Wednesday, August 18, 2010

మార్పు కావాలనిపించటంలేదా మీకు?

హాయ్ ఆల్, ఈరోజు నాకు సంతోషించాలో బాధపడాలో తెలియటం లేదు. మా చెల్లి అమెరికాలో వుంటుంది తను కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కుంటూ చాలా కష్టమైన పరిస్థితి లో ఇండియా వస్తుంది. ఆ గొడవలతోనే రోజు మొదలయ్యింది.ఇంకా అవే ఫోన్లతో రోజు గడుస్తుంది. అసలు అమెరికా అని ఆస్త్రేలియా అని అంత దూరం ఎందుకు ఇస్తారో ఆడపిల్లల్ని, తల్లి దండ్రులు తోబుట్టువులకి అందరికీ దూరంగా , ఏ కష్టమొచ్చినా పరిగెత్తుకు రావడానికి ఎవరికీ వీలు కాదు. కష్టాలే కాదు సంతోషం అయినా సరే. ఈ గొడవల్లో నా మనసెంత విరిగిపోయిందంటే, ఎంత భయం వేస్తుంది అంటే అసలెందుకు పెళ్ళిళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు, అమ్మ నాన్న తో హాయిగా వుండిపోవచ్చుకదా అనిపిస్తుంది. నాకు ఈ సందేహం ఎప్పటి నుండో వుంది. ప్రస్తుతం వున్న వివాహ వ్యవస్థ ఎప్పుడో మనువు రాసిన రూల్స్ మీద నడుస్తుంది. అప్పటి సామాజిక పరిస్థితి, స్త్రీ పురుషుల మద్య డిఫరెన్సెస్, జీవన విధానం,ఆర్ధిక కార్యకలాపాలు, సామాజిక కార్యకలాపాలు అన్నీ ప్రతీది చాలా వేరుగా వుండేది. అప్పటి కుటుంబం నిర్వహించే విధులు, స్త్రీ పురుషులు నిర్వహించే పనులు, వారి అవగాహన, విద్య, ఎక్స్ పోజర్, చట్టం, న్యాయం అన్నీ ఇప్పుడు మారిపోయాయి. అప్పట్లో పెళ్ళి ఒక మతపరమైన నియమాలకు లోబడి కుటుంబాలు నడిచేవి కాబట్టి అటువంటి రూల్స్ తో జరిగేది. ఇప్పుడు మతాలకి, కుటుంబానికి, జీవన విదానానికి సంబంధం లేకుండా వుంది. కానీ ఇప్పటికి కూడా పెళ్ళి నుండి మనం మనువు చెప్పిన, లేదా మధ్యలో మార్చబడి ఎలాగో వచ్చిన పాత పద్ధతులనే ఆశిస్తూ పెళ్ళి నుండి ఒక పాత కాలపు, బార్యని లేదా భర్తని కోరుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఎదో ఆధారం లేకుండా అనుకోవటంలేదు. 100 జంటల్లో 90 జంటలు సమస్యలతో వున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఒకవేళ వున్నా కొన్నాళ్ళే. మనం మన రాజ్యాంగాన్ని రాసుకున్నాము, న్యాయశాస్త్రాన్ని రాసుకున్నాము, చట్టాలు చేసుకున్నాము. వీటన్నిటికి ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాము. అవి కూడా ఎదో మహా గొప్పగా వున్నాయి అందరు వాటితో సంతృప్తి గా వున్నారని చెప్పటం లేదు. సమాజం అంటే క్రిమినల్స్, లాయర్లు, రోడ్లు, భవనాలు, ఆస్తులు, రాజకీయాలు ఇవేనా. కానీ వీటన్నిటికంటే సమాజం అనేది కొన్ని కుటుంబాల సమూహం కదా! అటువంటి కుటుంబ వ్యవస్థ ఎటువైపు వెల్తుంది? మన కుటుంబ వ్యవస్థ అందరికి సెక్యూరిటీని ఇస్తుంది, బార్యా భర్తలకి, పిల్లలకి, ముసలి వారికి, అనారొగ్యం తో వున్న కుటుంబ సభ్యులకి ఇలా అందరికీ మన కుటుంబం ఒక మర్రిచెట్టులా ఆశ్రయం కల్పిస్తుంది. కానీ కొన్ని పాత పద్దతులు, ఎక్స్ పెక్టేషన్స్ వల్ల, కొన్ని అసమానతల వల్ల, స్త్రీ నుండి ఇంకా అప్పటి స్త్రీ లనుండి ఆశించే పద్దతులు, ప్రవర్తన, పనులు ఆశించటం వల్ల సమస్యలు వస్తున్నాయి. చట్టాలు కుటుంబం లో ఎంతవరకు జోక్యంచేసుకోగలవు? వేరే మార్గం లేదా?? ఈ అవసరం వుంది అనేదీ బహుసా చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ అంత ఆవశ్యకత వచ్చేవరకు, పూర్తిగా వ్యవస్థ నాశనం అయ్యేవరకు ఈ సంధి రోజుల్లో పుట్టిన మనమంతా ఈ బాధలు పడాలేమో. ఒక్క స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా కుటుంబ బారం అంతా మొయ్యాల్సి రావటం వంటి నియమాలతో బాధపడుతున్నారు.కానీ మనది పిత్రుస్వామిక వ్యవస్థ కాబట్టి అప్పటి పద్ధతుల్లో(ఇప్పటికి కూడా) చాలా వరకు పురుషులకు అనుకూలంగా వున్నాయి. సమస్య జటిలం అయిన రోజున ఇద్దరు మార్పు కోరుకుంటారు అనిపిస్తుంది.

