Monday, April 19, 2010

వీళ్ళందరూ మానసిక రోగులే

పోయిన వారాం బ్లాగ్ రాయలేక పోయాను, కాస్త బిజీ గా వుండి. ఈ వారం రాయాలనుకున్నాను కాని మూడ్ అంతా చికాకుగా అయిపోయింది. ఈ వారం ఎక్కువగా కేంప్ లు వున్నాయి. మొన్న నేను ట్రైన్లో వస్తుంటే ఇంకొక భయంకరమైన అనుభవం. ఎందుకిలా? చదువుకున్నవాళ్ళు కూడ అంతేనా!!, జనరల్ కంపర్టమెంట్ లో అంతే, ఎ.సి లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా అంతే. 

నా లాగ ఎంతో మంది ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు అనేక సమయాలలో. నేను ఉద్యోగ రీత్యా చాల ఎక్కువగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాను. ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది కాని ఇప్పటికీ భయమే.సరిగా ప్రయాణం చెయ్యటం తెలీక కాదూ, వివిద ప్రదేశాలలో ఫార్మాలిటీస్ గురించి కూడా కాదు. మనుషుల వల్ల భయం. చిన్న వుద్యోగం లో వుంటే వున్న సౌకర్యాలు తక్కువగా వుండేవి అంటే బస్ ఖర్చులు, బొజనం ఖర్చులు వరకు వస్తాయి. సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్ కి మాత్రమే ఎలిజిబిలిటీ వున్నప్పుడు వచ్చే సమస్యలు చూసి అబ్బ కాస్త ఉద్యోగంలో ఎదిగితే ఇన్ని తిప్పలు వుండవు కదా అనుకునే దాన్ని, కానీ ఇప్పుడు కూడా అంతే. ఎ.సి. లో వెళ్ళినా మన చుట్టు వున్న మనుషులు బి.సి కాలం బుద్ధులతోనే వుంటే మన సమస్యలు అలాగే వుంటాయి. 

ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రిసర్వేషన్  అయితే చాలు,లోయర్ బెర్త్ వస్తే చాలు అనుకోవడానికి లేదు. ఒకవేళ చివరిలో సైడు లోయర్ అయ్యిందనుకోండి వచ్చేపోయే వాళ్ళకి ఈజీగ దొరికిపోతాము. బాత్రూంలు దగ్గర నిలబడి భయంకరమైన చేష్టలు చూపిస్తారు. చాల భయం,అసయం వేసింది. సరే ఎవరో కుర్రకుంక, ట్రైన్లో తిరుగుతూ వుండేవాళ్ళు ఇలాగే వుంటారు అనుకున్నాను. కానీ మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళుంటారు. ఇదేమి పోయేకాలమో నాకు అర్ధం కాలేదు. సినిమాలలో ఆడవాళ్ళు అంగప్రదర్శన చేస్తున్నారు అంటారు. మరీ ఇంత దారుణంగా ఆడవాళ్ళు ఒంటరిగా వుంటే చూసి బహిరంగంగా అంగప్రదర్శన చేసే వాళ్ళని ఏమంటారు? బహుశా మానసిక రోగమేమో. ఈ మానసిక రోగం తో వున్నవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళే కావఖ్ఖర్లేదు, ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ,నాన్నలతో ప్రయాణం చేస్తున్నడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడని వాళ్ళ మాటల బట్టి అర్ధం అయింది.మరి తోటి ప్రయాణికులని ఏమి చూసి అంచనా వెయ్యాలో నాకు అర్ధం కావటం లేదు. 

బస్ లో ఐతే హింస కొనసాగుతూనే వుంటుంది తెల్లార్లూ. ఈ లక్సరీ, వోల్వో బస్ లు వచ్చాక మనం ఒంటరిగా ప్రయాణం చేసినా, తోడుగా ఎవరైనా వున్నాకూడా ఈ హింస రాయుళ్ళకి ఫర్వాలేదు. వాళ్ళకి బస్ సీటింగ్ చాల సౌకర్యంగా వుంటుంది.నిద్రనటిస్తూనే చేతులు వెయ్యటం, గిచ్చటం చేస్తుంటారు. లేచి గట్టిగా అడిగితే కూడా నిద్ర నటిస్తూనే వుంటారు.

