Friday, August 20, 2010

మీ కడుపున మళ్ళీ అమ్మాయిగా పుడతా

నాకు కొంచెం సహాయం చేస్తారా?

హైదరాబాదు అంటేనే నా గుండె దడ దడా అంటుంది. ఎందుకంటే ఈ మధ్య రెండుసార్లు వెళ్ళి ఆ ట్రాఫిక్ చూసి పిచ్చెక్కింది. ఇక అక్కడే వుండాల్సి వస్తుంది. ఏమైనా జిల్లాల్లో వుండే హాయి అయిన జీవితం సిటీలో వుండదు కదా! పిల్లల స్కూలు, మన ఆఫీసు, ఇల్లు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయో చెప్పలేము. నా ఆఫీస్ పంజాగుట్ట, మా హబ్బీ ది ఉప్పల్, మా తమ్ముడు బోరబండ, నేను రోజూ మెదక్, మెహబూబ్ నగర్ వెళ్తుండాలి. ఇదీ టోటల్ గా మేము తిరగబోయే ప్రదేశాలు. తమ్ముడు ఆఫీస్ హైటెక్ సిటీ ఒక వేళ వాడు మాకోసం ఇల్లు మారినా వాడికీ మరీ కష్టం కాకుండా వుండేలా మేము ఇల్లు చూసుకోవాలి. ఇవన్నీ కలిసే ప్రదేశం ఒకటి చెప్పండి. అంతే కాదు అన్నిటికంటే ముఖ్యం మా లక్కీకి మంచి స్కూల్ వుండాలి అదే ప్రధానమైన విషయం. వాడు చదివేది 1 క్లాస్ కానీ ఇప్పటికి వందసార్లు స్కూల్ మారాడు ఇప్పుడైన ఒక మంచి స్కూల్ లో వేసి ఇక మార్చకుండా కనీసం ఒక 5 సంవత్సరాలు వుండేలా వుంచుదాము అనుకుంటున్న. పాపం వాడికి స్నేహితులే వుండటం లేదు. మరీ రుబ్బుడు స్కూల్స్ కాకుండా స్పోర్ట్స్, విలువలు కూడా నేర్పే మంచి స్కూల్ ఏదైన తెలియజేయండి. అలాంటి స్కూల్స్ అసలు మన ఇండియాలోనే లేవంటారా? ఒక వేళ వున్నా లక్షల్లో ఫీజులు గుంజుతారేమో! నన్ను అప్పుల పాలు చెయ్యనిది, లక్కెని కష్టాల పాలు చెయ్యనిది మంచి స్కూల్ ఏదైన తెలిస్తే సలహా ఇవ్వండి. మన బ్లాగర్స్ లో హైదరాబాదీయులు ఎక్కువగా వున్నరనిపిస్తుంది. కనుక నాకు ఒక అనుకూలమైన ఏరియా మరియు స్కూల్ విషయం గురించి సమాచారం ఇచ్చి పుణ్యం కట్టుకోండి. వచ్చే జన్మలో మీ కడుపున మళ్ళీ అమ్మయిగా పుడతా. అస్సలు అల్లరే చెయ్యను.

12 comments:

సవ్వడి said...

మీరు అల్లరి చేస్తానంటేనే చెప్తా! లేకపోతే చెప్పను. ముందు మీరే చెప్పండి.

Anonymous said...

మా అపార్ట్ మెంట్ ఇంకో 3-4 నెలల్లో ఖాళీ అవుతుంది. మీకు కావాలంటే చెప్పండి.
please mail @ : varalakshmi.sriram@gmail.com

raj said...

మా విద్యానగర్ రండి..అటు ఉప్పల్ కి దగ్గరా ఇటు హైటెక్ కి కొంచెం దూరం అయినా మీ తమ్ముడు చిన్నవాడెకదా జర్నీ చెయ్యగలడు....ఇక్కడ మంచి స్కూళ్ళూ చాలా ఉన్నాయి..మా వాడికి ఒక ఫ్రెండు కూడా దొరికినట్టు ఉంటుంది..