ఇదిలా వుంటే ఆఫీస్ కి వచ్చేసరికి ఒక శుభవార్త, నాకు బాలసహయోగ లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ పొజిషన్ కన్ ఫర్మ్ అయిందని, హైదరాబాదు పోస్టింగ్ అని చెప్పారు. నా హస్బెండ్ కూడా హైదరాబాదు వస్తున్నారు ట్రాన్స్ ఫర్ మీద, నా తమ్ముడు అక్కడే వున్నాడు. సో ఇక నేను లక్కీ ఒంటరి వాళ్ళం కాదు. నాకు సిటీ లైఫ్ అంటే ఇష్టం లేక పోయినా అందరు వుంటారు, లక్కీ చదువు బాగుంటుంది అని వెళ్తున్నా. అదీ కాక ఈరోజు నా పుట్టిన రోజు. ఈ రోజు గడిచేలోగా ఎన్ని ఆలోచనలొస్తాయో, ఎన్ని అనుభూతులకు లోనుకావాలో. ఏంటో నా పుట్టినరోజు ప్రతీ సంవత్సరం ఇలాగే విపరీతమైన ఫీలింగ్స్ తో గడపాల్సి వస్తుంది.

32 comments:

raj said...

శిరీష గారు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు..మీరు బాలసహయోగలో జాయిన్ అవుతున్నందుకు అభినందనలు..

raj said...

శిరీష గారు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు..మీరు బాలసహయోగలో జాయిన్ అవుతున్నందుకు అభినందనలు..

Anonymous said...

Life is either a daring adventure or nothing.Security is mostly a superstition.It does not exist in nature.

Many more happy returns of the day&congratulations.

శిశిర said...

శిరీష గారు,
పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆలోచింపచేసే టపా రాశారు.

మురళి said...

mee peru sirisha naa peru kuda sirisha and inkoti cheppana iddari bday kuda ivvalane....nice meeting you sirisha...welcome tohyderabad..

నీహారిక said...

శిరీష గారు,
పుట్టిన రోజు శుభాకాంక్షలు. పుట్టినరోజుకి ముందు అందరికీ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది ఆస్ట్రోలజర్స్ అందరికీ తెలుసు, మీరు కూడా గమనించారు.మీరు హైదరాబాద్ వస్తున్నందుకు సంతోషం,మీకు ఇష్టమైతె మనం కలుసుకోవచ్చు.

మురళి said...

mee peru sirisha naa peru kuda sirisha and inkoti cheppana iddari bday kuda ivvalane....nice meeting you sirisha...welcome tohyderabad..

జ్యోతి said...

హ్యాపీ బర్త్ డే శిరీషా,

మురళి పేరుతో ఉన్న మరో శిరీషకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఎంజాయ్..

hanu said...

