Monday, May 3, 2010

లేడీ బాస్

వెలుగు ప్రోగ్రాము మొదట 6 జిల్లాలో పైలట్ చేశారు. నా అదృష్టం కొద్దీ నేను అందులో పనిచెసే అవకాశం నాకు వచ్చింది. జీవితంలో అది మంచి మలుపు. అసలెవరకీ ఆ ప్రొగ్రాము గురించి తెలీదు అప్పటికి. పనిచేస్తున్న మాకు కూడా తెలీదు పూర్తి వివరాలు.సరే అంత మంచి అవకాశం నాకెలా వచ్చిందో చెప్తాను.


నేను జాబ్ వెతుకుతున్న టైములో నా బ్యాచ్ లో వాల్లంత అదే పనిలో వున్నారు. నేనే ఎదో చిన్న జాబ్ అయిన చేస్తున్నాను అప్పటికి. మిగిలిన వాళ్ళంత బేవార్స్ బ్యాచ్ అప్పటికి. నా ఫ్రెండ్స్ విజయనగరం లో వెలుగు ఇంటర్యూస్ కి వెళ్ళారు. కాని ఆరోజు నాకు అరుకు ఆఫీసులో విజిట్ వుండి, ఇంటర్యూ కి వెళ్ళటం కుదరలేదు. నేను పనిచేస్తున్న సంస్థకి ఆ విజిట్ చాలా ముఖ్యం అందుకని లీవ్ అడగలేకపోయాను.సో నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తరువాత వారంలో శ్రికాకుళం జిల్లా ఇంటర్యూలకు వెళ్ళొచ్చని అనుకున్నాను.కాని నా ఫ్రెండ్స్ కొందరు మన జిల్లా అనీ చెప్పి అక్కడ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని ఒప్పించి నన్ను మళ్ళీ ఇంటర్యూ కి పిలిపించారు.నాకు ముందుగా కాస్త ఉద్యోగ అనుభవం వుండటం వల్ల జెండర్ కో-ఆర్డినేటర్ పోస్టుకి పిలిచారు నన్ను. మిగిలిన నా స్నేహితులందరు కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ గా సెలెక్ట్ అయ్యారు. అసలు ఆ పోస్టలకు, పదాలకు అర్ధం కూడా మాకు నిజంగా తెలీదు. అందరు ఫ్రెష్ ఫ్రం కాలేజి. అలా అయితే బాగా మౌల్డ్ చెయ్యొచ్చని వెలుగు ప్రాజెచ్ట్ వారి అభిప్రాయం. అది కొంతవరకు నిజమే.


