వున్నారు. నవ్వుతున్నారు, సంతోషం కూడా నాలాగ ఆరోజు అక్కడ నైట్ స్టే అనుకుం!!! (ఆ ఆలొచన రాగానే అయ్యబాబోయ్ కవిత్వం వచ్చేస్తుందేంటి అనుకున్నా) . వెన్నెల ఎంతగా ప్రకాశిస్తుందంటే...నిజంగా పిండి ఆరబోయటం అంటే అదే అనుకుంటా. కాని ఇది బియ్యం పిండి, మినప్పిండి కాదు, వెన్నెల పిండి. అవును వెన్నెల పిండి ఆరోజే చూశాను. అది ప్రకాశిస్తుంది, ఆ చుట్టుపక్కలంతా ఆ కాంతితో ప్రతి చెట్టు, ప్రతి గుడిసె, ప్రతి మనిషి, ప్రతీది ఆఖరికి ఆకాశం, నేల తో పాటు నేను కూడా ప్రకాశిస్తున్నాను. ఇంతలో ఆడవాళ్ళంతా ఏంటో కొలాహలం, అరుపులు , నవ్వులు. ఎదో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ లేస్తున్నారు. నా పక్కనే కూర్చున్న ఆడవాళ్ళుకూడా జండావందనం రోజు చాక్లెట్స్ కోసం పరిగెడుతున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా కేరింతలు నవ్వులతో పరిగెత్తారు. ఎదో జరుగుతుంది అనితెలుస్తుంది కాని, జరిగింది చూశాక ఇలాకూడా జరుగుతుందా అనిపించింది. ఆడవాళ్ళంతా కలిసి ఒకరి నడుము ఒకరు పట్టుకొని ధింసా ఆడటం మొదలు పెట్టారు. నేను అదే మొదటసారి ధింసా నృత్యం చూడటం. నవ్వుతూ తుళ్ళుతూ ఎవరు మొదలుపెట్టారో తెలీదు కాని ఒకరికి ఒకరు చేతులు కలుపుకుంటూ ఒకరి నడుం మీదుగా ఆపక్కవున్న వారి చెయ్యి పట్టుకొని అందరు కాళ్ళు పాదాలు ఒకేవిధమైన స్టెప్స్ వేస్తు అందరు కలిసి జట్టుగా ఒకేవైపు కదులుతున్నరు. ఆ లైను మొదటవున్న వ్యక్తి ఒక చిన్న రంగు బట్ట చేత్తో పట్టుకొని వూపుతూ లైన్ ని పాము మెలికలు తిరిగినట్లు తిప్పుతూ కదులుతుంది. నాకు చిన్నప్పటినుండి డాన్స్ అంటే ప్రాణం. అలాంటిది ఈ వెన్నెల్లో అన్ని మరిచి ఆనందంగా ఒక మధురమైన పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్న వాళ్ళని చూస్తే అసలు ఇదే కదా జీవితం అంటే అనిపించింది. మన ఊర్లో ఆడవాళ్ళు కనీసం ఇంట్లో డాన్స్ చెయ్యగలరా? కనీసం మనసు సంతోషంతో మత్తెక్కిపోతే ఆనందంగా ఆడగలరా? పాడగలరా? అసలు మనకి చిన్నప్పుడే ఆట,పాటలన్నీ ఆపేస్తారెందుకు. వీళ్ళల్లో ఇంత వుత్సాహం, అది వ్యక్తపరచడానికి మార్గం కూడా వున్నాయి. మరి మనకేమున్నాయి? మనసు సంతోషంతో వున్నప్పుడు డాన్స్ చెయ్యాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలీదు కానీ నాకు ఆనందం కలిగితే డాన్స్ చెయ్యలనే అనిపిస్తుంది. అది ఇక్కడ నా కళ్ళ ఎదురుగా జరుగుతుంది!!! ఇది కలా నిజమేనా!!!
నన్ను కూడా ఎవరో లాగారు, నేను కూడా ధింసా చేశా...నిజం. అప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏదో స్కూల్ ప్రోగ్రాములోనో, పోటీలలోనో ఏదో చిన్నపాటి పిల్ల డాన్స్లు చేసాను. మా ఇంట్లో వాళ్ళందరికి కొంచెం డాన్స్ ఇష్టం వుండటం వల్ల మాకు అప్పుడప్పుడు కొంత డాన్స్ నేర్పించారు. అదంతా ఏదో సహజంగా ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఆరోజు...వెన్నెల్లో, ఆరుబయట, చల్లనిగాలిలో, నాతోటి ఆడవాళ్ళందరితో,ఏరకమైన భయం జంకు లేకుండా నవ్వుతూ అరుస్తూ చేసిన ఆ ధింసా నాకు అప్పటివరకు వున్న సంకొచాలు, బాధలు, కలతలు, నొప్పులు అన్నీ నాకు దూరమైపోయి ఏదో తెలియని సంతోషం ఆవహించింది.అప్పుడే నేను కరెక్టైన ప్రదేశానికి వచ్చానని ఇప్పటివరకు జీవితంలో ఏదో దారి తెలియని క్రొత్త ప్రదేశంలో వున్నాననీ అనిపించింది.