శిరీష గారు,
ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

ivanni common anDi.... just relax ave sardukumTayi anni...

Anonymous said...

వేరే బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయని శిరీష గారు మీరేనా,కాదా...
ఎవరైతే ఏంటి మీకు జన్మదిన శుభాకాంక్షలు శిరీష గారు

రామమొహన్ said...

వివాహవ్యవస్త యవరొ ఒకమహానుభావుడు రాయలెదు చారిత్రక గతితార్కిక భ్ తిక ఉత్పతి సంభందాలననుసరించి ఒక నిర్దిస్ట సమాజంలొ న్యాయ రాజకీయ ఉపరితలానికి సంభందించి భావజాలము ఎర్పడుతుంటాఇ ఒక్క స్త్రి సమస్యె కాదు సమాజంలొవున్న ప్రతిఒక్క సమస్యకూ ఉత్పత్తి సంభందాలను విప్లవ కరంగా మార్సడమె సమస్యకు పరిస్కారము స్త్రి సమస్యను గాని మరె ఇతర సమస్య గాని విడిగా పరిస్కరిస్తామనడం ఉత్త బ్రమ

కొత్త పాళీ said...

పెళ్ళిళ్ళ గురించి మీరు చెప్పింది నిజం.
కొత్త ఉద్యోగం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు

Anonymous said...

పైనున్న గడ్డం మేస్టారు చెప్పిన తెలుగు నాగొక ముక్కా అర్థమకాలే, శుభమాని కొత్త ఉద్యోగం వచ్చిందంటే వుద్యమం చేయమంటాడేందబ్బా మీకెవరికైనా అయ్యిందా? గడ్డమయ్యా పద నువ్ జండా పట్టుకుని ముందు నడు, నేనెకాల వస్తా.

విరజాజి said...

ఇద్దరు శిరీషలకూ నా జన్మ దిన శుభాకాంక్షలు.

మరో గమ్మత్తైన విషయం చెప్పనా ... నా పేరు కూడా శిరీషే.

శిరీష కుసుమాలంటే అర్ధం దిరిసెన పూలు అని చాలా మందికి తెలీదు. దిరిసెన పుష్పాలు అని మీ బ్లాగు పేరు పెట్టుకున్నందుకు సంతోషం

హైదరాబాదుకి స్వాగతం.

జయ said...

సమస్యలు లేకపోతే జీవితం విలువ తెలియదట:) 'బ్రతుకు కన్నీటి ధారల లోనే బలిచేయకు ' అని ఒక మహా కవి అన్నాడుగా. పరిష్కారం లేని సమస్య ఉండదనుకుంట. ఈ భవ భవ సాగారాన్ని ఈదుకుంటూ పోవాల్సిందే. అప్పుడొచ్చే తృప్తి కూడా మహోన్నతమైందేగా. పుట్టిన రోజు జేజేలు.

సవ్వడి said...

శిరీష గారు! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆలోచించవలసిన విషయం చెప్పారు...
మరో శిరీష(మురళి) గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు.

swapna@kalalaprapancham said...

Iddari shirishalaki Happy birthday.

miru rasindi naku konchame arthamayindi :(

nenu chusinantha varaku pelli ayina vallu chala happy ga unnaru. evvaru pelli ayyaka bada padatam anedi chudaledu, inka cheppalante pelli ayyake valla life bagundani vinnanu, emo mari na surroundings lo mathrame ila unnattu undemo. anduke naku pelli ante chala ishtam.

ippudu aada maga ane difference assalu ledu 99% ammayilu family responsibility chusukuntunnaru I mean financial responsibility. ekkado chala rare 1% mathrame pelli ayina ammayilu job cheyadam ledu. ippati kalam lo iddaru earn chesthene anthantha mathram. kalam maripoyindi.

swapna@kalalaprapancham said...

inthaki balasahayoga ante emiti. Congrats for getting a job.

indrathinks said...

Happy birthday sirisha gaaru..Many many happy returns of the day..

Anonymous said...

నీహారిక,
మీ బ్లాగులోనే కాక మీ ఆస్ట్రాలజీ గోల వేరే బ్లాగుల్లో కూడానా! సబ్జెక్టు ఉన్నా లేకపోయినా పాత పుస్తకాల్లోవి ఎత్తుకొచ్చి పండితుల పోజు గొట్టడం ఇక్కడ మామూలైపోయింది. ఛ!

sahithi said...

