హాయ్ ... ఇప్పుడు టైము 9.25 రాత్రి. ఇంకా ఆఫీస్ లో వున్నాను. ఇప్పుడే కాస్త ఈరోజు పని అయింది కానీ వెల్దామంటే వర్షం పడుతుంది. ఇంటికెళ్ళాలని ఇక అనిపించటం లేదు. లక్కీ ఆల్రెడీ ఇంటికొచ్చి అమ్మా ఎప్పుడొస్తున్నావు అని 6 సార్లు ఫోన్ చేసీ చేసీ నిద్రపోయాడు. ఇప్పుడే చిన్నమ్మ( మా ఇంట్లో వుంటుంది మాకు తోడుగా) ఫోన్ చేసి చెప్పింది లక్కీ నిద్రపోయాడు అని. ఇంకా ఎన్ని రోజులు ఇలా బిజీ గా వుంటానో అర్ధం కావటం లేదు. సునామీ వచ్చిన తరువాత ప్రాజెక్ట్ మొదలు పెట్టిన మొదట్లో ఇలాగే వుండేది. ఆ తరువాత ప్రతీ తుఫాను సమయంలో వరదల సమయంలో, ఆడిట్ సమయం లో, ముఖ్యమైన మీటింగ్స్ కి బిజీ గా వున్నా మరీ ఇన్ని రోజులు కాదు.
సరే ప్రపంచం లో అందరూ బిజీ నే, నీ గొప్పేంటి అనుకుంటున్నారా! ఏమీ లేదు. నా బ్లాగు కాబట్టి నా సోదే కదా రాసేది.
ఇంతవరకు ఇన్స్యూరెన్సు కంపెనీ వాళ్ళతో మీటింగు అయ్యింది. మనసంతా చికాకైపోయింది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఉప్పు రైతుల కోసం ఒక ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ ఫెసిలిటేట్ చేసి పైలట్ చేసాము. అది ఒప్పా తప్పా అని అర్ధం కావటం లేదు. లైలా వచ్చి ఉప్పు రైతులు చాలా నష్టపోయారు. కానీ ఇన్స్యూరెన్స్ వాళ్ళు కనీసం ప్రీమియం కట్టిన దానికంటే కూడా తక్కువ క్లెయిం ఇస్తున్నారు. అదేమి అంటే మేము పలానా క్లాజు ప్రకారం ఇలాగే అని చెప్తున్నారు. ఈ ఇన్స్యూరెన్సు, అందులో మైక్రో ఇన్స్యూరెన్సు ఏమీ అర్ధం కాదు, కేవలం కంపెనీ వాళ్ళకే ఎప్పుడూ అనుకూలంగా వుంటాయి. ఇక రైతుల వైపు చూస్తే పోయిన సారి వేసవి కాలం ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ ఉత్పత్తి వచ్చేసి రేటు పడిపోయిందని పోయిన ఏడాది సరుకు కూడా ఇంకా స్టాకు పెట్టారు. దాని వల్ల పెట్టుబడికి డబ్బులేక ఈసారి ఎక్కువ అప్పుచేసారు, తీరా లైలా కరెక్ట్ టైములో వచ్చి స్టాండింగ్ క్రాప్ తో పాటు రెండు సంవత్సరాల నిల్వ ఉప్పు కూడా తీసుకు పోయింది. ఉప్పు రైతు సరుకు లేక, పండించాలంటే ఎండలేక, అప్పులతో మిగిలిపోయాడు.