రవిగారు said...

తార్నాక అయితే బెటర్ ,హబ్సిగుడా లో జాన్ సన్ గ్రామర్ స్కూల్ బెస్ట్
మీ అబ్బాయిని దింపేసి అలా ఆఫీసు కి ఉప్పల్ వెళ్లి పోవచ్చు
.లోపలకి వస్తే ఆరేడు వేలల్లో రెండు బెడ్రూం ఫ్లాట్స్ దొరుకుతాయి

athreya said...

anni oollu thirigi anni panulu chakka pettukochina bangaru thalliki Hyd lo ekkadunte em problem

meeru ilage padi kalaalu manchi manchi postings raasthu manchi padavula kelthoo undalani korukunto..........

athreya said...

Nigerian students mandulaki alavatu padda telugu cinema herolloga vundi naa paristhithi malli eppudu mee kotha post rojukoti veyyaradu
thanks for the great feast ... twaraga rayandi ...

athreya said...

Ammaaa Lady Clemantuuu twaraga edoti rayammaa.....

శిరీష said...

@ సవ్వడి, సరే అల్లరి చేస్తా కానీ మీ కడుపున పుట్టే చాన్స్ నాకు లేదు గా. ముండు మీరు అమ్మాయిగా పుట్టండి( జోకాను)

@రవి గారు తార్నాక అని, రాజ్ విద్యానగర్ అని ఇలా మనిషొక చోట చెప్తే ఎలా అండి. ఏంటి ఇంటి అద్దె లోపలకి వెళ్తే 7,000/- ఆ? నిన్న ఇంకో ఫ్రెండ్ పదివేలు అని చెప్పారు. ఎవరైన ఫ్రీ గా పేద్ద ఇల్లు దొరికే మార్గం చెప్పొచ్చుగా!!!

@ఆత్రేయ గారు, మీరు నన్ను పొగిడారా తిట్టారా? రోజుకో పోస్ట్ రాయాలని కలలు నేను కూడా కంటున్నా.

athreya said...

pogidanu. assalu mee postings anni oke roju lo chadiva (endukante nenu kothaga modalupetta blogs chadavatam)
nijjam ga chala bagunnai. inko anumanam entante meerevaro cheyyibaga thirigina rachayithri emo ani kothaga rayatam modalu pettina vallu intha pakadbandi ga rayagalara ani hanumanam. edaina i am one of top rated fans of ur blog. blog peru DIRESINE POOLU ayithe adaviki manushulaki daggara undemo PUSHPALU ante edo daiva bhasha laaga undi ayina mee blogoo mee istam

శిరీష said...

@ఆత్రేయ గారు, మీ అభిమానానికి థాంక్స్ కాని నేను చేతులు కాళ్ళే కాదు కనీసం వేలు తిరిగిన రచయితని కూడా కాదు. నా నిజ జీవిత అనుభవాలు నిజాయితీగా వ్రాస్తునాను అంతే!

దిరెసెన పుష్పాలు అంటే శిరీష పుష్పాలని అర్ధం, నా పేరు కలుస్తుంది అని అంతే కాక నా అనుభవాలు కూడా అంతే అపురూపమైనవి అరుదైనవి అని ఆపేరు పెట్టాను.

నీహారిక said...

ఉప్పల్ కి దగ్గరలో రామంతపూర్ దగ్గర హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది. అదయితే మీకు బెస్ట్.అసలు చదవమని ఫోర్స్ చేయరు, బోలెడంత ప్లె గ్రౌండ్, ఆల్ రౌండర్ కావచ్చు,ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం పెడ్తారు,ఉద్యోగినులకి ఎంతో వీలు కదా! మార్కులు కావాలని మాత్రం నన్నడగవద్దు. ఏదో.. కూతురుగా పుడతానన్న్నారని చెపుతున్నాను.

Kathi Mahesh Kumar said...

:)