విజయనగరం ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్. తరువాత కాలం లో ఐ.ఎ.ఎస్ కంఫర్మ్ అయ్యింది ఆమెకి. ఆమెకి నేను ఎందుకో మొదట నచ్చనే లెదో లేక ఇంటర్యూ రోజు రాలేదనో ఆమెని చూడగానే నాకు అర్ధం అయిపోయింది ఆమెకి నేను నచ్చలేదు అని.(నాకు నచ్చారా లేదా అన్నది అనవసరం) సరే నా పని ప్ర్యత్నం చెయ్యటమే కదా!! క్వాలిఫికేషన్స్, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ అనుభవం అన్ని అడిగారు. జెండర్ అంటే ఏమి తెలుసు అన్నారు. నిజంగా డిక్షనరీ అర్ధం తప్ప నాకు అప్పటికి జెండర్ ఈక్విటీ గురించి పనిచెస్తే ఏమి చెయ్యాలి అనేది, అదొక పని వుందని కూడా తెలీదు. అయినా నాకు తెలిసిందే చెప్పాను. తెలుగులో స్త్రీత్వం, పురుషత్వం అనే అర్ధం అని. ఆమె నీకు అంతే తెలుసా? మరి నీ పోస్ట్ డెస్క్ ఆఫీసర్ జెండర్ అని వుంది నీ బయోడేటా లో అన్నారు. నిజమే కొథ్త్తగా నాకు అప్పగించిన ఇంకో పని మా ఆఫీస్ లో. కానీ దానిగురించి ఇంకా నాకేమి చెప్పలేదండి అని చెప్పాను.కేవలం కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చాము కొందరు దాయీలకి అని చెప్పాను. సరే మేమెలాగూ ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. హమ్మయ్య అనుకుని, థాంక్స్ చెప్పాను. అంతా బాగ అయ్యింది అనుకునే సరికి మలుపు తిప్పిన ప్రశ్న అడిగారు. "నీకు రేపు పెళ్ళి అయ్యాక(అంటే ఫ్యూచర్ లో) కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావా? ఉద్యోగానికా? అని అడిగారు. నాకు తెలుసు ఎవరికైన కుటుంబమే ముఖ్యం, పెళ్ళి అయినా అవ్వక పోయినా కూడా. కానీ అలా చెప్తే ఉద్యోగం ఇస్తారా? అందుకె ఆలొచించడానికి టైము దొరుకుతుందని " అంతే యె విషయంలో మేడం అని అడిగాను" ఆమె మళ్ళీ సోదాహరణగా అడిగారు. ఫ్యూచర్లో నీకు పెళ్ళి అయ్యాక జాబ్ లో ప్రెజర్, ఇంట్లొ ప్రెజర్ ఎక్కువగా వున్నప్పుడు దేనికి ప్రాదాన్యత ఇస్తావు, ఏది వదులుకుంటావు అన్నారు. అంత వరకు చిన్న ఆశ వుండేది జాబ్ ప్రెజర్స్ మీద పనిచేస్తాను అని చెప్పడానికి. కానీ ఆమె ఏది వదులుకుంటావు అనే వుద్ధెశ్యంతో అడిగారు.ఇక అబద్దం చెప్పే ఉద్దెశ్యం నాకు లెదు. " నాకు కుటుంబమే ముఖ్యం దానికే ప్రాధాన్యత ఇస్తాను. వీలైనంత వరకు జాబ్ లో ప్రెఊర్ ని తట్టుకొని పనిచెయ్యడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎదో ఒకటి వదులుకోవాల్సి వస్తే తప్పదుకదా వుద్యోగమే వదులుకుంటాను. బహుశా అది ఆ జాబ్ కి న్యాయం చెయ్యటమే కదండి అన్నాను." కాని ఆమెకి ఈ జవాబు నచ్చలేదు(బహుశా నేను నచ్చలేదు) "ఈ ఉద్యోగం ఎంతో ముఖ్యమైనది మన కుటుంబంకంటే కూడా ఉద్యోగమే ముఖ్యం అనుకునే వాళ్ళే చెయ్యగలరు. నువ్వు ఈ ఉద్యొగానికి సరికాదు అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ పొజిషన్లో వున్న ఆమె చెప్తున్నారంటే అది నిజమేనేమో. ఆ ఉద్యోగం చెయ్యాలంటే అదే జీవితం గా భావించేవాళ్ళు కావాలేమో అనిపించింది. అలా అని నన్ను నేను ఊరడించుకుంటున్నాను మనసులో ఇంతలో ఆమె ఇంకొక మాట అనేశారు. ఇలా కుటుంబమే ప్రధానం అనుకునే నువ్వు ఎక్కడా పనిచెయ్యలేవు అని. నాకు చాలా కోపం వచ్చేసింది. చేతకానివాళ్ళకీ, నిస్సహాయస్థితిలో వున్నప్పుడూ కోపం వస్తే అది కన్నీళ్ళుగా మారిపోతుంది. ఆమె ముందు ఏడ్చేస్తానేమో అని  చాలా కస్టపడి కంట్రోల్ చేశుకిని సరే మాడం చూస్తాను. నాకు తగిన జాబే వెతుక్కుని చేస్తాను తొందరేమీ లేదు అని చెప్పి వచ్చేశాను. బయట ఆశగా ఎదురుచూస్తున్న నా ఫ్రెండ్స్ కి ఎలా చెప్పాలి ఇలా మాట్లాడారు మీ మేడం అని. ఒకప్పుడు ఒకరికోసం ఒకరు ఆవెశంగా నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కదా! అప్పటికే పి.జి. చేసి ఒక సంవత్సరం ఖాళీగా వుండి బాధలు పడుతున్నారు. అప్పుడేదో చెప్పాను నాకు గుర్తులేదు కూడా.