అప్పుడే కాదు ఎప్పుడు అవకాశం వచ్చినా నేను ధింసా ఆడుతునేవున్నా. మీరుకూడా ఎప్పుడైన మీతో పాటు నలుగురిని చేతులు కలిపి ఆడండి అందులో ఆనందం నేను చెప్తే మీకు అర్ధం కాదు మీరు అనుభవించాలి. మైమరచి ఆడటం, పాడటం, కవితలు చెప్పటం, డాన్స్ చెయ్యటం ఇవన్నీ ఒకరకమైన యోగా వంటివి. మన బాధలు అన్ని మరిపిస్తాయి. ఇది నా అనుభవం.
చాలా సమయం ధింసా చేశాక నేను అలసిపోయి కూర్చున్నాను, వాళ్ళకి అలసట అంత త్వరగా రాదేమో ఆడుతునే వున్నారు. నేను కూర్చుని చూస్తున్నా. ఎంత బాగుంది ఆ వెన్నెల రాత్రి, విపరీతమైన ప్రకాశం తో వెన్నెల, అదుపులేని ఆడవాళ్ళు, అంతులేని ఆనదం, అలుపులేని ధింసా.......ఇంత అద్భుతం నేను మళ్ళీ ఇంకెక్కడైనా చూడగలనా? ఒక్కసారి మా ఇళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ గుర్తొచ్చారు. మేమంతా ఎప్పుడైన ఇంత సంతోషంగా నృత్యం చేయగలమా? వెన్నెల్లో ఆడగలమా? అందులో వూరిమద్యలో? గట్టిగా నవ్వితే, మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని అనే భయాలతో బతికే నాకు ఇది నిజంగా స్వర్గం అనిపించింది. చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కాని వీళ్ళు రోజు స్వర్గంలో వుంటున్నారే. ఇంత సహజత్వం, ఇంత ప్రకృతి, ఇంత అందం, ఇంత స్వేచ్చ........నాకు అంత అందం, అంత వెన్నెల ఎలా భరించాలో తెలియటం లేదు, చచ్చిపోవాలనిపించింది.ఈ వెన్నెల రాత్రి ఎంత బాగుంది? ప్రకృతికి ఎక్కడనుండి వచ్చింది ఇంత శక్తి? నన్ను ఈ చందమమ ఇలా లొంగదీస్తుందేమిటి? ఆ వెలుగు, ప్రకాశం, సంతోషం ఎంత బాగుందంటే అప్పుడే అక్కడే చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనిపించేంత బాగుంది. ఇంత ఆనందంలో చావాలని ఎందుకనిపిస్తుంది అని ఆలోచించా...ఆశ్చర్యం నాకు నిజంగా చచ్చిపోవాలనే అనిపించింది.(ఎవరైనా ప్రియ నేస్తం తోడుగా వుంటే ఆ వెన్నెల్లో చేతులు పట్టుకొని అడవిలో నడుస్తే బాగుండేది అనికూడా అనిపించింది అనుకోండి) ఇలాంటి అద్భుతమైన వెన్నెల రాత్రులు చూసినపుడు నాకేకాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుందేమో!!!! చాలా సేపు ధింసా ఆడిన తరువాత వెళ్ళారు అందరు. కానీ చాలామంది అక్కడే వెన్నెల్లో నిద్రపోయారు. నాకు కూడా బయటనే మంచం వేశారు నేను వున్న ఇంటివాళ్ళు. ఆ భరించలేని వెన్నెల చూస్తూ నిద్ర కోసం ప్రయత్నించాను. ఏదో తెలియని బాధ కలుగుతోంది అప్పుడు..ఎందుకీ బాధ? నాకే అర్ధం కాలేదు. మనిషి మనసు విచిత్రమా లేక ప్రకృతి చేస్తున్న మాయా? ఇంతలోనే అంత సంతోషం, అంతలోనే ఇంత తెలియని విషాదమా???ఆ బాధతో నిండిన సంతోషాన్ని, సంతోషంతో కూడిన బాధని కూడా నా అలసట జయించింది. హాయిగా వెన్నెల నన్ను జోకొట్టింది. కలలుకూడా కలతపెట్టలేని నిద్ర వచ్చింది.
ఇంత సంతోషం గా గూడేం నాట్యం చేసిందే ఇంతకీ ఆ రోజు ఏమి పండగ? వెన్నెల పండగ నా?