వ్యవసాయం చేసే వాళ్ళకి గవర్నమెంటు ఎన్నో సబ్సిడీలనీ, ఋణాలనీ చాలా చేస్తుంది. కానీ తెల్లారి లేస్తే ఎందులో ఉప్పులేక పోయినా బతకలేని మనకి అసలు ఆ ఉప్పు పండించే ఒక రైతు వుంటాడనీ కూడా గుర్తులేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు "ఉప్పు పండిస్తారా, టాటా వాళ్ళు ఫేక్టరీ లో కదా తయారు చేస్తారు" అని అడిగారంటే ఉప్పు రైతుల పరిస్తితి ఎంత దారుణమో ఊహించండి. ఉప్పు వ్యవసాయం కిందకి రాదు, పరిశ్రమల విభాగం కింద వస్తుంది అంటే మామూలు రైతుకి కరెంటు కి సబ్సిడీ రేటైతే ఉప్పు రైతుకి పరిశ్రమల రేటు, అదీకాక వుప్పు పండించే భూములన్నీ సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో వున్నాయి వాళ్ళు ఎవరో పెద్ద కౌలుదారులకి ఆ భూమి వందల ఎకరాల్లో కౌలుకి ఇచ్చారు, ఇంకా ఆ లీజు వందల సంవత్సరాలుగా వాళ్ళకే వంశపారంపర్యంగా వస్తుంది. కానీ నిజానికి వాళ్ళెవరికి కనీసం ఉప్పు పంట ఎలా వుంటుందో కూడా తెలీదు. వాళ్ళు చిన్న చిన్న ఉప్పు రైతులకి తిరిగి ప్రతీ సంవత్సరం లీజుకి ఇస్తున్నారు. ఇలా తరాలుగా జరుగుతుంది కానీ ఏ ఉప్పు రైతు కూడా భూస్వామి కాలేకపోతున్నాడు.
కేవలం వేసవి కాలంలో ఉప్పు పండుతుంది, కళ్ళు మిరిమిట్లు గొలిపే మండుటెండలో ఉప్పు పండించాలి. కను చూపు మేరలో ఎక్కడా చిన్న నీడ కూడా వుండదు. చూట్టూ నీరున్న ఎక్కడా తాగడానికి మంచి నీరు దొరకదు.ఊరికి దూరంగా వుంటాయి ఉప్పు పొలాలు. ఆ ఉప్పు నీరు, అధిక వేడీ...కోసుకునే ఉప్పు, చర్మం, కళ్ళు దెబ్బతింటున్న కేవలం కొద్ది కాలమే పండే పంట కనుకా, ఆ తరువాత ఇక ఆ భూమి ఎందుకూ పనికి రాదు కనుక కుటుంబం అందరూ పిల్లా పెద్ద ఆడా మగా ఆ 4 నెలలు అదే పని చేస్తారు. ఇంత చేసినా కూడా ధర ఎలా వుంటుందో తెలీదు, వాన ఎప్పుడొచ్చి ముంచేస్తుందో తెలీదు, సూర్యుడు అలిగి మేఘాల మాటున దాగున్న కూడా సరైన సెలినిటీ రాక ఉప్పు పండదు, కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు భూమి లో నుండి నీరు మోటర్ల ద్వారా పైకి తీస్తారు, ఆ మోటరు ఎప్పుడు పాడైపోతుందో, గుజరాత్ లో ఎక్కువ పండేస్తే ఇక్కడ రేటు పడిపోతుందో....ఇలా ఎన్నో సమస్యలు అన్నీ చెప్పలంటే నాకు 5 సంవత్సరాలు సరిపోదు ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలుగా వింటున్నాను, చూస్తున్నాను ఎంత చేసినా తరగని పని వుంది కానీ అందుకు సరిపడా నిధులు, టెక్నాలజీ, అధికార సహకారం, పాలసీలు ఏవీ లేవు. వెళ్ళిపోయే ముందు వాళ్ళకి లైలా మిగిల్చిన విషాదం లో వదిలి వెళ్ళిపోతున్నము అని బాధగా వుంది.ఉప్పు కోసం ప్రత్యేకంగా ఎవరైనా పనిచేస్తే బాగుండు అనిపిస్తుంది.వర్షం పడుతుంటే చూసి ఆనందించాలో ఉప్పు రైతులు గుర్తొచ్చి బాధపడాలో తెలియదు.
