Tuesday, April 20, 2010

అందరికీ థాంక్స్ (వీల్లందరూ మానసిక రొగులే)

అందరికీ చాలా థాంక్స్.


వీళ్ళందరు మానసిక రోగులే అనే పోస్టుకి స్పందిస్తూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. కొన్ని కామెంట్స్ పబ్లిష్ చెయ్యాలంటే కూడా అలోచించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అందరూ ఉత్తమోత్తములు మగవాళ్ళంతా నీచాతి నీచులు అని నేను ఎప్పటికీ చెప్పను. మనుషుల్లో రెండురకాలు మంచి చెడ్డలు తెలుసుకోగలిగే పరిణితి వున్న వాళ్ళు, ఆ పరిణితి లేని వాళ్ళు. అందరికీ అన్ని విషయలలో పరిణితి వుంటుంది అని కూడా చెప్పలేము. ఆ పరిణితి లేని విషయాలు నలుగురి కి ఇబ్బంది కలిగించేవి గా వుంటాయి. అందుకని వాటిని చర్చించటం వీలైతే ఆ ఇబ్బందులు తప్పించుకునేలా సలహ ఇవ్వటం కోసమే చర్చ అంతే కాని ఆడా మగా ఎవరు ఎంత చెండాలులు అని కాదు.నా వృత్తిలో స్త్రీలు కూడా దారుణంగా 
ప్రవర్తించే వాళ్ళని చూశాను. అవికూడ సమయం వచ్చినప్పుడు రాస్తాను. 


కామెంట్స్ కి సమాధానం కూడా ఒక పోస్టు లా ఎందుకు రాస్తున్ననంటే  చాలమంది ఎనానిమస్ కామెంట్స్ వచ్చాయి మళ్ళీ వాళ్ళెవరూ నా సమాధానం చూడక పోవచ్చు, కొన్ని కామెంట్స్ ఎలా వున్నాయంటే అలా ట్రైన్లలో అలా ప్రవర్తించటం అసలు తప్పే కాదు అన్నట్లు మరీ బయంకరంగా రాసారు. కొన్ని పబ్లిష్ చెయ్యాలనిపించలేదు. అందుకని ఈ పోస్టు.

2 comments:

Anonymous said...

సమస్య పరిణతి చెందడమో చెందకపోవడమో కాదండి.స్త్రీవాదం కొంత ఆమోదం పొందిన తరువాత మగవారు అనగానే స్త్రీ వినాషకులు అన్న లెవల్లో మగవారిపై దుష్ప్రచారం జరిగింది. మగవారిని వర్గ శత్రువులు అన్న "ఎర్ర" నారీమణులు కూడా వున్నారు. చేస్తే తిట్టు, చెయ్యకపోయినా తిట్టు అన్నట్లు రాసిన వాల్లువున్నారు. స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ కాదరు కానీ, దాన్ని ప్రశ్నించే టపుడు కొంతమంది స్త్రీవాదులు ఉపయోగించిన పదజాలం కానీ, వారు ఇచ్చిన తిర్పులు కానీ, స్త్రీవాదమంటే "పురుష వ్యతిరేక వాదం" అనీ స్త్రీవాదులు అంతే పురుష ద్వేషులు అన్న భావనను కలిగించేలా వుండేవి. పేపర్లో మగవాల్లను "మగపురుగులు" అని సంబోదించి రాసిన వాల్లున్నారు. ఇంత ద్వేషాన్ని (రాసే వాల్ల దృష్టిలో సమస్యలను విషద పరచడం) భరిచే ఓపిక సహజంగానే మగవారిలో లెకపోయింది. అప్పుడు మొదలయ్యిందీ ఈ తిరుగుబాటు.

మీరే అలోచించడి, ఇప్పుడు కొంతమంది అలా అంగాంగ ప్రదర్శన తప్పుకాదు అన్నట్లు రాసారు అన్నారే వారు కూడా, అదే అనుభవం తమ వారికి ఎదురైతే గొడవలకు సైతం దిగడానికి వెనుకాడరు మరి వారు మానసిక రోగులు ఎలా అవుతారు? అంతే కాదు ఆసమయములో ఏవరైనా అమ్మాయి తిరగబడి అలా ప్రవర్తిచిన వాడిని చెడా మడా తిడితే, ఆమెకు వత్తాసు వచ్చేవారిలో మీరన్న ఆ మానసిక రోగులు కూడా ఖచ్చితంగా వుంటారు. కాబట్టి, ఆ వ్యాఖ్యలు చేసిన వారు దాన్ని సమర్దిస్తున్నారు అని అనుకోకుండా, నువ్వు తప్పుచేస్తున్నావ్ అని ఎదుటి వారు వేలెత్తి చూపినప్పుడు కలిగే బాదగా మాత్రమే దాన్ని పరిగణించ మనవి.

Unknown said...

శిరీష గారూ...,అందరికీ చాలా థాంక్స్.వీళ్ళందరు మానసిక రోగులే అనే పోస్టుకి స్పందిస్తూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. కొన్ని కామెంట్స్ పబ్లిష్ చెయ్యాలంటే కూడా అలోచించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు అందరూ ఉత్తమోత్తములు మగవాళ్ళంత_____________________మంచి టపా అందించారు.