టీనేజి అబ్బాయిలు, ఒక వయసులో వున్నవాళ్ళు, ముసలి వాళ్ళు, పల్లెటూరివాళ్ళు, సిటీ వాళ్ళు, బాగ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఎంతో గొప్పగా కనిపించేవాళ్ళు, రౌడీలా కనిపించే వాళ్ళు....అందర్లో ఇలాంటి వాళ్ళుంటారు.ట్రైన్లో ఏ.సి లో ప్రయాణం చేస్తే ఇంకా దారుణం అక్కడ ఒకరికి ఒకరు కనిపించకుండా కర్టెన్లు వేసేసుకుని మన గోడు పట్టించుకోరు. కొన్ని రూట్లలో ట్రైన్ మొత్తానికి ఇద్దరు లేక ముగ్గురు వుంటారు ఏ.సి కంపార్ట్మెంట్లో.ఇక నిద్రపోతే ఒట్టు. అలా కాకపోయినా సరే ఎదురవుతున్న అనుభవాలకి ప్రయాణంలో నిద్రపోతే భయం, నిద్రపోకపోతే కూడా భయం. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల ఆడవాల్లు వుద్యోగాలలో పురుషులతో సమానంగా పని చెయ్యాలంటే ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ కూడా పురుషులతో సమానంగా ఎదిగి చూపిస్తున్న ఎందరో స్త్రీలకు హేట్స్ ఆఫ్ చేస్తున్నా. మీరు ఈ సమస్యలకు భయపడి ఓడిపోయామని వెనకడుగు వేస్తే తరువాతి తరాలలో ఏ ఆడవాళ్ళు కూడా ఇక బయటకే రాలేరు. 

భయపడటం కాదు కాని ప్రతీ సమస్యని ఎదుర్కోవటానికి కొన్ని మార్గాలుంటాయి. మీరు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే, లేదా మీ ఇంట్లోని ఆడవారు ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముందు అసలు దేనికీ కూడా భయపడకుండా మనసునిండా ధైర్యంతో వుండాలి. బ్యాగులో కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పక వుండాలి.సెల్ ఫోనులో ముఖ్యమైన నంబర్లకు కీ పాడ్ లో షార్ట్ కట్ ఇవ్వండి( అంటే ఒకటి నొక్కితే - నాన్న నంబర్ అలా). అసలు అన్నిటికంటే ముందు ఎవరైన ఇలా ఇబ్బంది పెడుతుంటే భయపడకుండా అందరికి తెలిసేలా గట్టిగా చెప్పాలి. మనం భయపడటంలేదు అని తెలిస్తే 90% ఇలాంటి వాళ్ళు భయపడతారు.అంతే కాదు ఇక ముందు ఎవరితో ఐనా అలా ప్రవర్తించాలంటే కూడా కాస్తా భయపడతారు.వీలైనంత వరకు ఆడవాళ్ళుండే చోటుచూసుకోవటం మంచిది కానీ మనకి అంత అదృస్టం అన్నిసార్లు దొరకదు. నా స్నేహితురాలు ఒకామే తన సెల్ ఫోన్ కి బయంకరమైన కీ పాడ్ టోన్ పెట్టుకుంది అదికూడా చాలపెద్ద సౌండ్  వచ్చేలా. ఇలా తను ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసేప్పుడు ఎవరో తన బెర్త్ దగ్గరకు రాబోతే వెంటనే మొబైల్ కీ ప్రెస్ చేసి అందరిని అలెర్ట్ చేసిందంట.ఇలా ఒకొక్కరు ఒక్కో పద్ధతి  పాటిస్తునారు. ఆత్మ రక్షణ అంటే భయం లేని ఆత్మధైర్యమే అని అర్ధం చేసుకోవాలి. భయపడితే బుర్రపనిచెయ్యదు. సో ఫ్రెండ్స్ ధైర్యంగా వుండండి.
  

11 comments:

Kathi Mahesh Kumar said...

హ్మ్మ్

Anonymous said...

శిరీష గారు చాలా బాగా రాసారు. ఈ మధ్య ఇంకొక సమస్య ఏమిటంటే హిడెన్ కెమెరాస్ వెంటాడుతున్నాయి. వాటి గూర్చి కూడా చాలా జాగ్రత్తగా వుండాలి

Anonymous said...