Sireesha,
Many Many Happy returns of the day.

Sahithi

శరత్ 'కాలమ్' said...

పెళ్ళిలో వుండే సమస్యలు వుండొద్దనుకుంటే సహజీవనం పరిష్కారం అని నా అభిప్రాయం. పెళ్ళిలో వుండే సమస్యలు వుండొద్దనుకుంటే సహజీవనం పరిష్కారం అని నా అభిప్రాయం. నా వుద్దేశ్యంలో పెళ్ళి అనేది అవుట్ డేటెడ్ వ్యవస్థ అయినప్పటికీ ఇంకా దానినే పట్టుకొని వేలాడుతున్నాం. పెళ్ళికి చరమ గీతం పాడాల్సిందే.

sireesha said...

కామెంటిన అందరికీ ధన్యవాదాలు, అలాగే విషెస్ కి కూడా. ఈరోజు నాకు విపరీతమైన ఒత్తిడి వల్ల పేరు పేరున ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాను. కాని మీ అందరి మోరల్ సపోర్ట్ నా ఆలోచనలు తప్పుకాదు అనే ధైర్యాన్ని ఇచ్చాయి.

@ మురళి శిరీష ని కలిసినందుకు (బ్లాగ్లో) నా పేరుతో నేను పుట్టిన రోజునే పుట్టి నాలాంటి అలోచనలే వున్న మనిషి (మీ బ్లాగ్ చదివాను కాస్త అర్ధం అయింది) ఇంకొకరుంటే మనకి తెలిస్తె చాలా సంతోషం కదా!

@ విరజాజి, మీ పుట్టినరోజు కూడా..??

@ ప్రియమైన అనానిమస్ గారికి, ఆ పేరు తో ఎన్ని కామెంట్స్ వచ్చినా మీరు ఒక్కరే అని అర్ధం అయింది. కాస్త హాస్యం, కాస్త కోపం నిండిన మీ కామెంట్స్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. అయినా కొన్ని కామెంట్లు ప్రచురించను. అవి ఇతరులని తప్పుపట్టేవి ఐతె. మీరు చెప్పినట్లు నేను ఇతరుల బ్లాగులలో కామెంట్ చెయ్యను అనేది పూర్తిగా నిజం కాదు. నేను బ్లాగ్ మొదలు పెట్టక ముందు నుండే రెండు రెళ్ళు ఆరు, నేస్తం బ్లాగులకు పెద్ద ఫాన్ ని. అవికాక ఇంకా చాలా బ్లాగులు రెగ్యురల్ గా చదువుతాను, సత్యవతి గారిది, జాజిమల్లి ఇలా పెద్ద లిస్ట్ వుంది. శరత్ కాలం, బ్లేడు బాబ్జి ఐతే కామెంట్లకోసమే ప్రత్యేకంగా చదువుతాను. నా ప్రయాణాలలో ఈ బ్లాగులే నాకు తోడు. చదివి ఎలా వదిలేస్తాను. కామెంట్లు కూడా చేస్తాను. కాని వేరే పేరుతో అది

కామెంటిన అందరికీ ధన్యవాదాలు, అలాగే విషెస్ కి కూడా. ఈరోజు నాకు విపరీతమైన ఒత్తిడి వల్ల పేరు పేరున ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాను. కాని మీ అందరి మోరల్ సపోర్ట్ నా ఆలోచనలు తప్పుకాదు అనే ధైర్యాన్ని ఇచ్చాయి.

@ మురళి శిరీష ని కలిసినందుకు (బ్లాగ్లో) నా పేరుతో నేను పుట్టిన రోజునే పుట్టి నాలాంటి అలోచనలే వున్న మనిషి (మీ బ్లాగ్ చదివాను కాస్త అర్ధం అయింది) ఇంకొకరుంటే మనకి తెలిస్తె చాలా సంతోషం కదా!

@ విరజాజి, మీ పుట్టినరోజు కూడా..??

సవ్వడి said...

ayyo.. ninna nenu coment pettanu. adi kanipincatledu...

శిరీష said...