ఇక నా పర్సనల్ విషయాలకి వస్తే ఒకే ఒక ఇంటర్యూకి వెళ్ళగలిగాను,టైము కుదరక. అది కూడా బాలసహయోగ ప్రాజెక్ట్, కేర్-ఇండియా ప్రాజెక్టే.హెచ్.ఐ.వి కుటుంబాలకు అందులో ముఖ్యంగా పిల్లలకు ఆదాయ మార్గాలు చూపించే ప్రోగ్రాము. ఇంటర్యూ బాగానే చేసాననిపించింది. ఒక వారంలో చెప్తాము అన్నారు. అది కూడా హైదరాబాదా, కడపా అనేది తెలీదు. 1975 మోడల్ మహీంద్రా జీపు ఇస్తారు కానీ డ్రైవర్ ఇవ్వరంట ఒక వేళ ఆ జాబ్ వస్తే ఇప్పుడు అర్జెంటుగా జీపు తోలడం(?) నేర్చుకోవాలి కాబోలు. ఎందుకైనా మంచిది పనిలో పని బస్సు, ట్రైను, విమానం ఇవన్నీ తోలడం కూడా నేర్చేసుకుంటే ఒక పనైపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైతే అది వాడేసుకోవచ్చు ఏమంటారు??? సరే ఏదో ఒకటి అనండి నేను మాత్రం ఇంటికెళ్ళాలి, వర్షం తగ్గింది ఇంకా ఆకలేస్తుంది. మళ్ళీ కలుస్తా త్వరలో ఏదో ఒక వార్త తో. బై బై.
12 comments:
Hi
Salt can be produced in labs and controleld environments.............Why to depend on extrernal factors/environemnts and suffer the lives.
జీపు కన్నా , మోటర్ బైక్ ఐతే పల్లెల్లో సందుల గొందుల్లో సునాయాసంగా వెళ్ళ వచ్చు. దుమ్ము పడకుండా ఓ నల్ల లెదర్ జాకెట్ , నల్ల కళ్ళజోడు, బూట్లు, జీను పేంటు అయితే బాగుంటుంది. జీపు బదులు ఇవి అడగండి, అన్నీ కలిపినా జీప్ కన్నా చాలా తక్కువ. పైగా పెట్రోల్ ఆదా.
I am felt very sad by remembering the salt farming people. Most of the people don't know about these salt farm's and no one think about this.L
sireesh gaaru,
I appreciate your social concern.
Wish you good luck.
Ramu
apmediakaburlu.blogspot.com
ఎన్ని రకాల సమస్యలండి... ముఖ్యంగా రైతులకు సమస్యలొస్తే చాలా బాధేస్తుంది.
ప్రభుత్వాలకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలనిపిస్తుంది. కాని నాకు పెద్దగా రావు. నా బదులు మీరు( ఈ కామెంట్ చూసిన వాళ్లందరూ) తిట్టండి.
@ savvaDi, thiTTi emi use ledu, prabhutwam anTea manamea.
@Ramu gaaru,anonymous thanks for your comment
@Anonymous, ippuDU jillalu jillalu tiragaali, graamaalu kaadu soo meeru cheppina bullet suit kaadu. ante kaadu, meeru cheppina costume kooda naaku suit kaadu.
@ Vara, ade mana samasya, peda raitulu cheasea pani antaa machines easy gaa cheaseastunnaayi, konni lakhala kuTumbaala jeevanoapaadi taraalugaa cheastunna vrutti maaneasi vaalleami cheyyaali?
@VARA
Yes you are right!
Na+Cl -> NaCl mee formula naaku telisipOyindi. :)
Na, Cl lanu ekkaDa dorukutaayanDi?
నిజంగా ఓ మాజీ ముఖ్యమంత్రి అలా అన్నాడా?
గాంధీజీ వుప్పు సత్యాగ్రహం గురించి కూడా తెలియని కాంగీరేసోడా వాడు!
అలాంటివాళ్ళని వుప్పుపాతరేసినా పాపం లేదు.
మీ కన్సర్న్ నాకు బాగా నచ్చింది.
తప్పకుండా అన్ని వాహనాలూ నడిపించడం నేర్చుకోండి--లేకపోతే, (జేమ్స్ బాండ్ కి లా) 'మిషన్' పూర్తయ్యాక, ఇంటికి చేరడానికి యే వాహనం అందుబాటులో వుంటుందో తెలియదు కదా!
బెస్ట్ ఆఫ్ లక్!
Nice post!
చాలా ఆర్ద్రంగా రాసారు. చివర్లోని జీపు ఛలోక్తి కూడా నచ్చింది. :)
@ chaduvari, Sunita thanks alot
@krishna sri garu, thanks for the coment, uppu patara veddamante aa uppu waste avutundi kaani other use emi radu.
Post a Comment