అన్ని మన మంచికే జరుగుతాయి అనేది నిజమేనేమో! తరువాత నేను శ్రికాకుళం వెలుగు ప్రాజెక్టు లో సెలెక్ట్ అయ్యాను. ఆ ఇంటర్యూ ఒక సరదా కధ(నాకు). ఇంటర్యూ చెసినవాళ్ళకి కంఫ్యూజన్ పాపం. అది వచ్చేవారం రాస్తాను. కానీ నేను అసలు ఏ వుద్యోగానికీ పనికి రాను అన్న ఆమె కరెక్టుగా 4 నెలల తరువాత ఒక మీటింగ్ లో మా పి.డి గారితో పాటు ప్రెజెంటేషన్ చెయ్యడానికి వెళ్ళిన నన్ను, మీటింగ్ లో నేను మాట్లాడిన విధానం చూసి, మా  పి.డి గారితో మీకు మంచి కేండిడేట్లు దొరికారండీ మా వాళ్ళు ఇంకా అంతగా లేరు అన్నారు. నాగురించి అడిగారు. ఆమె నన్ను గుర్తుపట్టలేదో ఏమో! కానీ మా పి.డి. గారు గుర్తుచేశారు, ఈమె పేరు శిరీష మీ జిల్లానే అని. ఆమె నన్ను చూసి "ఏమ్మాయ్ మన జిల్లా వదిలి పక్క జిల్లా కి ఎందుకు వెళ్ళావు?" అని అడిగారు. కాసేపు నా కోపం తీరేలా ఆమె నన్ను అన్న మాటలు తిరిగి గుర్తుచేద్దామా అనిపించింది. కానీ ఏదో మర్యాద అడ్డం వచ్చింది. బట్ మా పి.డి గారికి తెలుసు నేను ముందు అక్కడికి ఇంటర్యూ కి వెళ్ళిన విషయం ఆయన ఆనందంగా చెప్పారు. అసలే పి.డి.ల మద్య ఎప్పుదూ గిల్లికజ్జాలే."మీరు గుర్తుపట్టలేదేమో మీదగ్గరకే మొదట ఇంటర్యూకి వచ్చింది" అని చెప్పారు. నేను  అవును అన్నట్లు తల ఊపాను.ఆమెకి గుర్థొచిచిందో లేదో నాకు తెలీదు కానీ ప్రతీ సారి ఏ మీటింగ్లో కలిసినా నన్ను గుర్తుపట్టలేదన్నట్లే వుంటారు. ఇప్పటికి ఆమే నేను ఎన్నో స్థాయిలలో ఎన్నోచోట్ల కలిశాము. సునామీ టైములో ఆమె జిల్ల కలెక్టర్ గా వున జిల్లలో నేను పనిచేయటం వల్ల చాలా మీటింగ్ లలో కలిశాము. ప్రతీ సారీ ఇదే జరుగుతుంది. నా ముఖం మరీ అంత గుర్తుపెట్టుకోనవసరంలేనంతగా వుందా అని డౌట్ వస్తుంది.ఆమె తప్ప నన్ను ఇంతవరకూ ఎవరూ మర్చిపోలేదు, ఆఖరికి ఒక్కసారి చూసినవాళ్ళు కూడా! నా హింస భరించిన వాళ్ళు మరిచిపోయే చాన్సే లేదు. 


నెక్స్ట్ పోస్ట్ వ్రాసేవరకు మీరు గుర్తుపెట్టుకుంటారా? మరిచిపోతారా? 



13 comments:

భాస్కర రామిరెడ్డి said...

బాగున్నాయండి మీ ఉద్యోగ జ్ఞాపకాలు. తరువాతి వ్యాసం కోసం చూస్తుంటాను.

Anonymous said...

great bagundi mee kadha.

Anonymous said...

కొంచెం త్వరత్వరగా రాస్తే బాగుంటుంది మేడం. మేము ఎదురు చూడలేక చచ్చిపోతున్నాము

శిరీష said...

@ Baskar gaaru, @anonymous thanks alot i will try to write soon this time

శిరీష said...

@anonymous చచ్చిపోవద్దండీ ప్లీజ్. కనీసం నా పోస్టులు అన్నీ అయ్యేవరకు బ్రతకండి. anyway thanks for your curiosity.

శిశిర said...

కొంతమంది అంతేనేమోనండి. కొందరిని కావాలని ఇగ్నోర్ చేస్తారు. ఏమైనా అన్నీ మన మంచికే కదా. మంచి చోటే సెలెక్ట్ అయ్యారుగా తరువాత :)

ఆ.సౌమ్య said...

మనది ఇజీనారమా అండీ? మాదీ ఆ ఊరేనండీ :)

Anonymous said...

madam, what are you now?

Did that collector give-up family during Tsunami? :P

శిరీష said...

@sirisa, thanks for following my blog.
@Sowmya maadi vizianagaram District parvatipuram. meedi??
@anonymous - im not with Govt. now. presently working with CARE-India. aa collector gaare kaadu evaru family ni vadala leru. she said that as just some reason to get relevied from me ayyuntundi.

ఆ.సౌమ్య said...

మాది విజయనగరమే, కోట దగ్గరగా మా ఇల్లు...మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

కొత్త పాళీ said...

ఓ మీరు వెలుగులో చేశారా? శ్రీకాకుళం పైలట్ అంటే నేను ప్రవేశించే సమయానికి ముందయి ఉంటుంది. సెర్ప్‌లో ఆ రోజుల్లో పెద్ద ఆఫీసరయిన నా స్నేహితుడి పుణ్యమా అని రంగారెడ్డి లైవ్‌లీహుడ్స్ బృందంతో చాలా గ్రామాలు తిరిగాను - ఉద్యోగిగా కాదు, ఒక అబ్జర్వేషను కోసం, అసలు ఈ గ్రామీణాభివృద్ధి ఎలా చేస్తున్నారు అని నేర్చుకోవడం కోసం.
మీకథకొస్తే, అంత పెద్ద పదవిలో ఉన్న ఆమె అటువంటి ప్రశ్న వెయ్య వలసింది కాదు. తరవాత కలిసినప్పుడు మీరా సంఘటన గుర్తు చెయ్యకపోవడం మీ సంస్కారం.

శిరీష said...

@kotha paalee,
very happy to know that you know about our project. and livelihoods. thaks for following my blog

bloggerbharathi said...

vijayanagaram jilla collector ga panichesina B.Kishore garu miku telusanukuntaa