@శరత్ గారు, మీరు చెప్పే సహజీవనం ఇంకా ఎక్కువ సమస్యలు. అందులో ఎవరికీ ఏదీ సెక్యురిటీ వుండదు. ఎప్పుడు బడితే అప్పుడు విడిపోవటం, ఎవరికీ ఏ బాద్యత లేకపోవటం అవుతుంది. అప్పుడు పిల్లలు, ముసలి వారు ఏమికావాలి? అసలు ఎవరికీ పిల్లలే వద్దు అనుకుంటే ఈ పద్ధతి సరిపోతుంది. అయినా కూడా ఈ పద్ధతి కేవలం సెక్స్ అవసరాలు తప్ప మానసిక, సామాజిక, ఆర్ధిక అవసరాలేవి తీర్చలేని వ్యవస్థ అవుతుంది. దానికంటే మన వివాహ వ్యవస్థ లో కొంత మార్పులు తేవటం మంచిదని నా అభిప్రాయం.

ఆ.సౌమ్య said...

పెళ్ళిళ్ళ గురించి మీ బాధ చాలా నిజం, దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, కాదంటారా?

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Anonymous said...

belated wishes to you sirishagaaru..
ika marpu antara.. mana mottam vyavastalo maarpu chaala avasaram vundi.. anni rangalalo..rajakeeyala ninchi municipality daaka..seva rangam ninchi svayam upadi daaka...
marpu annadi mana ninche modalavutundandi.. example meere mee intlo adavallu vundyogam cheyatam ane maarpuku sreekaaram chottaru... alane marpu vastune vuntundi manam gamanincham konni sarlu ante

Anonymous said...

@swapna@kalalaprapancham
balasahayoga lo hiv- pillalakiani ,careindia valladi ani telusu.

శిరీష said...

నా బ్లాగ్ లో ఏదో ప్రాబ్లెం వల్ల కొన్ని కామెంట్స్ కనిపించలేదు. సో అందుకనే అందరికీ సమాధానాలు రాయలేకపోయాను.

@స్వప్న@కలలప్రపంచం, మీరు అదృష్టవంతులు అనుకుంటా మీ చుట్టూ అందరు పెళ్ళి చేసుకొని సంతోషం గా వున్నారు. నూటికి 90% కుటుంబాలలో స్త్రీలు పనిచేస్తున్నారనేది నిజమే, ఎన్నో కుటుంబాలలో స్త్రీల సంపాదన మాత్రమె కుటుంబం నడుస్తున్నదనేది ఇంకా పెద్ద నిజం.

శిరీష said...

@ నీహారిక గారు, క్షమించండి ఆ అనానిమస్ కామెంట్ నేను పోస్ట్ చెయ్యలేదు. చెప్పాను కద నా బ్లాగులో ఏదో ప్రాబ్లెం వచ్చి నాకు కామెంట్లు కనిపించలేదు.

శిరీష said...

@ నీహారిక గారు, క్షమించండి ఆ అనానిమస్ కామెంట్ నేను పోస్ట్ చెయ్యలేదు. చెప్పాను కద నా బ్లాగులో ఏదో ప్రాబ్లెం వచ్చి నాకు కామెంట్లు కనిపించలేదు.

నీహారిక said...

@ anonymous,
నా పోస్ట్ లు నచ్చలెదని నా బ్లాగులోనె చెప్పవచ్చుకదా?
మనకంటే ముందు ఎంతో గొప్పవాళ్ళు తమ తమ అనుభవాలను పుస్తకాల రూపంలో మనకు జ్ఞానాన్ని అందించారు. అవి అందరూ చదవరు, చదివినా జీవితానికి అన్వయించుకోరు, నన్ను కొందరు వ్రాయమని కోరుతున్నందువల్ల నాకు సమయం లేకపోయినా సమయం తీసుకుని నెలకొకటి వ్రాస్తున్నాను.మీకు నచ్చకపోతే చదవకండి.బలవంతం గా మీ చేయి పట్టుకుని మౌస్ క్లిక్ చేయమనలేదు కదా! జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అందరికీ అందవలసిందే,నా అనుభవాలతో కలిపి, ఎక్కడెక్కడి జ్ఞానాన్ని ఒక్కచోట చేరుస్తున్నాను.