Sirisha gaaru,

meeru chaala baaga raastaru.. ee tapa lo mee avedana nenu ardam chesukogalanu. nenu kooda naa kurratanam lo ammailani gucchi gucchi choosi ibbandi pettevadini..kaani ala choodatam valla vallu yenta ibbandi padataro naaku vunna oka girl friend chepte telusukoni malli ala yeppudu ibbandi pettaledu.. So naaku anipinchedi kurralaki ila naaku icchinattu awareness iste atleast oka 20% problem solve avutundemo..

durgeswara said...

కలిలో మనుషులను కామపిశాచం ఆవహించేస్తూ ఉచ్చనీచాలను తెలుసుకోనివ్వటం లేదు.

శ్రీనివాస్ said...

ఈ సమస్యలకి పరిష్కారం బ్యాగుల్ల్లో కత్తి పెట్టుకుని తిరగడమే

Anonymous said...

ayyaa,
aaDaaLLandaroo oka rakam kaadu. ippaTi taram aadavaallalo magaaLLu tamani "Attention" to choodaalanukonE aadavaalle ekkuva. "veella kattoo bottoo(unte) "male attention" kosame. alaanti vaalla ki vaallaki kaavalasinadi ivvatam lo tappu ledu.
"attention" ichchina magaadu daanito aagipogaladu anukovatam sari kaadu, andulonoo sex aakali teeraka allaadipotunna mana desam lo.
mana skoollalo, kaalejeelalo, samaajam lo, konchem aada magala madhya interaction perigite magaallu koodaa baadhyataayutam gaa pravartistaaru

Anonymous said...

ఆశ్చర్యమేమంటే , బూతు బొమ్మలు నిర్లజ్జగా బ్లాగుల్లో వేసుకుని చొంగకార్చుకుంటూ చూసుకున్నా , దాన్ని కలాపోస అనుకునే శునకానందశ్వాములు కూడా పైన ప్రతిస్పందించడం! హ్మ్మ్

Anonymous said...

magaaLLLa ee chonga kaarchuDu pravartana ki sinimaaloo, meeDiyaa kooDaa baadhyale

Jagadeesh Reddy said...

శిరీష గారు... మీరు చెప్పిన అంశాన్ని సైకాలజీలో Exhibitionism అంటారు. అంటే అంగాంగ ప్రదర్శన చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు చాలామంది. ఇది మగవాళ్ళలో ఎక్కువగా గమనించవచ్చు. ఇదే కాకుండా తాయ్లెట్లలో కూడా బూతు రాతలు రాయడం, ఆడపిల్లల నంబర్లు, వారి బొమ్మలు వేసి పేర్లు రాయడం ద్వారా పైశచికానందాన్ని పొందుతారు. ఎదుతి మనిషి పట్ల గౌర్వభావం లేకపోవడం, సంస్కారం లోపించడం వల్ల ఇలా చేస్తారు. మా కాలేజ్‌లో ఆడపిల్లలకి ఇటువంటి అంశాల మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము. మీ వంటి వారు సలహాలు అందించగరు. మీవంటివారి అనుభవాలు మా స్టూడెంట్స్ కీ బాగా వుపయోగపడతాయి.

Anonymous said...

Sirisha garu,

Meeru chepindi chala correct ilanti vallu andaru manasika rogule. Adavallu ante vella drusti lo manushulu karaa.

ఆ.సౌమ్య said...

ఇలాంటివి నేను చాలా చూసాను. ఒక 3-4 సార్లు కొట్టను కూడా, అయినా జనాలకి సిగ్గురాదు. ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు ఇలాగే ఒకతను ప్రవర్తించబోతే, కాలరు పట్టుకుని ఆపి గట్టిగా అరిచాను. అందరు నిద్రలేచి వాడిని చితకదన్నారు. నేనే ఇద్దరుముగ్గురికి లెంపకాయలిచ్చాను. ఒకడినయితే చేతిలో ఉన్న బేగ్ తో తలమీద మొత్తేసాను.ముఖ్యంగా ట్రైన్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వెధవన్నర వెధవలండీ.....మీరన్నట్టు ఏ వర్గం వారూ ఈ విషయంలో తీసిపోరు.